వేటాడు వెంటాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేటాడు వెంటాడు
దర్శకత్వంతిరు
కథతిరు
నిర్మాతశ్రీనివాస్ దామెర
తారాగణంవిశాల్, త్రిషమనోజ్ బాజ్‌పాయ్, సునయన
ఛాయాగ్రహణంరిచర్డ్ ఎం. నాథన్
కూర్పురూబెన్
సంగీతంపాటలు:
యువన్ శంకర్ రాజా
బ్యాక్‌గ్రౌండ్ సంగీతం :
ధరన్
నిర్మాణ
సంస్థ
ఫైవ్ కలర్స్ మీడియా
విడుదల తేదీ
2013 జనవరి 25 (2013-01-25)
సినిమా నిడివి
137 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

వేటాడు వెంటాడు 2013లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2013లో “సామర్” పేరుతో విడుదలైన ఈ సినిమాను వేటాడు వెంటాడు పేరుతో ఫైవ్ కలర్స్ మీడియా బ్యానర్ పై శ్రీనివాస్ దామెర నిర్మించగా తిరు దర్శకత్వం వహించాడు. విశాల్, త్రిష, మనోజ్ బాజ్ పాయ్, సునయన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది.

కథ[మార్చు]

ఊటీలో రెస్ట్ ట్రెక్ గైడ్ గా పని చేసే శంకర్ (విశాల్), రూపా (సునయన) ప్రేమించుకుంటారు. అయితే శంకర్ కి చెప్పాపెట్టకుండా రూప బ్యాంకాక్ వెళ్ళిపోతుంది. రూప ఎందుకు వెళ్ళిపోయిందో శంకర్ కి అర్ధం కాదు. ఓ రోజు… ‘పదే పదే నువ్వే గుర్తొస్తున్నావ్. చూడకుండా ఉండలేను. నువ్వు కూడా బ్యాంకాక్ వచ్చేయ్’ అని కబురు పంపిస్తుంది. సరే అని శంకర్ కూడా బ్యాంకాక్ బయలుదేరతాడు. ఎయిర్ పోర్ట్ లో శంకర్ కి మాయ (త్రిష) పరిచయం అవుతుంది. అయితే బ్యాంకాక్ లో రూప జాడ కనిపెట్టలేకపోతాడు. జాన్(జెడి చక్రవర్తి), అరుణాచలం(మనోజ్ బాజిపాయ్)ల వల్ల ఇబ్బందులు పడుతూ తనలాగే బ్యాంకాక్ లో మరొకరు వున్నట్టు తెలుసుకుంటాడు. ఎవరో తనని చంపడానికి వెంబడిస్తున్నట్టు అనుమానం వస్తుంది. ఇంతకీ రూప ఏమయ్యింది? శంకర్ లా వున్నా వ్యక్తి ఎవరు ? తనని చంపడానికి ప్రయత్నిస్తున్న ముఠా ఆచూకి శంకర్ కనిపెట్టాడా ? లేదా ? అనేదే సినిమా మిగతా కథ.[1][2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఫైవ్ కలర్స్ మీడియా
  • నిర్మాత: శ్రీనివాస్ దామెర
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: తిరు
  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • సినిమాటోగ్రఫీ: రిచ్చర్డ్. ఎమ్.నాధన్
  • మాటలు: శశాంక్ వెన్నెలకంటి

మూలాలు[మార్చు]

  1. The Times of India (2013). "Vetadu Ventadu Movie Review". Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
  2. News18 (25 January 2013). "'Vetadu Ventadu' Review: The movie is a borrowed thriller" (in ఇంగ్లీష్). Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)