Jump to content

వేదరత్నం అప్పకుట్టి

వికీపీడియా నుండి
వేదరత్నం అప్పకుట్టి
జననం
వేదారణ్యం, నాగపట్నం జిల్లా, తమిళనాడు, భారతదేశం
ఇతర పేర్లువేదరత్నం అప్పకుట్టి పిళ్ళై
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త
తల్లిదండ్రులుఎ. వేదరత్నం పిళ్ళై
పురస్కారాలుపద్మశ్రీ

వేదరత్నం అప్పకుట్టి పిళ్ళై, తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త. తమిళనాడు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో మహిళల సంక్షేమం కోసం పనిచేసే లాభాపేక్షలేని సంస్థ కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ సహ వ్యవస్థాపకుడు.[1]

జననం

[మార్చు]

వేదరత్నం అప్పకుట్టి పిళ్ళై, తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని వేదారణ్యంలో జన్మించాడు. తండ్రి ఎ. వేదరత్నంకి ఉప్పు వ్యాపారం ఉంది. స్వాతంత్ర్య ఉద్యమకారుడిగా ఉద్యమంలో పాల్గొన్నాడు.[2] తన తండ్రితో పాటు అతను కూడా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.

సామాజిక సేవ

[మార్చు]

వేదారణ్యం గ్రామంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల బాలికల కోసం గ్రామీణ రెసిడెన్షియల్ పాఠశాల అయిన కస్తూర్బా గాంధీ కన్యా[3] గురుకులాన్ని ఏర్పాటుచేయడంలో తన తండ్రికి సహకరించాడు.[4][5] తరువాతికాలంలో ప్రింటింగ్ పాఠశాల, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ శిక్షణ పాఠశాల, ధూపం తయారీ యూనిట్‌ను స్థాపించారు.[6]

పురస్కారాలు

[మార్చు]

1989లో భారత ప్రభుత్వం నుండి భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. "Services of freedom fighter Sardar Vedaratnam recalled". The Hindu. 27 February 2008. Retrieved 8 September 2021.
  2. "Indian Freedom Fighters: Sardar A. Vedaratnam Pillai, Vedaraniam, Tamil Nadu". www.sb.fsu.edu. Archived from the original on 20 జనవరి 2022. Retrieved 8 September 2021.
  3. Reporter, Staff (2011-01-26). "Two NGOs receive Japanese grant". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 8 September 2021.
  4. "Kavignar Ramalingam Pillai's statue unveiled by Elangovan". The Hindu. 16 February 2009. Retrieved 8 September 2021.
  5. "Indian Freedom Fighter". SB FSU. 2006. Archived from the original on 20 జనవరి 2022. Retrieved 8 September 2021.
  6. "Satsang introduction". Oocities. 2015. Retrieved 8 September 2021.
  7. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 8 September 2021.