సర్దార్ వేదరత్నం
సర్దార్ వేదరత్నం పిళ్ళై | |
---|---|
![]() 1998 భారత స్టాంపు మీద వేదరత్నం ఫోటో | |
జననం | 25 ఫిబ్రవరి 1897[1] వేదారణ్యం, నాగపట్నం జిల్లా, తమిళనాడు, భారతదేశం |
మరణం | 1961 ఆగస్టు 24 | (వయసు 64)
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు |
పిల్లలు | వేదరత్నం అప్పకుట్టి (కుమారుడు) |
సర్దార్ వేదరత్నం పిళ్ళై (1897 ఫిబ్రవరి 25 - 1961 ఆగస్టు 24) భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, 14 సంవత్సరాలపాటు (మూడుసార్లు) ఎమ్మెల్యేగా పనిచేశాడు. 1930లో సి. రాజగోపాలాచారితో కలిసి వేదారణ్యంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొన్నాడు. వీరోచిత రచనలు కూడా చేశాడు.
జననం[మార్చు]
వేదరత్నం 1897, ఫిబ్రవరి 25న తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని వేదారణ్యంలో జన్మించాడు.
ఉద్యమం[మార్చు]
గాంధీజీ చేస్తున్న ఉద్యమం చూసి ఆ ప్రభావంతో విదేశీ వస్త్రాన్ని బహిష్కరించి, స్వదేశి దుస్తులను తయారుచేసి ధరించాలని నిర్ణయించుకున్నాడు. తన చుట్టూ ఉన్నవారిని కూడా ప్రోత్సహించాడు. ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం కూడా గడిపాడు.[2] 1931లో వేదారణ్యం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు తిరునల్వేలిలో తమిళనాడు వ్యవసాయాధికారులు, కార్మికుల సమావేశంలో వేదరత్నానికి 'సర్దార్' బిరుదు బహూకరించారు.
సామాజిక సేవ[మార్చు]
వేదారణ్యం గ్రామంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల బాలికల కోసం 1946లో గ్రామీణ రెసిడెన్షియల్ పాఠశాల అయిన కస్తూర్బా గాంధీ కన్యా గురుకులం స్థాపించాడు.[3]
గుర్తింపు[మార్చు]
పిళ్ళై స్థాపించిన గ్రామీణ మహిళా సంక్షేమ సంస్థ అనేక సంవత్సరాలుగా వేలాది మంది పేద బాలికలకు సహాయాన్ని అందింస్తూ వస్తోంది. వివిధ దేశాల నుండి చాలామంది ఈ గురుకులాన్ని సందర్శించి సేవలను ప్రశంసించారు.[3][4][5][6] మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యునిగా మూడు ఎన్నికలలో వేదరత్నం విజయం సాధించాడు. ఈ స్థానంలో అతను సంపాదించిన డబ్బును, శ్రీ రామకృష్ణ మిషన్‌కు విరాళంగా ఇచ్చాడు.[7] పదేళ్ళపాటు తంజావూరు జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఏకైక కార్యదర్శిగా కూడా పనిచేశాడు.[2]
మూలాలు[మార్చు]
- ↑ Varadarajan, R. (25 August 2000). "Sardar of the salt satyagraha". The Hindu. Archived from the original on 2 June 2017. Retrieved 12 September 2021.
- ↑ 2.0 2.1 Varadarajan, R. (2000).
- ↑ 3.0 3.1 "Gurukulam – Just another WordPress site". www.gurukulam.org. Retrieved 12 September 2021.
- ↑ "Two Japanese professors visit Gurukulam in Vedaranyam". The Hindu (in Indian English). 6 March 2009. ISSN 0971-751X. Retrieved 12 September 2021.
- ↑ "Services of freedom fighter Sardar Vedaratnam recalled". The Hindu (in Indian English). 27 February 2008. ISSN 0971-751X. Retrieved 12 September 2021.
- ↑ "Archived copy". Archived from the original on 19 నవంబరు 2008. Retrieved 12 సెప్టెంబరు 2021.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ Indian Freedom Fighters: Sardar A. Vedaratnam Pillai, Vedaraniam, Tamil Nadu. (2006).