Jump to content

వేదాంతం వెంకట సూర్యనారాయణ

వికీపీడియా నుండి

వేదాంతం వెంకట సూర్యనారాయణ ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన కూచిపూడి నాట్య పరంపర కలిగిన కుటుంబానికి చెందిన వేదాంతం మల్లికార్జునశర్మ, సీతారామలక్ష్మి దంపతులకు కూచిపూడి గ్రామంలో జన్మించాడు. ఆయన నాట్యాచార్యుడు అయిన పసుమర్తి వేణుగోపాలశర్మ వద్ద తన ఐదవ యేట మొట్టమొదట శిష్యరికం చేసాడు. తరువాత ప్రసిద్ధ గురువు వేదాంతం రాఘవయ్య శర్మ, వెంపటి చినసత్యం వద్ద నాట్యకళనభ్యసించాడు.

ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి సర్టిఫికేటు కోర్సును చేసాడు. ఆయన భారతదేశంలో అనేక ప్రదర్శనలిచ్చాడు. ప్రత్యేకంగా తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లలో చాలా ప్రదర్శనలిచ్చాడు.

ఆయన ప్రదర్శించిన కూచిపూడి యక్షగానాలైన భక్త ప్రహ్లాద, పార్వతీ పరిణయం మొదలగు ప్రదర్శనలలోని పాత్రలలో బ్రహ్మ, విష్ణు, రాక్షస, ఋషి మొదలగు పాత్రలు విలక్షణంగా సభాసదులను రంజింపజేసేవి.

ఆయన అన్నమాచార్య కీర్తనలు, అష్ట విధ నాయకలు లను కొత్త కంపోజిషన్ లతో కొరియాగ్రాఫ్ చేసాడు. ఆయన నృత్య దర్శకత్వంపై ఆసక్తి కనబరచేవాడు.[1]

ఆయన కుమారులైన వేదాంతం రాధేశ్యాం[2]  కూచిపూడి నాట్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కావడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆయన శ్రీసిద్ధేంద్ర కళాక్షేత్రంలో అధ్యాపకుడిగా పనిచేసి 2013లో ఉద్యోగ విరమణ చేశారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Vedantam Venkata Suryanarayana". Archived from the original on 2017-01-30. Retrieved 2016-11-12.
  2. Passion, unabated- June 18, 2015 15:27 IST -The Hindu
  3. వేదాంతం రాధేశ్యాంకు సంగీత నాటక అకాడమీ అవార్డు[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]