Jump to content

వేన్ పార్నెల్

వికీపీడియా నుండి
వేన్ పార్నెల్
2010 లో పార్నెల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వేన్ డిల్లాన్ పార్నెల్
పుట్టిన తేదీ (1989-07-30) 1989 జూలై 30 (వయసు 35)
పోర్ట్ ఎలిజబెత్, కేప్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
మారుపేరుపీజియన్,[1] పార్నీ
ఎత్తు6 అ. 2 అం. (1.88 మీ.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 307)2010 జనవరి 14 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2017 అక్టోబరు 6 - బంగ్లాదేశ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 94)2009 జనవరి 30 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2023 మార్చి 21 - వెస్టిండీస్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.7
తొలి T20I (క్యాప్ 39)2009 జనవరి 13 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2023 మార్చి 28 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07–2010/11[a]ఈస్టర్న్ ప్రావిన్స్
2008/09–2014/15వారియర్స్
2009కెంట్
2011–2013Pune వారియర్స్
2015/16–2017/18కేప్ కోబ్రాస్
2015/16–presentవెస్టర్న్ ప్రావిన్స్
2016–2017బార్బడాస్ Tridents
2017కెంట్
2018–2020వోర్సెస్టర్‌షైర్
2023రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2023డర్హమ్‌
2023Seattle Orcas
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I ఫక్లా
మ్యాచ్‌లు 6 73 55 84
చేసిన పరుగులు 67 574 172 2,728
బ్యాటింగు సగటు 16.75 20.50 19.11 27.55
100లు/50లు 0/0 0/1 0/0 2/17
అత్యుత్తమ స్కోరు 23 56 29* 111*
వేసిన బంతులు 556 3,224 1,070 12,635
వికెట్లు 15 99 59 242
బౌలింగు సగటు 27.60 30.40 24.91 29.91
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 2 1 9
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 2
అత్యుత్తమ బౌలింగు 4/51 5/48 5/30 7/51
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 13/– 7/– 25/–
మూలం: ESPNcricinfo, 2023 మే 4

వేన్ డిల్లాన్ పార్నెల్ (జననం 1989 జూలై 30) దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ క్రికెటరు. అతను ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్ తరపున ఆడాడు.

గతంలో, పార్నెల్ దక్షిణాఫ్రికా తరపున టెస్టు క్రికెట్, వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్, ట్వంటీ-20 మ్యాచ్‌లు ఆడాడు. దేశీయ స్థాయిలో అతను కేప్ కోబ్రాస్ కోసం ఆడాడు. గతంలో వారియర్స్‌కు, తూర్పు ప్రావిన్స్‌కూ ఆడాడు.

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

పార్నెల్ 1989లో పోర్ట్ ఎలిజబెత్‌లో జన్మించాడు. అతను తన సొంత పట్టణంలోని గ్రే హై స్కూల్‌లో 2007 వరకు చదివాడు. అతను పోర్ట్ ఎలిజబెత్‌లోని నెల్సన్ మండేలా మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయంలో మానవ వనరుల నిర్వహణను అభ్యసించాడు.

ఫ్రాంచైజీ ట్వంటీ 20 క్రికెట్

[మార్చు]

పార్నెల్ 2010 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కోసం వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు సంతకం చేసాడు.[2] వేలం ప్రారంభంలో నిర్ణయించిన రిజర్వ్ ధర కంటే చాలా ఎక్కువ ధరకు అతన్ని కొనుక్కున్నారు. [3] టోర్నమెంట్‌లో అత్యధిక పారితోషికం పొందిన మూడవ దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా నిలిచాడు. కానీ సీజన్‌లో ఢిల్లీ తరపున మ్యాచ్‌లేమీ ఆడలేదు.[4]

పార్నెల్ 2011 నుండి 2013 వరకు IPLలో పూణే వారియర్స్ తరపున ఆడాడు, 2014 సీజన్లో డేర్ డెవిల్స్ తరపున ఆడటానికి ఢిల్లీకి తిరిగి వచ్చాడు.[5] పూణే ఆటగాడిగా ఉండగా, అతను [6] లో ముంబయి సబర్బ్‌లో ఒక రేవ్ పార్టీపై దాడి జరిపి, పోలీసులు అదుపులోకి తీసుకున్న 90 మందిలో ఒకడు. ఆ తరువాత పార్నెల్ కోర్టులో హాజరుకాగా, డ్రగ్స్ సంబంధిత ఆరోపణల నుండి విడుదలయ్యాడు.[7] భారతదేశంలో జరిగిన 2014 ప్రపంచ T20 పోటీలో పార్నెల్ దక్షిణాఫ్రికా జట్టులో ఉన్నప్పుడు తదుపరి విధానపరమైన కోర్టు హాజరు జరిగింది. [8] [9] పార్నెల్ తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, నిర్దోషిననీ పేర్కొన్నాడు. [7]


2016 కరేబియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో పార్నెల్ బార్బడోస్ ట్రైడెంట్స్ తరపున ఆడాడు.

2018 జూన్ 3న, గ్లోబల్ T20 కెనడా టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్ కోసం ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో ఎడ్మంటన్ రాయల్స్ తరపున ఆడేందుకు పార్నెల్ ఎంపికయ్యాడు. [10] [11] అతను ఎడ్మంటన్ రాయల్స్ తరపున టోర్నమెంట్‌లో ఆరు మ్యాచ్‌లలో ఆరు అవుట్‌లతో సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలరుగా నిలిచాడు. [12]

2018 సెప్టెంబరులో, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు మొదటి ఎడిషన్‌లో పార్నెల్, కాబూల్ జట్టులో ఎంపికయ్యాడు. [13] అతను టోర్నమెంట్‌లో పది మ్యాచ్‌లలో పదమూడు ఔట్‌లతో, కాబుల్ జ్వానన్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. [14]


2023 ఏప్రిల్ 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రీస్ టోప్లీకి బదులుగా పార్నెల్‌ను తీసుకుంది. [15] అతను INR 75 లక్షల ధరతో RCBలో చేరాడు. [16]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]
అడిలైడ్ ఓవల్ నెట్స్‌లో పార్నెల్ బౌలింగ్, జనవరి 2009

పార్నెల్ 2008 U/19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు , 2006 U/19 క్రికెట్ ప్రపంచ కప్‌లో కూడా జట్టు తరపున ఆడాడు. అతను 2008 టోర్నమెంట్‌ను 8.38 సగటుతో 18 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ముగించాడు. [17] బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్-ఫైనల్‌లో అతను ఎనిమిది పరుగులకు ఆరు వికెట్లు తీసుకున్నాడు. అలాగే 57 పరుగులతో అత్యధిక స్కోరు చేశాడు [18]

పార్నెల్ 2008-09లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా పర్యటన కోసం వన్‌డే, T20 జట్లలో ఎంపికయ్యాడు, [19] [20] 2009 జనవరి 13న బ్రిస్బేన్‌లో జరిగిన రెండో ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లో అంతర్జాతీయ రంగ ప్రవేశం చేశాడు. అతను బౌలింగులో బాగా పరుగులిచ్చాడు, కీలకమైన క్యాచ్‌ను వదిలేసాడు. అయితే ప్ర్రేక్షకులెవరో అతని కళ్ళలోకి ఆకుపచ్చ లేజర్ కాంతిని ప్రసరింపజేయడం వల్ల ఇలా జరిగిందని తరువాత తెలిసింది. [21] క్రికెట్ సౌతాఫ్రికా (CSA) ద్వారా జాతీయ కాంట్రాక్ట్‌ను అందుకున్న అతి పిన్న వయస్కుడిగా అతడు నిలిచాడు. [22]

కేప్ టౌన్ [23] లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ, చివరి టెస్టు కోసం పార్నెల్‌ను దక్షిణాఫ్రికా జట్టులో చేర్చుకున్నారు. ఆ తరువాత జరిగిన ట్వంటీ 20, వన్‌డే సిరీస్‌లకు అతను ముందు ఎంపిక కానప్పటికీ, తరువాత ఎంపికయ్యాడు. డేల్ స్టెయిన్‌తో కలిసి కొత్త బంతిని పంచుకుంటూ, సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్‌డేలో [24] 25 పరుగులకు నాలుగు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

2009 మేలో ఇంగ్లండ్‌లో జరిగిన ICC వరల్డ్ ట్వంటీ20 కి దక్షిణాఫ్రికా జట్టులో పార్నెల్ ఎంపికయ్యాడు. ఆ టోర్నమెంటు అతనికి అద్భుతంగా జరిగింది. 13.22 సగటుతో తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ రేటు ఆరు కంటే తక్కువ. [25] ఆతిథ్య జట్టుకు వ్యతిరేకంగా అతను ఓపెనింగ్ స్పెల్‌లో 2–0–2–1 సాధించాడు. మొత్తం స్కోరు 3/14. [26] వెస్టిండీస్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌లో 4/13తో అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [27] అతని ప్రదర్శనలు అతనికి టోర్నమెంటుకు సంబంధించిన ఊహాత్మక ప్రపంచ జట్టులో చోటు సంపాదించిపెట్టాయి. [28] 2009 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో 11 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా పార్నెల్ గోల్డెన్ బాల్‌ను గెలుచుకున్నాడు. అతను 2009 T20I ప్రపంచ కప్ కోసం క్రిక్‌ఇన్‌ఫో వారి 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'లో ఎంపికయ్యాడు. [29]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2011 జూలై 30న, పార్నెల్ తాను 2011 జనవరిలో ఇస్లాంలోకి మారినట్లు ప్రకటించాడు. తన నిర్ణయంపై తన సహచరులు హషీమ్ ఆమ్లా, ఇమ్రాన్ తాహిర్, జట్టు మేనేజర్ మొహమ్మద్ మూసాజీల ప్రభావమేమీ లేదని పార్నెల్ ధృవీకరించాడు. అతను వలీద్ అనే పేరును తీసుకోవాలని భావించాడు. దీని అర్థం 'నవజాత కుమారుడు' అని. కానీ వేన్ అని పేరుతోనే పిలుస్తున్నారు. [30] [31] [32] [33]

పార్నెల్ పెటాకు మద్దతుగా ప్రకటనలలో కనిపించాడు. [32] అతను 2016 మేలో దక్షిణాఫ్రికా ఫ్యాషన్ బ్లాగర్ ఐషా బేకర్‌ను వివాహం చేసుకున్నాడు [34]

గమనికలు

[మార్చు]
  1. Not every team that Parnell has played for is listed here. Only sides he played for in more than one season are included.

మూలాలు

[మార్చు]
  1. "Wayne becomes Whallid Parnell". IOL. Retrieved 1 November 2013.
  2. Anton Crump (January 19, 2010). "Bond sold in huge IPL bidding war". ONE Sport. Retrieved 9 July 2014.
  3. "Kieron Pollard and Shane Bond attract big money bidders". London Evening Standard. 19 January 2010. Retrieved 9 July 2014.
  4. "AUCTION SUM STUNS PARNELL". The Tribune. January 21, 2010. Retrieved 9 July 2014.
  5. Rohan Raj (April 11, 2014). "IPL 2014: Delhi Daredevils Team Profile". India Today. Retrieved 9 July 2014.
  6. Karhadkar A (2013) Parnell, Rahul Sharma charged in recreational drugs case, CricInfo, 2013-03-07.
  7. 7.0 7.1 Parnell appears in court, gets bail, CricInfo, 2013-04-08.
  8. Parnell called to Mumbai court hearing, CricInfo, 2014-03-26.
  9. Wilson A (2014) Wayne Parnell called away from World T20 over 'drug-related charges', The Guardian, 2014-03-26.
  10. "Global T20 Canada: Complete Squads". SportsKeeda. Retrieved 4 June 2018.
  11. "Global T20 Canada League – Full Squads announced". CricTracker. 4 June 2018. Retrieved 4 June 2018.
  12. "Global T20 Canada 2018, Edmonton Royals: Batting and Bowling Averages". ESPN Cricinfo. Retrieved 16 July 2018.
  13. "Afghanistan Premier League 2018 – All you need to know from the player draft". CricTracker. 10 September 2018. Retrieved 10 September 2018.
  14. "Afghanistan Premier League, 2018/19 - Kabul Zwanan: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 22 October 2018.
  15. "Topley out of IPL 2023 with shoulder injury, Parnell named replacement". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 7 April 2023.
  16. "Bangalore picks Wayne Parnell and Vyshak Vijay Kumar as replacements". Crickdom.news. 6 April 2023. Archived from the original on 23 సెప్టెంబరు 2023. Retrieved 3 సెప్టెంబరు 2023.
  17. Under-19 World Cup, 2007/08 – Most Wickets, Cricinfo, Retrieved on 30 April 2008
  18. Bangladesh Under-19s v South Africa Under-19s, Scorecard, CricketArchive, Retrieved on 30 April 2008
  19. South Africa in Australia Twenty20 International Series, 2008/09 – South Africa Twenty20 Squad, Cricinfo, Retrieved on 13 January 2009
  20. South Africa in Australia ODI Series, 2008/09 – South Africa ODI Squad, Cricinfo, Retrieved on 13 January 2009
  21. The Proteas might have lost anyway, IOL, Retrieved on 29 July 2009
  22. Cricinfo staff (January 2010). "Wayne Parnell". ESPN. Retrieved 6 July 2014.
  23. Kallis appointed S Africa captain, BBC Sport, 10 March 2009, Retrieved on 29 July 2009
  24. Parnell and Steyn crush Australia, Cricinfo, Retrieved on 29 July 2009
  25. ICC World Twenty20, 2009 – South Africa averages, Cricinfo, Retrieved on 29 July 2009
  26. England v South Africa (14th match, Group E), commentary, Cricinfo, Retrieved on 29 July 2009
  27. South Africa v West Indies (17th match, Group E), scorecard, Cricinfo, Retrieved on 29 July 2009
  28. Three South Africans in World T20 team, IOL, Retrieved on 29 July 2009
  29. "The top crop". ESPNcricinfo. Retrieved 16 November 2021.
  30. Jang, Online. "Wayne Parnell embraces Islam". TheNews. Retrieved 29 July 2011.
  31. The Express, Tribune (29 July 2011). "S.African bowler Wayne Parnell converts to Islam". News. Retrieved 29 July 2011.
  32. 32.0 32.1 Shiamak Unwalla (2015) Wayne Parnell: 10 interesting things to know about the South African pacer, Criclife, 2015-07-30.
  33. "Parnell clarifies Islam stance". Sport24. Retrieved 26 January 2017.
  34. "Wayne Parnell's wedding photos with fashion blogger wife Aisha Baker go viral". sportskeeda.com. Retrieved 2016-10-28.