వేములపల్లి విజయ
Jump to navigation
Jump to search
వేములపల్లి విజయ | |
---|---|
జననం | 1964 |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
వేములపల్లి విజయ ప్రముఖ రంగస్థల నటీమణి. 1985లో రంగస్థలంపై అడుగు పెట్టిన విజయ, నాటక, నాటికల ప్రదర్శనలలో పాల్గొని, అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా బహుమతులు, సత్కారాలు అందుకుంది.[1]
జననం
[మార్చు]విజయ 1964లో కోటేశ్వరరావు, బేబిసరోజిని దంపతులకు గుడివాడలో జన్మించింది.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]విజయ తల్లి నృత్యకళాకారిణి కావడంతో చిన్ననాటి నుండే నృత్యం, సంగీతం పట్ల ఆసక్తి కలిగింది. హార్మోనిస్టు కోటేశ్వరరావు అవిడను నటనలో, నృత్యంలో, గాత్రంలో తీర్చిదిద్దాడు. 1985లో తొలిసారిగా రంగస్థలంపై అడుగుపెట్టింది. పూలరంగడు సాంఘిక నాటకంలోని రంగమ్మ పాత్ర ద్వారా రాష్ట్రస్థాయిలో గుర్తింపును సొంతం చేసుకొని, దాదాపు 25 ఉత్తమ నటి అవార్డులను అందుకుంది. ప్రజానాట్యమండలితో కలిసి అనేక ప్రదర్శనల్లో పాల్గొన్నది.
నటించినవి
[మార్చు]సాంఘిక నాటకాలు:
- పూలరంగడు
- చిల్లరకొట్టుచిట్టెమ్మ
- నీతీ నీస్థానమెక్కడీ
- పావలా
- రక్తకన్నీరు
- హంసగీతం
- నాగులు తిరిగే కోనలు (నాటిక)
పౌరాణిక నాటకాలు:
- గణపతి మహత్యం (మోహిని)
- అన్నమయ్య (గాయిత్రి)
- సారంగధరలో (చిత్రాంగి)
- మంజునాధ (కాత్యాయని)
- బాలనాగమ్మ (సంగు)
- దావీదు విజయం
- ధనవంతుడు లాజరు
- రక్త పాశం
మూలాలు
[మార్చు]- ↑ ప్రజాశక్తి (31 January 2018). "ఎదిగిన కొద్ది .. ఒదుగుతూ." Archived from the original on 22 June 2018. Retrieved 22 June 2018.