Jump to content

వేలు నాచియార్

వికీపీడియా నుండి
రాణి వేలు నాచియార్
శివగంగై రాజ్య మహారాణి
రామనాథపురం రాజ్య యువరాణి
పరిపాలనc. 1780-c. 1790[1]
ఉత్తరాధికారివెల్లచ్చి [2]
జననం3 జనవరి 1730
రఘునాథపురం, తమిళనాడు, భారతదేశం.
మరణం1796 డిసెంబరు 25(1796-12-25) (వయసు 66)
శివగంగై, తమిళనాడు, భారతదేశం
తండ్రిచెల్లముతు విజయరఘునాథ సేతుపతి
తల్లిముతాతల్ నాచియార్
మతంహిందూ శైవం
శివగంగై రాజ్యంలోని చారిత్రాత్మకమైన ఆమెనివాసం వద్ద విగ్రహం.

రాణి వేలు నాచియార్ (3 జనవరి 1730 – 25 డిసెంబరు 1796) శివగంగ సంస్థానాన్ని 1780-1790 మధ్యలో పరిపాలించిన రాణి. ఈమె బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి భారతీయ మహారాణి. ఈమె ధైర్యసాహసాలకి గుర్తుగా తమిళులు ఈమెను వీరమంగై ("వీరవనిత") అని పిలుస్తారు.[మూలాలు తెలుపవలెను]

జీవితం

[మార్చు]

వేలు నాచియార్ రామనాథపురం ప్రాంతానికి యువరాణి. ఈమె రామనాడు రాజ్యాన్ని పరిపాలించిన రాజా చెల్లముత్తు విజయరఘునాథ సేతుపతి ,  రాణి సాకందిముత్తల్ ల ఏకైక పుత్రిక. నాచియార్ చిన్నతనం నుండే యుద్ధవిద్యలలో ఆరితేరింది. విలువిద్య,  గుర్రపుస్వారీ,  వలరి, సిలంబం(కర్రసాము) వంటి యుద్ధనైపుణ్యాలలో దిట్ట. అంతే కాదు, చాలా భాషలలో పండితురాలు. ఫ్రెంచిఆంగ్లము ఇంకా ఊర్దూభాషలు ఆమెకి కరతలామలకం. ఈమెకు శివగంగై రాజైన మన్నార్ ముత్తువడుగనాథ పెరియవ ఉడైతేవర్ తో వివాహంజరిగింది. వీరికి ఒక పుత్రిక కూడా జన్మించింది. ఈమె భర్తను బ్రిటిష్ సైనికులు, ఆర్కాట్ నవాబు కొడుకుకలిసి కైలయార్ కోయిల్ యుద్ధం లో హతమార్చారు. దీంతో నాచియార్ యుద్ధానికిసన్నద్ధమైంది. కానీ సైన్యం లేకపోవడంతో దిండిగల్ వద్ద విరూపాక్షి ప్రాంతంలో పలయకారర్ కొపాల నాయక్కర్ అండలో  తన కుమార్తెతో కలిసి ఎనిమిదేళ్లపాటు తలదాచుకోవలసి వచ్చింది.

ఈ కాలంలోనే గోపాల్ నాయకర్, సుల్తాన్ హైదర్ అలీ సహకారంతో సైన్యాన్ని సమకూర్చుకుని, 1780 లో బ్రిటిష్ వారిపై సమరశంఖం పూరించింది నాచియార్. బ్రిటిష్ ఆయుధాగారన్ని తన సేనా నాయికురాలైన కుయిలి ఆత్మాహుతి ద్వారా నాశనం చేసింది  "ఉడైయాల్" అనే స్త్రీసేనను పోరాటంలో మరణించిన తన దత్తపుత్రిక పేరుతో స్థాపించింది. తన సాహసంతో రాజ్యాన్ని తిరిగి కైవశం చేసుకుంది. ఎన్నో కష్టాలకోర్చి చివరికి  తన  రాజ్యాన్ని  తిరిగి సంపాదించిన అతికొద్దిమందిలో నాచియార్ ఒకరు. 1970 లో ఆమె తరువాత ఆమె కుమార్తె వెల్లచ్చి శివగంగసంస్థానానికి రాణి అయింది. హైదర్ ఆలీ సైన్యం సహాయంతో ఆర్కాట్ నవాబును కూడా ఓడించింది. వీరవనిత అనే నామాన్ని సార్ధకపరచుకొంది.

భారతదేశంలో బ్రిటిష్ వారిపై పోరాటం సాగించిన మొట్టమొదటి రాణి వేలు నాచియార్. ఆమె 1780 లో మురుతు సోదరులకి పరిపాలనాధికారాన్ని ఇచ్చింది. ఆ తరువాత కొద్దికాలానికే, 25 డిసెంబరు 1796లో ఆమె తన ఒంటిపైన నెయ్యి పోసుకొని నిప్పంటించుకుని మంటలు చెలరేగుతున్న సమయంలో కన్నుమూసింది. ఆమెను "జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు.

వనరులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. K. R. Venkatarama Ayyar, Sri Brihadamba State Press, 1938, A Manual of the Pudukkóttai State, p.720
  2. K. R. Venkatarama Ayyar, Sri Brihadamba State Press, 1938, A Manual of the Pudukkóttai State, p.720