Jump to content

వేలూరు (వర్గల్‌)

అక్షాంశ రేఖాంశాలు: 17°48′13″N 78°32′21″E / 17.8035702°N 78.5390871°E / 17.8035702; 78.5390871
వికీపీడియా నుండి

వేలూరు, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, వర్గల్ మండలంలోని గ్రామం.[1]

వేలూరు
—  రెవెన్యూ గ్రామం  —
వేలూరు is located in తెలంగాణ
వేలూరు
వేలూరు
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°48′13″N 78°32′21″E / 17.8035702°N 78.5390871°E / 17.8035702; 78.5390871
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట
మండలం వర్గల్‌
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,943
 - పురుషుల సంఖ్య 1,454
 - స్త్రీల సంఖ్య 1,489
 - గృహాల సంఖ్య 692
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన వర్గల్ నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 55 కి. మీ. దూరంలోనూ ఉంది.ఈ గ్రామం హైదరాబాదు నుండి సుమారు 60కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి 7 పై నిజామాబాదు వైపు 50కి.మీ. ప్రయాణించి పోతరాజు పల్లి వద్ద కుడివైపు నుండి గజ్వేల్ వైపు 8 కి.మీ. ప్రయాణించి గంట్లవాగు వద్ద (ఈ ప్రదేశం పేరు క్రమంగా కనుమరుగవుతోంది) రహదారి నుండి కుడి వైపు సుమారు 2 కి.మీ. చిన్న రహదారిలో ప్రయాణిస్తే వేలూర్ చేరవచ్చు. మధ్యలో అనంతగిరి పల్లి గ్రామం వస్తుంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

గ్రామ జనాభా

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 692 ఇళ్లతో, 2943 జనాభాతో 1194 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1454, ఆడవారి సంఖ్య 1489. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 562 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 573682[3].పిన్ కోడ్: 502336.

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

వేలూరు అనే పదము ఏడూర్లు అనే మాటనుండి వచ్చిందని అంటారు. కొంత కాలం క్రితం వేలూరు గ్రామ పంచాయతి కింద సీతారాం పల్లి, అనంతగిరి పల్లి, రామచంద్రాపురాలు కలుపుకొని నాలుగు ఊళ్ళు ఉండేవి. ఇప్పుడు అనంతగిరి పల్లి వేరుగా గ్రామ పంచాయతి అయ్యింది. రామచంద్రాపురాన్ని బే చిరాగ్ గాంవ్ అని పిలుస్తారు (దీపాలు లేని ఊరు). గ్రామానికి ఇరుప్రక్కల ఉన్న అనంత గిరి పల్లి, సీతారాం పల్లిలు కొన్ని వందల సంవత్సరాల క్రితం వేలూరు గ్రామానికి చెందిన అనంతగిరి రావు, సీతరాం రావు అనేవారి అగ్రహారాలని వినికిడి

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి మెంటూర్లో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల గజ్వేల్లోను, ఇంజనీరింగ్ కళాశాల గౌరారం (వర్గల్‌)లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల హైదరాబాదులోను, పాలీటెక్నిక్‌ గజ్వేల్లోను, మేనేజిమెంటు కళాశాల వర్గల్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మేడ్చల్లోను, అనియత విద్యా కేంద్రం హైదరాబాదులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల అచ్చాయిపల్లి లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

వెలూరులో ఉన్న ఒక పశు వైద్యశాలలో ఇద్దరు డాక్టర్లు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

వెలూరులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

వెలూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 343 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 38 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 46 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 38 హెక్టార్లు
  • బంజరు భూమి: 266 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 461 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 420 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 345 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

వెలూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • రంగని చెరువు ప్రధాన తాగునీటి వనరు
  • పటేల్ చెరువు, దేవర చెరువు, ఇంకా చిన్న నీటికుంటలు వ్యవసాయ నీటివనరులు.
  • కాలువలు: 177 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 167 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

వేలూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]
  • చెరకు మిల్లులు ఉన్న కాలంలో అది ప్రధాన పంటగా ఉండేది.
  • కూరగాయలు,
  • పొద్దుతిరుగుడు పువ్వు,
  • మామిడి తోటలు,
  • జొన్న

మొక్కజొన్న, ప్రత్తి, వరి మొదలగునవి

గ్రామంలోని ఆలయాలు

[మార్చు]

దగ్గరలోని నాచగిరి నరసింహ స్వామి క్షేత్రం ఇక్కడి ప్రాంతంలో సుప్రసిద్దం. ఈ క్షేత్రం వేలూరు సరిహద్దుల్లో (శివారు లో) ఉండడం వల్ల, ఇప్పటికి ప్రజలు వేలూరునాచారం అని పిలవటం పరిపాటి.అనంత గిరి పల్లి నుండి సుమారు అర కి.మి. దూరంలో శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం ఉంది. సుమారు 25 సం. క్రితం బృందావన ప్రతిష్ఠ జరిగింది.వేలూరు నుండి సీతారాం పల్లి వైపు 6కి.మి దూరంలో వర్గల్ గ్రామం వద్ద కొండలపై శ్రీ సరస్వతి, శనైశ్చర ఆలయాలు ఉన్నాయి.శని, ఆది వారాలు, పండగ రోజులలో హైదరాబాదు, చుట్టు ప్రక్కలనుండి ప్రజలు ఈ క్షేత్రాల దర్శనానికి వస్తారు.వేలూరికి దక్షిణాన ఊరి వెలుపల దుర్గమ్మ గుడి దాటాక మల్లన్న గుడి ఉంది. మల్లన్న గొల్ల, కుర్మ కులాల ప్రజల ప్రధాన దైవం. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర జరుగుతుంది. దగ్గరి గ్రామాల ప్రజలంతా భేద భావం లేకుండా ఈ జాతరలో పాల్గొంటారు.

సుప్రసిద్దులు

[మార్చు]
  1. తెలంగాణ తొలితరం నాటకకర్త మొలుగు బంగ్లా హనుమంతరావు (నవంబర్ 21, 1882 - సెప్టెంబర్ 12, 1971)
  2. సుమారు 400 సంవత్సరాల క్రితము సోమయాజుల రామేజ్జ్వర శర్మ గారు 365 రోజులు సోమయాగము చేసారు.ఆ యాగమునకు గుర్తుగా సోమనాథేశ్వర స్వామి దేవాలయం నిర్మాణము జరిగింది.ఆ దేవాలయమును తిరిగి 1985 లో పునర్నిర్మాణము కీ.శే సోమయాజుల వేంకటేశం శర్మ గారు,వారి సహోదరుడు కీ.శే చంచలం మాణిక్య శర్మ గారి (ఫీల్కాన)ఆధ్వర్యంలో జరిగింది.
  3. సుమారు 60 ఏళ్ళ క్రితం నరసింహాచార్యులు అనే వ్యక్తి ఉండెవారు, ఆయన హరికథలు చెప్పటంలో దిట్ట.చుట్టుపక్కల ఆయన వేలూరు నరసింహాచార్యులుగా ప్రసిద్దులు.
  4. సుమారుగా సా.శ1930 - 1990 మధ్య కాలంలో ఈ ఊరి గ్రామాధికారిగా పనిచేసిన నరసింహా రావు గారు అంటే తెలియని వారు చుట్టు పక్కల గ్రామాలలో లేరు అంటే అతిశయోక్తి కాదు. వ్యవసాయ భూమి కొలతలు వేయడంలో, భూమి పంపకాలు చేయడంలో ఆయన అందే వేసిన చేయి. ఆయన కాలంలో పహానీ, చౌఫస్లా, దస్తావేజులు, మొదలైనవి తప్పులు లేకుండా ప్రామాణికంగా ఉండేవని ప్రజలంటారు. సా.శ1935 - 40 ప్రాంతంలో నిజాం పాలనలో ఆ జిల్లా కలెక్టర్ శిస్తు వసూలు చేయడానికి వచ్చినపుడు, అప్పటికి 16 ఏళ్ళ నరసింహారావు గారు ధైర్యం తో, చాకచక్యంతో గ్రామం లోని గడ్డు పరిస్థితులు వివరించి ముప్పు తప్పించాడని, ఆ తరం వారు గుర్తు చేస్తుంటారు.
  5. కీ.శే. నందగిరి శ్యామసుందర రావు గారు ఈ ఊరికి మొట్ట మొదటి గ్రామాద్యక్షుడు (సర్పంచ్). గ్రామంలోని మంచినీటి బావులు, రహదారులు ఆయన కాలంలో వేసినవే. నరసింహస్వామి గుడి ముందున్న ధరం బావి గోడలపై ఆయన పేరు చెక్కి ఉండడం ఇప్పటికీ గమనించవచ్చు.

విశేషాలు

[మార్చు]

రంగని చెరువుకు సమీప ంలో పురాతన నరసింహస్వామి ఆలయము, ఊరి మధ్యలో శివాలయము, ఆంజనేయ మందిరము, ఊరికి ఒక చివర మశీదు, ఊరికి ఎనిమిది దిక్కులలో నూట ఎనిమిది ఆంజనేయ ఆలయాలు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2022-08-17.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]