Jump to content

వైఎస్ఆర్ వాహన మిత్ర

వికీపీడియా నుండి

వైయస్సార్ వాహన మిత్ర అనేది ఆటోలు, టాక్సీ డ్రైవర్లకు ఆర్థికంగా సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం.[1]

ప్రారంభం

[మార్చు]

ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 2019 అక్టోబరు 4న₹10,000 ఆర్థిక సహాయం అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వాహన మిత్రను ప్రారంభించారు.[2]

ఈ పథకం ద్వారా 2019-20లో 2,36,344 మంది లబ్ధి పొందగా, 2020-21లో 2,73,985 మంది లబ్ధిదారులు లబ్ధి పొందారు.[3] కోవిడ్-19 మహమ్మారి సంక్షోభంతో 2020లో ప్రకటించిన తేదీకి నాలుగు నెలల ముందు ఆర్థిక సహాయం అందించబడింది.[4]

పథకం

[మార్చు]

ఏలూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా 2018 మే 14న పాదయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా, ఈ పథకాన్ని 2019 అక్టోబరు 4న ఏలూరు నగరంలో ప్రారంభించారు [5] ఈ పథకం కింద, ఆటో రిక్షాలు, టాక్సీలు మ్యాక్సీ-క్యాబ్‌లను కలిగి ఉన్న స్వయం ఉపాధి డ్రైవర్‌లకు వాహనాల నిర్వహణ, బీమా ఇతర ఖర్చులకు సహాయం చేయడానికి సంవత్సరానికి ₹10,000 వేలు ఆర్థిక సహాయం అందిస్తారు.[6]

  1. "AP CM Jagan launches 'YSR Vahana Mitra' welfare scheme for auto and cab driver-owners". The News Minute (in ఇంగ్లీష్). 2019-10-05. Retrieved 2021-10-10.
  2. "AP: YSR Vahana Mitra scheme to launch on October 4". Business Standard India. 2019-09-27. Retrieved 2021-10-10.
  3. "2,36,344 autorickshaw and maxi/taxi cab drivers benefited from the assistance in 2019-20". The New Indian Express. 2021-06-04. Retrieved 2021-10-10.
  4. "The scheme was disbursed four months before the schedule in June 2020 due to the Corona crisis". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2021-06-04. Retrieved 2021-10-10.
  5. "Jagan to launch 'YSR Vahana Mitra' in Eluru today". The Hindu (in Indian English). 2019-10-04. ISSN 0971-751X. Retrieved 2021-10-10.
  6. "YS Jagan Mohan Reddy releases Rs 248 crore for YSR Vahana Mitra | Vijayawada News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 2021-06-16. Retrieved 2021-10-10.