Jump to content

వైస్ మేగ్నటాన్

వికీపీడియా నుండి
భూమిలో అరుదుగా దొరుకు అయస్కాంత ఫెరో ద్రవము

1911 వ సంవత్సరంలో వైస్, ఓన్శ్ కలిసి ఇనుము, నికెల్, కోబాల్ట్ ల గ్రామ్-అణుభారపు సంత్రుప్త అయస్కాంతీకరణ తీవ్రత (Is) విలువలను, 20డిగ్రీ k ఉష్ణోగ్రత వరకు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. దీనివల్ల గ్రాం పరమాణువు సంత్రుప్త అయస్కాంత భ్రామకము "సిగ్మానాట్ ను Is = సిగ్మానాట్p/A" అనే సూత్రాన్ని అనుసరించి తెలుసుకున్నారు. ఇట్లా కనుగొన్న గ్రామ్-పరిమానపు సంత్రుప్త అయస్కాంత భ్రామకము సిగ్మానాట్ విలువలు ఇనుముకు 12360, నికెల్ కు 3370 అని తేలినాయి. ఈ విలువలు 11 : 3 నిష్పత్తిలో ఉండి, రెంటిమధ్య 1123.5 సామాన్య గుణకంగా ఉంది.ఇదే గాక మరికొన్ని ఫెరో అయస్కాంత వస్తువుల అయస్కాంత భ్రామకాలు కూడా 1123.5 యొక్క గుణకాలని కనుకొన్నారు. దీనిని బట్టి గ్రామ్-పరమాణు అయస్కాంతం భ్రామకాల విలువలు ఏ పదార్ధానికైనా 1123.5 గుణకాలని తెలుసుకొన్నారు. దీనివల్ల గ్రామ్-పరమాణు అయస్కాంత భ్రామకం విలువలకు ఒక మూల ప్రమానము ఉన్నదని వైస్ ఊహించారు. ఈ మూల ప్రమాణాన్నే వైస్ మేగ్నటాన్ (W base M) (weiss magneton) అంటారు. దీని విలువ గ్రామ్- పరమాణుభార పదార్థానికి 1.1235 జౌల్ /టెస్లా (1123.5 గౌస్-సెం. మీ.), ఒక అణువు లేదా పరమాణువుకు 1.85 X 10−24 జౌల్ /టెస్లా ( 1.85 X10−21గౌస్-సెంటీ.మీ. ) అయి ఉంది. సాధారణంగా పదార్ధాల అయస్కాంత భ్రామకాన్ని p వైస్ మేగ్నటాన్ లుగా చెబుతారు. p విలువ కింది సమీకరణంవల్ల లభిస్తుంది.

బార్ అయస్కాంతము

తరువాత పరిశోధనలవల్ల వైస్ మేగ్నటాన్ కు మూల ప్రమాణంగా ప్రాధాన్యం లేదని భావించారు. ఐనా ఇది చాలా అనుకూలంగా ఉండటంచేత దీనిని ఉపయోగిస్తారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

[1]

  1. వైస్ మేగ్నటాన్ పేజి-209,స్థిర విద్యుత్ శాస్త్రము- ద్రవ్య అయస్కాంత ధర్మాలు, సంపాదకులు బి. రామచంద్రరావు,తెలుగు అకాడమి, 1972,హైదరాబాద్

బయటి లంకెలు

[మార్చు]