వ్యవసాయ స్వయం సేవకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊఫ్‌లో భాగస్వామ్యం వహిస్తున్న ఆస్ట్రేలియాలో ఉన్న రాస్‌బెర్రీ పొదలు

సేంద్రియ వ్యవసాయానికి ప్రాముఖ్యత, గుర్తింపు ఇస్తున్న ప్రస్తుత కాలంలో వ్యవసాయంలో దేశవిదేశాలలో విదేశీయ స్వయంసేవకులు పర్యటించి సేంద్రియ (ఆర్గానిక్) వ్యవసాయ పద్ధతులను అభ్యసించడం సరికొత్త పద్ధతి. నిజానికి ఈ పద్ధతి 1971లో లండన్లో ప్రారంభం అయింది. నగర జీవితానికి అలవాటు పడిన ప్రజలు పల్లెసీమల గురించి వారి జీవిత విధానం గురించి తెలుసుకోవడానికి ఈ పద్ధతి మొదలైంది. అయినప్పటికీ ప్రస్తుతం ఈ విధానం ఆర్గానిక్ వ్యవసాయ విధానాల శిక్షణకు ఉపకరిస్తున్నది.

ప్రాచీన భారతం[మార్చు]

వేలసంవత్సరాలకు ముందు నుండి భారతీయ సంస్కృతిలో సేంద్రియ వ్యవసాయం ఆచరణలో ఉంది. సేంద్రియ వ్యవసాయంతో భారతీయ సంస్కృతి సంపదలతో వర్ధిల్లింది. ఒకప్పుడు భారతదేశం ప్రపనచదేశాలలో సంపన్నదేశంగా గుర్తించపడడానికి సేంద్రియ వ్యవసాయం ప్రముఖ పాత్ర వహించింది. భారతీయ సంప్రదాయంలో వ్యవసాయం పూర్తిగా సేంద్రియ విధాల ఆధారితమైనది. క్రిమిసంహారకాలు, ఎరువులు మొదలైనవన్నీ మొక్కలు జంతువుల వ్యర్ధాల నుండి తయారుచెయ్యబడ్డాయి. ఆవును పాలకొరకు మాత్రమే ఉపయోగించక ఆవుపేడ, ఆవుమూత్రము ఎరువులకు క్రిమిసంహారక తయారీలకు వాడేవారు. అంతేకాదు ఎద్దులు, దున్నపోతులు సైతం దున్నడానికి, బడి లాగడానికి, ఒబ్బిడిచేయడానికి ఉపయోగిస్తూ పేడను అలవర్ధకమైన ఎరువుగా ఉపయోగించేవారు. వేపనూనె, వేపాకు, అల్లం మొదలైనవి సహాసిద్ధమైన క్రిమిసహారక తయారీలకు ఉపయోగించేవారు.

రసాయన వ్యవసాయం[మార్చు]

భారతదేశంలో 1950-1960 వరకు కరువులు ఆకలిమరణాల వలన అత్యవసర పరిస్థితిలో ఆహార ఉతత్తులు అధికంచేయవలసిన పరిస్థితి ఎదురైంది. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆహార ఉత్పత్తులను దిగుమతి చేయవలసిన పరిస్థితి ఎదురైంది. ఫలితంగా చేపట్టిన హరిత విప్లవంలో సేంద్రియ ఎరువుల స్థానంలో రసాయనిక ఎరువులు, సేంద్రియ క్రిమిసంహారక స్థానంలో రసాయనిక క్రిమిసంహారకాలు చోటుచేసుకున్నాయి. సహజ కాయకూరలు, పండ్ల స్థానంలో హైబ్రీడ్ కాయకూరలు, పండ్లు పండించబడ్డాయి. అధిక ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని హైబ్రీడ్ విత్తనాల వాడకం మొదలైంది. హైబ్రీడ్ వ్యవసాయ ఉత్పత్తులు అధికం అయ్యాయి.

సేంద్రియ వ్యవసాయ పునరుద్ధరణ[మార్చు]

హరిత విప్లవానికి ముందు 1970 నాటికి భారతదేశంలో ఆకలిచావులు పెరగవచ్చన్న అభిప్రాయం బలంగా ఉంటూ వచ్చింది. అయినప్పటికీ హరిత విప్లవం తన కచ్చితమైన ఫలితం చూపిన కారణంగా దేశం ఆహారదిగుమతులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. 1990 నాటికి భారతదేశం ఆహార ఉత్పత్తులు దేశప్రజల ఆహార అవసరాలను తీర్చడమేగాక దేశం నుండి ఆహారం ఎగుమతూ కూడా అధికమయ్యాయి.

కాలక్రమేణా అత్యధికంగా రసాయనిక ఎరువుల ఉపయోగం తన మరొక చీకటికోణం చూపించడం మొదలైంది. అధిక మొత్తం రసాయనిక పురిగు అందుల వాడకం వలన క్రిమికీటకాలు మరింత రోగనిరోధక శక్తిని పెంచుకున్నాయి. అందువలన వ్యవసాయదారులు ఖరీదైన గాఢత కలిగిన రసాయన క్రిమిసంహారకాలు అధికశాతంలో ఇపయోగించిన కారణంగా వ్యవసాయభూమి తన సారాన్ని కోల్పోయింది. వ్యవసాయ ఖర్చులు అధికమైనందుకు ఫలితంగా రైతులు ౠణాల ఊబిలో కూరుకుని ఋణభారం వలన ఆత్మహత్యలకు పాల్పడడం అధికమైంది.

భారతదేశంలో ప్రస్తుతం వాడకందారులు, వ్యవసాయదారులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గుచూపడం మొదలైంది. సేంద్రియ వ్యవసాయం ఆరోగ్యకరం అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఆరోగ్యరీత్యా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు ఉత్తమమని ౠజువుకావడంతో వాడకందారులు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు అధిక మూల్యం చెల్లించడానికి సిద్ధం కావడం మొదలైంది. సేంద్రియ విధానం ద్వారా పండించబడని ఆహారాలపై యు.ఎస్, ఐరోపా దేశాలు కఠిన నియమాలను విధించడం పలు సమయాలలో నిషేధించడం వంటి కారణాలు దేశీయంగా, అంతర్జాతీయంగా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ అధికం అయింది. భారతదేశంలో సేంద్రయ వ్యవసాయం అభివృద్ధికావడానికి రసాయనిక పద్ధతులలో పండించిన భారతీయ ఆహారాలను నిషేధించడం ఒక కారణం.

సేంద్రుయవ్యవసాయానికి సహకరించడానికి అంతర్జాతీయనిధి సహకారంతో భారతదేశంలో 2004 నాటికి 25 లక్షల హెక్టారులలో సేంద్రుయ వ్యసాయ విధానంలో ఆహార ఉత్పత్తులను పండిస్తున్నారు. భారతదేశంలో గుర్తింపు పతకాలు కలిగిఉన్న 15,000 సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం సేంద్రియ విధానంలో పండిచిన ఆహారౌత్పత్తులు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేస్తున్న దేశాలలో భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉంది.

భాతీయ వ్యవసాయ స్వయంసేవకుల నియమావళి[మార్చు]

  • మునుదుగా సభ్యత్వ రుసుము చెల్లించాలి. సభ్యత్వ కాలపరిమితి ఒక్క సంవత్సరం. సభ్యత్వ రుసుము ఎల్లించిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వయసేవకులకు అవకాశం కల్పిస్తున్న అర్గానిక్ క్షేత్రాల వివరాలు పపించబడతాయి.
  • సభ్యులు భారతదేశ వ్యవసాయ క్షేత్రాలను ఎంచుకున్నట్లైతే వారికి ప్రత్యేక నిఅంధనలు ఉంటాయి. భారతీయ సంసృతి సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నియానిబంధలు ఏర్పాటుచెయ్యబడ్డాయి.
  • స్వయంసేవకులు మాదకద్రవ్యాలు ఉపయోగించకూడదు. అలా ఉపయోగించిన వారు వెనుకకు వెనుకకు తిరిగి పంపబడతారు.
  • స్వయంసేవకులకు పరిశుద్ధంగా తయారు చేయబడిన నిరాడంబరమైన ఆహారం అందించబడుతుంది. ఒక్కో క్షేత్రంలో ఒక్కో ఆహారసరళి ఉండేలా వైవిధ్యమైన ఆహారం అందించబడుతుంది.
  • స్వయం సేవకులు వారి సంరక్షణ బాధ్యత వారే వహించాలి. ప్రమాదాలు, అరోగ్య సమస్యల వంటి అనుకోని సమస్యలకు వారే బాధ్యత వహించాలి. స్వయం సేవకులు వారి విలువైన వస్తువుల భద్రతా బాధ్యతలను వారే వహించాలి. పొట్టి నిక్కర్లు, పొట్టి దుస్తులు, లోకట్ టీషర్ట్లు, స్లీవ్‌లెస్ టీషర్ట్లు వంటి దుస్తులను ధరించకూడదు. బహిరంగప్రదేశంలో ఒకరిని ఒకరు తాకడం వంటి చర్యలు

చేయకూడదు. వారిలో వారు కాని అతిథులతో కాని మర్యాద చూపుతూ తగిన దూరంగా ఉండాలి. భారతీయ పల్లెసీమలలో ఇలాంటివి అసహజం కనుక తగినంత జాగ్రత్త పాటించాలి. వ్యవసాయక్షేత్రాలలో నివసిస్తున్నంత కాలం భారతీయ సంప్రదాయానికి అనుకూలంగా ప్రవర్తుంచాలి.

  • ఆస్తమా, అలర్జీ, హృద్రోగం, హై ఆల్టిట్యూడ్ సమస్యలు ఉన్నవారు వీటిలో భాగస్వామ్యం చేయకుండా ఉండడ శ్రేయస్కరం. స్వయంసేవకులు వారి వైద్యుల సలహా అనుసరించి వారికి అవసరమైన ఔషధాలను వారు తీసుకురావాలి.
  • స్వయంసేవకులు వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, రేపర్లు, ఫ్లాస్టిక్, టిన్నులు, ఇతర చెత్త పదార్ధాలను జాగ్రత్తగా పారవేయాలి. చెత్తను అక్కడడక్కడా వేయకూడదు.

స్వయంసేవకులకు ఆతిథ్యం ఇచ్చేవారికి సలహాలు[మార్చు]

  • ఊఫ్ ద్వారా నమోదైన ఆతిథ్యం ఇచ్చేవారు స్వయంసేవకులను సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలలో మాత్రమే నియమించాలి.
  • ఆతిథ్యం ఇచ్చేవారు స్వయంసేవకులకు నివసించడానికి వారిని తృప్తి పరిచేలా వసతి కల్పించాలి. వారికి పరిసుద్ధమైన వాతావరణంలో తయారుచేసిన భోజనం అందించాలి.
  • బదులుగా స్వయంసేవకులు ఆతిథ్యం ఇచ్చేవారికి ఒకరోజుకు 5 గంటలు వారానికి 5 రోజులు పనిచేయాలి. అంటే వారానికి కనీసం 25 గంటలు పనిచేయాలి.
  • స్వయం సేవకులు చేయవలసిన పనులు కలుపు తీయుట, మొక్కలు నాటుట, గృహాలలు రంగులు వేయుట, పాఠశాల నడుపుట, వంట చేయుట, సాధారణ నిర్వహణ, కంచె నిర్మాణం, గృహనిర్మాణంలో సహాయం, భాధాబోధన మొదలైనవి.
  • స్వయంసేవకులు విభిన్న వాతావరణం నుండి వారిదేశాలలో అనుసరించే విధానాల గురించిన విషయఙానంతో వస్తారని గుర్తుంచుకోవాలి. స్వయంసేవకులలో అనేకమంది ఒక సంవత్సర కాలం అధ్యయన పర్యటనకు వచ్చే విద్యార్థులు అధికంగా ఉంటారు, కొంతమంది విభిన్నవాతావరణంలో నివసించి అధ్యయనం చేయడానికి వచ్చే నిపుణులు మరికొందరు భాషాభ్యాసం కొరకు వచ్చేవారు ఉంటారు. స్వయంసేవకులు ఆతిథ్యం ఇచ్చేవారి కుటుంబ సభ్యులుగా ఉండడానికి ఉత్సాహం చూపుతుంటారు కనుక వారిని కుతుంబసభ్యులుగా చూడవలసిన అవసరం ఉంది.

ఆతిధ్యం ఇచ్చేవారు వారికి వీలైనంతగా స్వయంసేవకులతో కలిసిమెలిసి మెలగాలి. ఈ విధానం ఇరువైపులా ప్రయోజనం చేకూర్చే వస్తుమార్పిడి వంటిదని గ్రహించాలి.

  • ఆతిథ్యం ఇచ్చేవారు వారు సూచించిన విషయం మీద ఆసక్తి కలిగి ఉండాలి. తరువాత వారితో ఎమెయిల్ వంటి మార్గాలలో అనుసంధానం కలిగే విషయఙానం కలిగి ఉండాలి. అప్పుడే స్వయంసేవకులుగా రావాలకునే వారితో సంప్రదింపులు జరిగి పరస్పర అవగాహనకు రావడానికి వీలు కలుగుతుంది.

భారతదేశంలో ఊఫ్[మార్చు]

భారతదేశంలో ఊఫ్ క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంది. కొంత మంది మాత్రమే ఆతిథ్యం ఇచ్చే వారున్న పరిస్థితులు మారి ప్రస్తుతం 150 మంది ఆతిథ్యం ఇచ్చే వారు నమోదైయ్యారు. భవిష్యత్తులో ఇది ఇంకా అధికం అయి ఈ ప్రపంచ వ్యాప్త పర్యావరణ ఉద్యమంలో అనేకులు భాగస్వామ్యం వహించగలరని భావిస్తున్నారు.అంతర్జాతీయంగా భారతదేశం అత్యంత ఆదరణీయమైన పర్యాటక కేంద్రం. భారతదేశ సాంస్కృతిక వారసత్వం, వైవిధ్యమైన జీవనశైలి, వైవిధ్యమైన ఆచారవ్యవహారాలు, విభిన భాషలు, విభిన్న భౌగోళిక పరొస్థితులు, విభిన్న మతాలు విదేశీ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుత ఊఫ్ సభ్యులు కూడా భరతదేశం సందర్శించడానికి ఉత్సుకత చూపితున్నారు.

భారతదేశంలో సేంద్రియవ్యవసాయం[మార్చు]

2003 ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ పరిశోధనలు భారతదేశంలో 1,426 గుర్తింపు పొందిన సేంద్రియ వ్యవసాయక్షేత్రాలు ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. 2005 లో దేశంలో సేంద్రియవిధానంలో పండిచిన వ్యవసాయ ఉత్పత్తులు 14,000 టన్నులు. దేశంలో 1,90,0000 ఎకరాలల్.ఒ సేంద్రియ విధానంలో సాగుచేయబడుతుంది. ఆడవుల నుండి సేకరించిన ఆహార ఉత్పత్తులను 1,20,000 టన్నులు ఉంటుందని మరి కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

వెలుపలి లింకులు[మార్చు]

[1] సభ్యత్వం.