సేంద్రీయ వ్యవసాయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జర్మనీలోని రోస్టాక్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ సంఘం సభ్యులు.. బీట్ రూట్ ఫీల్డ్ నుండి కలుపు మొక్కలను తొలగిస్తూ రైతుకు మద్దతు తెలిపారు


సేంద్రీయ వ్యవసాయం (ఆంగ్లం: Organic Farming) అనగా ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం. ప్రధాణంగా సేంద్రీయ వ్యవసాయం రెండు పద్ధతులుగా చెప్పవచ్చు.

మొదటి పద్ధతిలో కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, అనగా ఎండిన ఆవు/గేదె పేడ, ఆకు తుక్కు, వర్మీ కంపోస్టు (వానపాముల), వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం జరుగుతుంది. ఇది సాధారణ పద్ధతి. ఈ పద్ధతి కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్నది. సేంద్రీయ వ్యవసాయంలో సిక్కిం ముందు స్థానంలో ఉంది.

రెండవ పద్ధతిని గో-ఆధారిత పద్ధతి, సుభాష్ పాలేకర్ పద్ధతి అని అంటారు. ఈ పద్ధతిలో సేంద్రీయ వ్యవసాయం జీవామృతం అను సహజ రసాయనంతో సాగుతుంది. ఇక కీటక నాశానులుగా నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం అను సహజ రసాయనాలు వాడబడతాయి.

ఇవీ చూడండి[మార్చు]

ఇంకా చదవండి[మార్చు]

లంకెలు[మార్చు]

http://en.wikipedia.org/wiki/Organic_farming