Jump to content

సత్యం శంకరమంచి

వికీపీడియా నుండి
(శంకరమంచి సత్యం నుండి దారిమార్పు చెందింది)
శ్రీ శంకరమంచి సత్యం
సత్యం శంకరమంచి
జననంసత్యం
మార్చ్3, 1937
గుంటూరు జిల్లా అమరావతి చాపాడు
మరణం21 మే 1987
నివాస ప్రాంతంవిజయవాడ
ఇతర పేర్లుషేక్‌ జాన్సన్‌ శాస్త్రి, శారదానాథ్‌, సాయిరాం కలం పేర్లు
వృత్తిఆకాశవాణి కేంద్రంలో అధికారి
ఉద్యోగంఆకాశవాణి విజయవాడ కేంద్రం
తండ్రిశంకరమంచి కుటుంబరావు
తల్లిశంకరమంచి శేషమ్మ
Notes
1979 సంవత్సరపు రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి అమరావతి కథలుకు ఇవ్వబడినది

సత్యం శంకరమంచి (1937-1987) గుంటూరు జిల్లా అమరావతిలో 1937వ సంవత్సరం మార్చి 3న శేషమ్మ, కుటుంబరావులకు జన్మించారు. తల్లిదండ్రులు పసితనంలోనే దూరమైపోగా సీతమ్మ, పెదపున్నమ్మలు సత్యాన్ని పెంచి పెద్ద చేసారు. సాహిత్యాభివృద్ధికి అన్నలు రామారావు, రాధాకృష్ణమూర్తి, పూర్ణానందశాస్త్రి గార్లు ప్రోత్సహించారు.

ఏలూరు సర్‌ సి.ఆర్‌.రెడ్డి కళాశాలలో బి.ఏ., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌.ఎల్‌.బీ. చదివి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 'అమరావతి కథలు' వ్రాసినా, ' కార్తీక దీపాలు' వెలిగించినా నిజమైన న్యాయవాదమే మౌలికమైన సూత్రం ఆయనకు. పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది.

'రేపటి దారి ', 'సీత స్వగతాలు ' 'ఆఖరి ప్రేమలెఖ ' ఎడారిలో కలువపూలు ' సత్యం కలం నుండి వెలువడిన నవలలు.

హరహర మహాదేవ ఆయన వ్రాసిన నాటకం.

ఆకాశవాణిలో ఉద్యోగం చేసారు.

అమరావతి కథలు గ్రంథానికి 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పొందారు. ఈ కథలు శ్యామ్‌ బెనెగల్‌ దర్శకత్వంలో దూర దర్శన్‌లో ప్రసారమయ్యాయి

కథలు

[మార్చు]

అమరావతి కథలు (100)

రచనలు

[మార్చు]
నవలలు
  • రేపటి దారి
  • సీత స్వగతాలు
  • ఆఖరి ప్రేమలేఖ
  • ఎడారిలో కలువపూలు
నాటకాలు
  • హరహర మహాదేవ
ఇతర రచనలు
  • షేక్‌ జాన్సన్‌ శాస్త్రి, శారదానాథ్‌, సాయిరాం అనే కలం పేర్లతో దిన, వారపత్రికలలో వ్యంగవ్యాసాలు -
  • పత్రికలలో ప్రచురించిన శీర్షికలు
    • ఇంతే సంగతులు
    • తధ్యము సుమతీ
    • ఎందరో మహానుభావులు

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]