శకుంతల (1932 సినిమా)
స్వరూపం
శకుంతల (1932 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాదామి సర్వోత్తం |
---|---|
నిర్మాణం | అంబాలా ఎమ్.పటేల్ |
తారాగణం | సురభి కమలాబాయి (శకుంతల), యడవల్లి సూర్యనారాయణ (దుష్యంతుడు) బాకురపండ వెంకటరావు నెల్లూరు నాగరాజారావు |
నిర్మాణ సంస్థ | సాగర్ స్టూడియోస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
శకుంతల, 1932లో విడుదలైన ఒక తెలుగు సినిమా.
ప్రసిద్ధమైన కాళిదాసు రచన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. శ్రీరామ పట్టాభిషేకం సినిమా నిర్మించిన సంస్థయే ఈ సినిమాను కూడా నిర్మించింది. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అకట్టుకోలేదు.
సినిమా ప్రకటనలో ఇలా వ్రాశారు - "ఆంధ్ర దేశమునకు మరియొక అత్యద్భుతమగు తెలుగు టాకీ. ఇది పాదుకాపట్టాభిషేకమున కంటె చాల పెద్దదిగాను, బాగుగాను యున్నది"
తెలుగు సినిమాల్లో సర్వసాధారణమైన హాస్యపాత్రలు శకుంతల చిత్రంతో ప్రారంభమయ్యాయి. ఈ చిత్రంలో శకుంతల చేతి ఉంగరాన్ని మింగిన చేపను పట్టుకున్న జాలర్లతో హాస్యం పలికించారు.[1]
మూలాలు, వనరులు
[మార్చు]- ↑ "నవ్వుల నవాబులు... మన తారలు". Archived from the original on 2016-03-05. Retrieved 2013-08-03.
- సూర్య దినపత్రిక - 2007 డిసెంబరు 28లో "సూర్య చిత్ర" అనుబంధం వ్యాసం - వినాయకరావు రచన