శర్మిష్ట ముఖర్జీ
శర్మిష్ట ముఖర్జీ | |
---|---|
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1965 అక్టోబర్ 30 పశ్చిమ బెంగాల్ భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
నివాసం | న్యూఢిల్లీ |
శర్మిష్ట ముఖర్జీ (జననం 30 అక్టోబర్ 1965) ఒక భారతీయ కథక్ నృత్యకారిణి కొరియోగ్రాఫర్ భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయవేత్త. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు.
బాల్యం
[మార్చు]పశ్చిమ బెంగాల్‌లో శర్మిష్టా ముఖర్జీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి ప్రణబ్ ముఖర్జీ, ఆయన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క 13 వ రాష్ట్రపతి . [1]
నృత్య కారిణి
[మార్చు]శర్మిష్టముఖర్జీ [2] 13సంవత్సరాల వయస్సులో నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఈమెకు నాట్యం శిక్షణ పండిట్ దుర్గాలాల్, విదుషి ఉమా శర్మ రాజేంద్ర గంగాని . నేర్పించారు. ది హిందూ పత్రిక శర్మిష్ట ముఖర్జీ నాట్య ప్రదర్శనలను ప్రశంసించింది.
రాజకీయ జీవితం
[మార్చు]శర్మిష్ట ముఖర్జీ జూలై 2014లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. అప్పటి నుంచి ఆమె పార్టీ నిర్వహించే ర్యాలీల్లో చురుగ్గా పాల్గొంటూ తన ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలతో గ్రాస్ రూట్ లెవెల్లో పని చేస్తున్నారు. [3] ఆమె ఫిబ్రవరి 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం [4] నుండి పోటీ చేసింది, అయితే ఆమె ఓటమిపాలైంది సౌరభ్ భరద్వాజ్ ( ఆప్ 57,589 ఓట్లు) రాకేష్ గుల్లయ్య ( బీజేపీ 43,006 ఓట్లు) తర్వాత 6,102 ఓట్లతో మూడో స్థానంలో ఆమెని నిలిచింది. [5]
మూలాలు
[మార్చు]- ↑ "Pranab Mukherjee's daughter, Sharmistha Mukherjee joins protest against power outages". The Economic Times. 14 June 2014. Archived from the original on 2016-08-20. Retrieved 2023-10-08.
- ↑ Sandhu, Veenu (5 April 2013). "Sharmistha Mukherjee chose not to live in India's biggest house". Business Standard.
- ↑ Singh, Rohinee (14 November 2014). "Sharmistha Mukherjee wants to be a mass leader". DNA.
- ↑ "Sharmistha Mukherjee casts vote in GK, mum on Congress' prospects". Zee News. 7 February 2015.
- ↑ "Sharmistha loses Greater Kailash, gets just 6,000 votes". Business Standard. 10 February 2015.