శాంతాదేవి
శాంతాదేవి | |
---|---|
జననం | దమయంతి 1927 కోజికోడ్, కేరళ |
మరణం | 2010 నవంబరు 20 కోజికోడ్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1954–2010 |
జీవిత భాగస్వామి | బాలకృష్ణన్ (విడాకులు) కోజికోడ్ అబ్దుల్ కాదర్ |
శాంతాదేవి (1927 - 2010 నవంబరు 20) కేరళ రాష్ట్రానికి చెందిన నాటకరంగ, సినిమా నటి.[1] సుమారు అరవై ఏళ్ళ నటనా జీవితంలో 1000 కంటే ఎక్కువ నాటకాలు, సుమారు 480 సినిమాలలో నటించింది.[2] ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు, కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డులతోపాటు పలు అవార్డులు అందుకుంది.
జననం, విద్య
[మార్చు]శాంతా దేవి కోజికోడ్‌లో అప్పటికి ప్రసిద్ధి చెందిన తొట్టతిల్ అనే తరవడులో 1927లో తొట్టతిల్ కన్నక్కురుప్పు - కార్తియాయని దంపతులకు 10 మంది పిల్లలలో ఏడవ కుమార్తెగా జన్మించింది. సభా పాఠశాల, తరువాత బిఈఎం పాఠశాల నుండి తన విద్యను అభ్యసించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]18 ఏళ్ళ వయసులో రైల్వేగార్డు, తన మేనమామ కుమారుడైన బాలకృష్ణన్‌తో శాంతాదేవి వివాహం జరిగింది. వారికి కుమారులు పుట్టిన తరువాత వారు విడాకులు తీసుకున్నారు.[3] ఆ తరువాత, ప్రముఖ మలయాళ సినీ గాయకుడు కోజికోడ్ అబ్దుల్ కాదర్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులు (సురేష్ బాబు, దివంగత సత్యజిత్).[4]
అవార్డులు, సన్మానాలు
[మార్చు]- 1978: కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు
- 2003: కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్[5][6]
- 1992: యమనం సినిమాకు ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు[7]
- 1968: కుదుక్కుకల్ నాటికలో తన పాత్రకు కేరళ రాష్ట్ర ఉత్తమ రంగస్థల నటిగా అవార్డు
- 1968: త్రిస్సూర్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ అవార్డు
- 1973: ఉత్తమ నటి అవార్డు
- 1978: ఇటు భూమియను, ఇంక్విలాబింటే మక్కల్ లలో నటనకు ఆమె కేరళ సంగీత నడక అకాడమీ ఉత్తమ నటి అవార్డు
- 1979: కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
- 1983: దీపస్తంభం మహాశ్చర్యం నాటకం రాష్ట్ర నాటకాలలో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డు[8]
- 1992: ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు
- 2005: కేరళ సంగీత నాటక అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారం
- :శాంతాదేవికి ప్రేమ్‌జీ అవార్డు
- :కర్నాటక నుండి అత్తిమబ్బే బహుమతి
టెలివిజన్ (కొన్ని)
[మార్చు]- మానసి (డిడి మలయాళం)
- పెన్నూరిమై (డిడి మలయాళం)
- మిన్నుకెట్టు (సూర్య టీవీ)
- మనస్సరియతే (సూర్య టీవీ)
- కాయంకుళం కొచ్చున్ని (సూర్య టీవీ)
- అలీ మంత్రికన్
- ఎన్నపదం
- శకునం (డిడి మలయాళం)
- వధు - టెలిఫిల్మ్
- విద్యారంభం - టెలిఫిల్మ్
- పుతియాప్లక్కుప్పాయమ్ - టెలిఫిల్మ్
- కన్నుకల్ - టెలిఫిల్మ్
- కుంచతుమ్మ - టెలిఫిల్మ్
నాటకాలు (కొన్ని)
[మార్చు]- కుడుక్కుకల్
- స్మారకం
- దీపస్తంభం మహాఆశ్చర్యం
- ఇంక్విలాబింటే మక్కల్
- ఇటు భూమియన్ను
- పెడిస్వప్నం
మరణం
[మార్చు]శాంతాదేవి 2010 నవంబరు 20న సాయంత్రం కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది.[9]
మూలాలు
[మార్చు]- ↑ "Manorama Online | Movies | Nostalgia |". Archived from the original on 2 December 2013. Retrieved 26 November 2013.
- ↑ "നടി കോഴിക്കോട് ശാന്താദേവി അന്തരിച്ചു". Malayala Manorama. Archived from the original on 7 March 2012. Retrieved 2010-11-21.
- ↑ "Mathrubhumi Eves - features,articles,ഒറ്റപ്പെടലിന്റെ വേദനയില് ശാന്താദേവി". Archived from the original on 11 August 2010. Retrieved 2013-12-11.
- ↑ "ശാന്താദേവി വൃദ്ധസദനത്തിന്റെ തണലില് - articles,features - Mathrubhumi Eves". Archived from the original on 19 January 2014. Retrieved 2013-12-11.
- ↑ "Kerala Sangeetha Nataka Akademi Award: Drama". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 26 February 2023.
- ↑ "Kerala Sangeetha Nataka Akademi Fellowship: Drama". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 25 February 2023.
- ↑ "Friday Review Thiruvananthapuram / Interview : Natural actor". The Hindu. 2007-06-08. Archived from the original on 2010-11-23. Retrieved 2010-08-23.
- ↑ "നടി കോഴിക്കോട് ശാന്താദേവി അന്തരിച്ചു". Malayala Manorama. Archived from the original on 7 March 2012. Retrieved 2010-11-21."നടി കോഴിക്കോട് ശാന്താദേവി അന്തരിച്ചു". Malayala Manorama. Archived from the original on 7 March 2012. Retrieved 21 November 2010.
- ↑ "Veteran Malayalam actress Shanta Devi dies". .bombaynews.net. 20 November 2010. Archived from the original on 22 November 2010. Retrieved 20 November 2010.