Jump to content

శాంతాపూర్ మహాదేవ్ ఆలయం

అక్షాంశ రేఖాంశాలు: 18°30′53″N 78°51′43″E / 18.514772°N 78.861809°E / 18.514772; 78.861809
వికీపీడియా నుండి

శాంతాపూర్ మహాదేవుని ఆలయం తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల శాంతాపూర్ గ్రామపంచాయితీ పరిధిలో అటవీ ప్రాంతంలో గుహలో మహాదేవుని శివాలయం ఉంది.ఇది గుహలో ఉండడం వలన దీ నిని పాతాళ నాగ భైరవ ఆలయం అని కూడా అందురు. ఇది చాలా ప్రాచిన ఆలయం[1].

శాంతా పూర్ మహాదేవ్ ఆలయం
మహాదేవుని ఆలయం
మహాదేవుని ఆలయం
శాంతా పూర్ మహాదేవ్ ఆలయం is located in Telangana
శాంతా పూర్ మహాదేవ్ ఆలయం
శాంతా పూర్ మహాదేవ్ ఆలయం
తెలంగాణ లో ప్రాంతం
భౌగోళికాంశాలు :18°30′53″N 78°51′43″E / 18.514772°N 78.861809°E / 18.514772; 78.861809
పేరు
ఇతర పేర్లు:పాతాళ నాగ భైరవ
మహాదేవ్ క్షేత్రం
శివుని క్షేత్రంగా
ప్రధాన పేరు :పాతాళ నాగభైరవ ఆలయం
దేవనాగరి :महादेव मंदिर
మరాఠీ:महादेव मंदिर
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్ జిల్లా,
ప్రదేశం:శాంతాపూర్,అటవీ ప్రాంతంలో
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:[శివుడు]]
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షిణ భారతదేశం నిర్మాణ శైలి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సుమారు ఏడు వందల సంవత్సరాలు
సృష్టికర్త:కాకతీయులు

గుహలో ఆలయం

[మార్చు]

గుడిహత్నూర్ మండలంలోని శాంతా పూర్ గ్రామ పంచాయితీ పరధిలోని శాంతాపూర్ నుండి రెండు కి.మీ దూరంలో అటవీ ప్రాంతంలో ఈ మహదేవ్ ఆలయం ఉంది.దీనినే పాతాళ నాగ భైరవ ఆలయం అని కూడా అంటారు. ఇది తెలంగాణ సంస్కృతి వారసత్వమునకు ప్రతి రూపం. కఠినమైన శిల్పాలను ఆలయం ఆకారంలో చెక్కి లోపల స్వామి వారి విగ్రహం నిర్మించారు. ఇప్పటి వరకు ఈ గుహాలో ఉన్న శివుడి గురించి స్థానికులకు తప్ప బాహ్య ప్రపంచానికి ఎ మాత్రం తెలియదు. ఈ గుహా చాలా పురాతనమైందని స్థానికులు చెపుతారు.[2][3].

ఆలయంలో ఉత్సవాలు

[మార్చు]

ఆలయంలో పర్వదినం సందర్భంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి మహాశివరాత్రి పర్వదినాన్ని పూరష్కరించుకోని ఆలయాన్ని సందర్శించడానికి స్థానికులు వస్తుంటారు. భక్తులు భక్తి శ్రద్ధతో శివుని పూజించి ఉపవాసం దీక్షను విరమిస్తారు. పండుగ రోజు ఆలయం పరిసర ప్రాంతం శివనామస్మరణతో మారుమోగుతాయి. ఆలయానికి సమీప దూరంలో రామమందిరం,దత్తాత్రేయ మందిరం, అమ్మవారి గుడి ఉన్నాయి. ఇచట శ్రీరామనవమి, దత్త జయింతి సందర్భంగా స్థానికులు భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు.


చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "గుహలో మహాదేవుడు". EENADU. Retrieved 2024-10-18.
  2. Sai, Anand. "Lord Shiva Temple : అడవి కింద శివయ్య.. ఈ విషయం చాలా మందికి తెలియదు". Hindustantimes Telugu. Retrieved 2024-10-23.
  3. Bharat, E. T. V. (2022-06-24). "గుహలో మహాదేవుడి ఆలయం.. చూస్తే అవాక్కు అవ్వాల్సిందే!!". ETV Bharat News. Retrieved 2024-10-23.