శాంతి (1952 సినిమా)
1952 ఫిబ్రవరి 15 న విడుదలైన వినోదా పిక్చర్స్ వారి ' శాంతి '. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గోవిందరాజుల సుబ్బారావు,రామచంద్ర కాశ్యప, సావిత్రి, పేకేటి శివరాం తదితరులు నటించారు ఈ చిత్రానికి సంగీతం సి. ఆర్.సుబ్బురామన్ సమకూర్చారు.
శాంతి (1952 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
---|---|
నిర్మాణం | డి.ఎల్.రాఘవయ్య |
తారాగణం | రామచంద్ర కాశ్యప్, గోవిందరాజుల సుబ్బారావు, సావిత్రి, పేకేటి శివరాం |
సంగీతం | సి.ఆర్.సుబ్బరామన్ |
నేపథ్య గానం | రావు బాలసరస్వతి |
గీతరచన | సముద్రాల జూనియర్ |
నిర్మాణ సంస్థ | వినోదా పిక్చర్స్ |
భాష | తెలుగు |
కథ
[మార్చు]రాజానగర్ జమీందారు కుమారుడు కరుణాకర్ విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడై తిరిగివచ్చి, అంతవరకు ట్రస్టీల అజమాయిషీలో ఉన్న తన ఎస్టేటును స్వయంగా నిర్వహించుకుని, మానవులంతా సమానులే అన్న తన భావాలను ఆచరణలో తీసుకురావడానికి పూనుకుంటాడు. తన తండ్రి మరణించే సమయానికి ఎస్టేట్ ఋణభారంతో మునిగి ఉన్నదని ట్రస్టీల వల్ల తెలుసుకుని, కొంత మంది దుర్మార్గుల సాహచర్యంవల్ల తన తండ్రి మరణించాడని నమ్మకస్తుడైన ఇంటి నౌకరు ద్వారా తెలుసుకుని ఆ దుర్మార్గులను పట్టించి శిక్షించాలని బయలు దేరుతాడు. ఈ ప్రయత్నంలో మాంధాత అనే షావుకారు ఉన్న ఊరు వచ్చి అతని వద్ద మారువేషంలో నౌకరుగా చేరతాడు. ఈ మాంధాత తన తండ్రి మరణానికి కారణమైన ఒక దుష్టుడు. తన తండ్రి మరణానికి సంబంధించిన కారణాలను కూపీతీసి దుష్టులను శిక్షింపజేస్తాడు. మాంధాత వద్ద నౌకరుగా ఉన్న సమయంలోనే తన రైతులను, తన మిల్లు కూలీలను, తన చెల్లి అయిన సంపన్నను ఏ విధంగా కష్టపెడుతున్నదీ స్వయంగా చూసి వారికి ఎన్నో విధాల సహాయపడతాడు. సంపన్న కూతురు శుభ ఉన్నత హృదయానికి, విశాల భావాలకు ఆకర్షితుడై ఆమెను వివాహం చేసుకుంటాడు[1].
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం : వేదాంతం రాఘవయ్య
- కథ: కొవ్వలి
- పాటలు: సముద్రాల జూనియర్
- ఛాయాగ్రహణం: రంగా
- కళ: వాలి & గోడ్గాంకర్
- సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్
తారాగణం
[మార్చు]- చంద్రకుమారి - శుభ
- సి.హేమలత - సంపన్న
- సావిత్రి - మంజరి, మాంధాత మూడవ భార్య
- పేకేటి శివరాం - టాంటాం
- గోవిందరాజుల సుబ్బారావు - మాంధాత
- ఆరణి
- రామచంద్ర కాశ్యప్ - కరుణాకర్
పాటలు
[మార్చు]- ఆకులే మర్రాకులే ఈనాడు ఆధారమా ఆదిదేవుడు అల్లనాడు - ఆర్. బాలసరస్వతీ దేవి
- ఆహా నేటికి నాపై జాలి చూపె నా స్వామి - ఆర్. బాలసరస్వతీ దేవి
- ఊగుదునే వూయేలా రివ్వున పైకెగసి తూగుటూయేల - ఆర్. బాలసరస్వతీ దేవి
- ఇటులేనా నా రాత ఎటు కన్నా మసకేనా బ్రతుకు ఎడారి -
- ఈ పెళ్లివారు ఎట దాపురమైనారు మాపాలిట పడినారు -
- ఓ వరాల బాబయ్య మా మోరలు వినవయ్యా కూటికిలేని -
- టాం టాం చేరుకుంటాం వుంటాం చీలిపోతుంటాం -
- మీసరి సమానులే మరి లేరు ఏ దేశములోన ఏ జగాన -
- శాంతి శాంతి శాంతి ఏది శాంతి ఎక్కడ శాంతి ఎప్పుడు మనకు శాంతి -
- శ్రీగోపాలా రాదాలోల శ్రితజనపాలా (బుర్రకధ) -
మూలాలు
[మార్చు]- ↑ సంపాదకుడు (17 February 1952). "వినోదా వారి 'శాంతి'". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 38 సంచిక 313. Retrieved 14 February 2018.[permanent dead link]