శామ్ పిట్రోడా
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సత్యన్ పిట్రోడా | |
---|---|
![]() 2014 షాజియా వేసిన పిట్రోడా చిత్రం | |
జననం | టిట్లాఘడ్, ఒడిషా | 1942 మే 4
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | మహారాజా శాయాజీరావు విశ్వవిద్యాలయం ఇల్లినోయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ |
వృత్తి | టెలికాం ఇంజనీర్, అంకుర వ్యాపారవేత్త |
ఉద్యోగం | మాజీ ప్రధానమంత్రి సలహాదారు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారతదేశంలో టెలికాం విప్లవం |
వెబ్‌సైటు | www |
డా. సామ్ పిట్రోడాగా పిలువబడే సత్యనారాయణన్ గంగరామ్ పిట్రోడా టిట్లాఘడ్, ఒడిషాలో జన్మించిన ఆవిష్కర్త, పారిశ్రామిక వేత్త, విధానాల రూపకర్త. భారతదేశపు జాతీయ నాలెడ్జి కమిషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. భారతదేశంలో ప్రచార సాధనాల విప్లవానికి ఆద్యుడుగా గణించబడతాడు.[1]
వరల్డ్ టెల్ లిమిటెడ్ అనే సంస్థకు ఛైర్మన్, ముఖ్య కార్య నిర్వహణ అధికారి. అనేక టెక్నాలజీ పేటెంటులు కల శామ్, కొత్త కంపెనీల స్థాపనకు మద్దతును అందించాడు. కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభావము గురించి ప్రపంచములో చాలా చోట్ల లెక్చర్లు ఇస్తూ ఉంటారు.
1992 లో ఐక్య రాజ్య సమితికి సహాయకునిగా పనిచేసారు. 1964 నుండి కుటుంబముతో పాటు, షికాగో, ఇల్లినాయిలో నివసిస్తున్నారు.
తొలి జీవితము[మార్చు]
సామ్ పిట్రోడా టిట్లాఘఢ్, ఒడిషాలో జన్మించాడు. మహాత్మా గాంధీ భక్తులైన తల్లితండ్రులు గుజరాత్ నుండి ఒడిషాకు వలస వెళ్ళారు. గాంధీ తత్త్వాన్ని జీర్ణించుట కొరకై శాం ను సోదరునితో సహా గుజరాత్ పంపించారు. శాం ఆనంద్ వల్లభ విద్యాలయలో ఉన్నత పాఠశాల, వడోదరాలో మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాయలం ఫిజిక్స్ లో ఎలక్త్ట్రానిక్స్ లో పూర్తి చేసాడు. ఆ తరువాత అమెరికా వెళ్ళి ఇల్లినాయి ఇన్ స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, షికాగోలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసాడు.
1960,70 లో టెలీకమ్యూనికేషన్స్, 'అరచేతిలో కంప్యూటర్' లో వినూత్నమైన టెక్నాలజీ పరిశోధనలు చేశాడు. 1975 లో సామ్ కనుగొనిన ఎలక్ట్రానిక్ డైరీ హస్తగత కంప్యూటింగ్ లో తొలి ఉదాహరణగా గణించబడుతుంది. తరువాత వెస్‌కామ్ స్విచింగ్ ను స్థాపించాడు. వెస్కామ్ రాక్‌వెల్ ఇంటర్నేషనల్ లో కలసిన తరువాత సామ్ ఒక వైస్ ప్రెసిడెంటు పదవిని పొందాడు. నాలుగు దశాబ్దాలు ఇంజనీరుగా పనిచేసిన సామ్ సాధించిన పేటెంట్ల వివరాలు ఈ వెబ్‌సైట్లో దొరుకుతాయి.
ప్రభుత్వ సర్వీసు[మార్చు]
1984 లో ప్రధాని ఇందిరా గాంధీ ఆహ్వానము పై భారత దేశానికి వచ్చి, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్) ను ప్రభుత్వ రంగ సంస్థగా ప్రారంభించాడు. 1987 లో రాజీవ్ గాంధీ హయాంలో సహాయకునిగా భారత స్వదేశీ విదేశీ టెలీకమ్యూనికేషన్ విధానాలకు రూపకల్పన చేశాడు. చౌకైన ధర లలో జాతీయ/ఆంతర్జాతీయ కాల్స్ చేసుకునే వీలుగా పసుపు పచ్చ పబ్లిక్ కాల్ ఆఫీసులు (ఎస్టీడీ బూత్) తెచ్చిన ఖ్యాతి ఆయన కే దక్కింది.
వీ.పీ. సింగ్ ప్రభుత్వ కాలంలో షికాగో తిరిగి వెళ్ళారు. 2004 లో రాహుల్ గాంధీ ఆహ్వానము పై పాలసీ సలహాదారుగా మారారు. యునైటెడ్ ప్రాగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వ అధికారము లోకి రాగానే డా. మన్మోహన్ సింగ్ జాతీయ జ్ఞాన సంఘముకు అధ్యక్షునిగా నియమించారు.
మూలాలు[మార్చు]
- ↑ "The Thursday Interview/ Sam Pitroda - Sify.com". web.archive.org. 2007-03-11. Archived from the original on 2007-03-11. Retrieved 2021-01-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)