శారదా రాథోడ్
| శారదా రాథోడ్ | |||
| పదవీ కాలం 2005 – 2014 | |||
| ముందు | రాజిందర్ సింగ్ బిస్లా | ||
|---|---|---|---|
| తరువాత | మూల్ చంద్ శర్మ | ||
| నియోజకవర్గం | బల్లబ్‌గఢ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
శారదా రాథోడ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె బల్లబ్‌గఢ్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]శారదా రాథోడ్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2005 శాసనసభ ఎన్నికలలో బల్లబ్‌గఢ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి మూల్ చంద్ శర్మపై 34,076 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సురేందర్ తెవాటియాపై 23,844 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై హుడా ప్రభుత్వంలో ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేసింది. ఆమెకు 2014, 2019 ఎన్నికలలో కాంగ్రెస్ టిక్కెట్ లభినచ్చకపోవడంతో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరింది.[1]
శారదా రాథోడ్ 2022 మే 23న కాంగ్రెస్‌లో చేరింది.[2] ఆమెకు 2024 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో[3] స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మూల్ చంద్ శర్మ చేతిలో 17730 ఓట్ల ఓడిపోయింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ Navbharat Times (29 August 2019). "बल्लभगढ़ से कांग्रेस की पूर्व विधायक शारदा राठौर बीजेपी में हुईं शामिल". the original నుండి 10 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 November 2024.
- ↑ Jagran (23 May 2022). "शारदा राठौर के कांग्रेस में शामिल होने से बदले राजनीतिक समीकरण - Political equation changed with Sharda Rathore joining Congress - Haryana Faridabad Politics News". the original నుండి 10 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 November 2024.
- ↑ The Tribune (12 September 2024). "Congress ignores top contenders, fields newcomers from Ballabhgarh, Tigaon" (in ఇంగ్లీష్). the original నుండి 10 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 November 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Ballabgarh". the original నుండి 10 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 November 2024.