Jump to content

శిల్పా మోహన్ రెడ్డి

వికీపీడియా నుండి
శిల్పా మోహన్ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2014
ముందు భూమా బ్రహ్మనంద రెడ్డి


వ్యక్తిగత వివరాలు

జననం 10 జనవరి 1960
నంద్యాల , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి రమాదేవి
బంధువులు శిల్పా చక్రపాణిరెడ్డి (తమ్ముడు)
సంతానం సింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి

సింగారెడ్డి గారి శిల్పా రెడ్డి

నివాసం నంద్యాల

శిల్పా మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు నంద్యాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

శిల్పా మోహన్ రెడ్డి 10 జనవరి 1960లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వైఎస్‌ఆర్ జిల్లా , కొండ సుంకేసుల గ్రామంలో చెన్నారెడ్డి , వెంకట లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఐ.టి.ఐ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో తొలిసారి నంద్యాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన తిరిగి 2009లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాడు.[1]

శిల్పా మోహన్ రెడ్డి 2014లో నంద్యాల నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడంతో 14 జూన్ 2017 2017లో తెలుగుదేశం పార్టీని వీడి హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరాడు.[2] శిల్పా మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన కుమారుడు సింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి కి టికెట్ ఇప్పించి ఆయన గెలుపులో కీలకంగా పని చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 August 2017). "Silpa Mohan Reddy" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
  2. Sakshi (14 June 2017). "వైఎస్సార్‌ సీపీలో చేరిన శిల్పామోహన్‌ రెడ్డి". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.