భూమా బ్రహ్మనంద రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భూమా బ్రహ్మనంద రెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
2017 - 2019
ముందు భూమా నాగిరెడ్డి
తరువాత సింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి
నియోజకవర్గం నంద్యాల

వ్యక్తిగత వివరాలు

జననం 1985
ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు భూమా వీరశేఖర్ రెడ్డి
జీవిత భాగస్వామి ప్రతిభ
బంధువులు భూమా నాగిరెడ్డి (బాబాయ్)
భూమా శోభా నాగిరెడ్డి (చినమ్మ)
భూమా అఖిల ప్రియ (చెల్లెలు)
కాటసాని రామిరెడ్డి(మామ)
నివాసం నంద్యాల, కర్నూలు జిల్లా
మతం హిందూ

భూమా బ్రహ్మనంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017లో నంద్యాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

భూమా బ్రహ్మనంద రెడ్డి 1985లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డలో జన్మించాడు.

క్లాస్ స్కూల్ / కాలేజీ ప్రదేశం సంవత్సరం
ఎల్.కే.జీ – 7వ తరగతి ఆళ్లగడ్డ
6 – 7 వేలాంగణి కాన్వెంట్ స్కూల్ . చెన్నై , తమిళనాడు 1997
8 - 10 వెంకటేశ్వరా బాలకుటీర్ గుంటూరు 2000
ఇంటర్మీడియట్ నలంద జూనియర్ కాలేజీ హైదరాబాద్ 2002
బి.టెక్ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలిజీ హైదరాబాద్ 2007

రాజకీయ జీవితం

[మార్చు]

భూమా బ్రహ్మనంద రెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తండ్రి భూమా వీరశేఖర్ రెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు, ఆయన తండ్రి మరణంతో ఖాళీ అయిన సీటు నుంచే ఆయన బాబాయి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. భూమా నాగిరెడ్డి 2014లో నంద్యాల నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి 2017లో గుండెపోటుతో మరణించాడు.[2] బ్రహ్మనంద రెడ్డి తన బాబాయి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి నంద్యాల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 27,466 మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ కి ఎన్నికయ్యాడు.[3][4] భూమా బ్రహ్మనందరెడ్డి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (28 August 2017). "భారీ మెజార్టీతో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
  2. The Hindu (22 August 2017). "No-holds-barred campaign for Nandyal bypoll ends" (in Indian English). Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
  3. Sakshi (29 August 2017). "నంద్యాల సీటు టీడీపీకి". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
  4. Nava Telangana (29 August 2019). "నంద్యాలలో భూమా గెలుపు". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.