శుభ్ర అయ్యప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శుభ్ర అయ్యప్ప
Shubra Aiyappa (cropped).jpg
2015లో జరిగిన 62వ దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో శుభ్ర అయ్యప్ప
జననంజనవరి 1, 1991
కొడగు, బెంగళూరు, కర్నాటక
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2015–ప్రస్తుతం

శుభ్ర అయ్యప్ప భారతీయ సినిమా నటి. 2014లో తెలుగులో వచ్చిన ప్రతినిధి సినిమాలో తొలిసారిగా నటించిన శుభ్ర అయ్యప్ప కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.[1][2]

జననం[మార్చు]

శుభ్ర 1991, జనవరి 1న బెంగళూరు సమీపంలోని కొడగులో జన్మించింది. ఈవిడ తల్లిపేరు చిత్ర. బెంగళూరులోని బాల్డ్విన్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది.

సినీరంగం[మార్చు]

చిన్నప్పటినుండి మోడలింగ్, సినిమా రంగాలపై ఉన్న ఆసక్తితో మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన శుభ్ర, వై. వి. ఎస్. చౌదరి దర్శకత్వంలో వచ్చిన రేయ్ సినిమాలో తొలిసారిగా కనిపించింది. అటుతరువాత నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి సినిమాలో జర్నలిస్టు పాత్రలో నటించింది.[3] 2015లో విజయ్ కాంత్ కుమారుడు షణ్ముగపాండియన్ నటించిన సగప్తం సినిమాతో తమిళ సినిరంగంలోకి ప్రవేశించింది.[4] 2015లోనే వచ్చిన వజ్రకాయ కన్నడ సినిమాతో కన్నడ సినిరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో వెనిస్ నగరంలో చిత్రీకరించిన పాటలో నటించింది.[5] ఈ సినిమాలోని శుభ్ర నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.[6][7] యవ్వనం ఒక ఫాంటసీ అనే సినిమాలో కూడా నటించింది.[8]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాష ఇతర వివరాలు
2014 ప్రతినిధి సునైన తెలుగు మొదటి చిత్రం
2015 సగప్తం ప్రియ తమిళం మొదటి చిత్రం
వజ్రకాయ గీత కన్నడం మొదటి చిత్రం
యవ్వనం ఒక ఫాంటసీ [9] తెలుగు

మూలాలు[మార్చు]

  1. "Shubra Aiyappa is addicted to belly dancing". The Times of India.
  2. "Shubra Aiyappa is on cloud nine". The Times of India.
  3. "I'm an actor by chance: Shubra Aiyappa". The Times of India.
  4. "Sagaptham Movie Review". The Times of India.
  5. "Shubra Aiyappa to make her Kannada debut". The Times of India.
  6. "Shivarajkumar gets candid with Shubra Aiyappa". The Times of India.
  7. "Fresh Talent Shines in Vajrakaya". The New Indian Express.
  8. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (16 April 2015). "వినోదాత్మకంగా 'యవ్వనం ఒక ఫాంటసీ'". మూలం నుండి 17 June 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 17 June 2019. Cite news requires |newspaper= (help)
  9. ఆంధ్రభూమి, రివ్యూ (11 December 2015). "వెంటాడే పీడకల". మూలం నుండి 14 December 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 17 June 2019. Cite news requires |newspaper= (help)

ఇతర లంకెలు[మార్చు]