శేషులత కోసూరు
డా. శేషులత కోసూరు | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
మూలం | భారతదేశం |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం, భారత శాస్త్రీయ సంగీతం |
వృత్తి | స్వరకర్త |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
డా. శేషులత కోసూరు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, ఉపాధ్యాయురాలు. ఆమె దేశవిదేశాలలో విస్తృతంగా ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె అనేక అవార్డులు, బిరుదులను అందుకుంది. ఆమె పలు డ్యాన్స్ బ్యాలెట్‌లను ట్యూన్ చేయడంతో పాటు అనేక కర్నాటిక్, భక్తి ఆల్బమ్‌లను విడుదల చేసింది.
విద్యాభ్యాసం
[మార్చు]ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో బి.ఎ పట్టా పొందిన ఆమె పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ పట్టాలు పొందింది.
హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి సంగీతంలోఆమె పిహెచ్.డి. చేసింది.
శిక్షణ
[మార్చు]ఆమె ప్రాథమిక శిక్షణను చోడవరపు సుబ్బారావు, దేశపతి రాజు, సిస్టు ప్రభాకర కృష్ణ మూర్తి శాస్త్రిల వద్ద పొందింది. బాలాంత్రపు రజనీకాంత రావు, ఎ. నారాయణ అయ్యర్, కె.ఆర్.గణపతి, వి.ఎల్.జానకి రామ్ ల మార్గదర్శకత్వంలో 1980-81లో తిరుపతిలోని కళాపీఠంలో తదుపరి శిక్షణ పొందింది.
ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంగీత అకాడమీ నుండి స్కాలర్‌షిప్‌తో 1981-88లో స్వర్గీయ వోలేటి వెంకటేశ్వర్లు, సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ల నుండి అధునాతన శిక్షణ పొందింది.
కెరీర్
[మార్చు]- శేషులత కోసూరు దేశవిదేశాలలో అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు.
- ఆమె 1989 నుండి తెలుగు విశ్వవిద్యాలయంలోని సంగీత విభాగంలో అధ్యాపకురాలు.
- ఆమె క్లాసికల్, లైట్ మ్యూజిక్ స్టైల్‌లలో గ్రేడెడ్ ఆకాశవాణి(AIR), హైదరాబాద్ కళాకారిణి.
- ఆమె దూరదర్శన్ తో పాటు ఇతర టెలివిజన్ ఛానెల్‌లలో శాస్త్రీయ, భక్తి సంగీతంలో ప్రదర్శనలు ఇస్తుంది.
- టెలివిజన్, ఇతర సంగీత కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది.
- ఆమె అనేక సాహిత్యం, కంపోజిషన్‌లకు సంగీతం అందించింది.
- సర్వం సయీ మయం, సంభవామి యుగే యుగే, గోదా దేవి వంటి అనేక డ్యాన్స్ బ్యాలెట్‌లు, మ్యూజికల్ ఒపెరాలను కూడా అందించింది.
- ఆమె ప్రస్తుతం సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ(SIFAS) లో ఉపాధ్యాయురాలు, అకాడమీ రిజిస్ట్రార్‌గా ఉన్నారు.
అవార్డులు
[మార్చు]- 1984లో ద్వారం వెంకటస్వామి నాయుడు, ఇవటూరి బాల స్వరస్వతి దేవి స్మారక నగదు బహుమతులు
- 1987లో జేసీస్ క్లబ్ నుండి జిల్లా, రాష్ట్ర స్థాయిలో 'అత్యుత్తమ యువ ప్రతిభావంత వ్యక్తి అవార్డు'
- 1998లో మహారాష్ట్రలోని అఖిల భారతీయ గంధర్వ విద్యాలయ మండల్ నుండి రుక్మిణి జగన్నాథన్ పురస్కారం
మూలాలు
[మార్చు]- మౌలిక పరిశోధన కలిగివున్నాయని అనుమానమున్న వ్యాసాలు
- ఆంధ్రప్రదేశ్ గాయకులు
- భారతీయ మహిళా శాస్త్రీయ గాయకులు
- మహిళా కర్ణాటక గాయకులు
- కర్ణాటిక్ గాయకులు
- భారతీయ సంగీత విద్యావేత్తలు
- ఆంధ్రప్రదేశ్ మహిళా విద్యావేత్తలు
- భారతీయ విద్యావేత్తలు
- భారతీయ గాయకులు
- కర్ణాటకకు మహిళా సంగీత విద్వాంసులు
- ఆంధ్రప్రదేశ్ అధ్యాపకులు
- భారతీయ మహిళా గాయకులు
- మహిళా సంగీత విద్యావేత్తలు