Jump to content

శోభా డే

వికీపీడియా నుండి
శోభా డే
Shobhaa De
పుట్టిన తేదీ, స్థలంశోభా రాజాధ్యక్ష
(1948-01-07) 1948 జనవరి 7 (వయసు 76)
Mumbai, Maharashtra, India
వృత్తిAuthor, columnist, novelist
జాతీయతభారతీయులు
పూర్వవిద్యార్థిSt. Xavier's College, Mumbai
Website
http://shobhaade.blogspot.com

శోభా రాజాధ్యక్ష, (శోభా డే గా ప్రసిద్ధులు) (జననం: జనవరి 7 1948) భారతీయ నవలా రచయిత, కాలమిస్ట్‌.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

శోభ అసలు పేరు శోభా రాజాధ్యక్ష. ఈమె మహారాష్ట్ర లోని ముంబాయిలో జనవరి 7, 1948 సంవత్సరంలో ఒక గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన శోభ ఆచార వ్యవహారాలలో ఇంట్లో చాలా కఠినంగా ఉండేవారు. అయినా ఆ రోజుల్లోనే ఆమె పట్టుబట్టి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. ముంబాయి సెంట్‌క్సేవియర్‌ కాలే జీలో ఫిలాసఫీ ప్రధానాంశంగా తీసుకుని ఎంతో పట్టుదలతో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ల లో.ఇంకా మన దేశంలో స్ర్తీవిద్యపై పూర్తిగా ఎవరికీ అవగాహన లేదు. పైగా దేశాలలోని చట్టాలన్నీ కూడా పురుషులకే అనుకూలంగా ఉండేవి. స్ర్తీవిద్యకు ప్రాధాన్యం అంతగాలేని ఆ రోజుల్లో ఒక మహిళ డిగ్రీ వరకూ చదవడమే గొప్ప అంశంగా భావించేవారు. అయితే కాలేజీ రోజుల్లోనే శోభ చిన్నచిన్న అభ్యుదయ కవితలు రాసుకునేది. అందరిలో ఒక్కదానిలా కాకుండా ఒక్కరే అందరిలో అనిపించుకోవడం గొప్పగా భావించేది శోభ.

కెరీర్

[మార్చు]

శోభా తన కెరీర్‌ తొలిరోజుల్లో మోడలింగ్‌ చేసింది. వ్యాపార ప్రకటనలకు, కొన్ని సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఆ తర్వాత 1970 లో తన కెరీర్‌నే మలుపుతిప్పిన జర్నలిజంను వృత్తిగా మలచుకుంది. ఆమె మూడు మ్యాగనైన్లు స్థాపించింది. వాటిలో మొదటిది స్టార్‌డస్ట్. స్టార్‌డస్ట్‌ మేగజైన్‌ అంతలా ప్రాచుర్యం పొందడంతో ఆమె మరో అడుగు ముందుకేసి సొసైటీ, సెలెబ్రిటీ అనే మేగజైన్స్‌ కూడా నెలకొల్పింది.[2] ఇలా ఒకే సారి మూడు పత్రికల నిర్వహణ కష్టమయ్యేసరికి...ఆ తర్వాత ఆమె ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా మారి మార్కెట్లో ఉన్న వివిధ పత్రి కలకే కాకుండా...అంతర్జాతీయ మేగజైన్స్‌కు కూడా ఆమె తన ప్రత్యేక వ్యాసాలను అందించేవారు. అంతర్జాతీయంగా కూడా ఆమె పేరు మారుమోగిపోయింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె భర్త దిలీప్ డే. భర్త దిలీప్‌ డే కూడా శోభకు అను కూలమైన భర్త. ఆమె స్వేచ్ఛకు ఏనాడూ అతడు అడ్డురాలేదు. తన ఎదుగుదలలో భర్త ప్రోత్సాహం మరువలేనిదని ఆమె అంటుంది.వివాహానికి పూర్వం ఆమె భర్త దిలీప్ డేకు రాధిక, రనదీప్ అనే ఇద్దరు పిల్లలున్నారు. శోభా డే (అప్పటికి శోభా కిలాచంద్ గా పిలువబడేది) ఇద్దరు పిల్లలైన ఆదిత్య, అవంతిక తో విడాకులు తీసుకొని ఉంది. ఆ తర్వాత శోభాడె దిలీప్ తో 1984 లో వివాహమాడారు. వారికి అరుంధతి, అనందిత అనే ఇద్దరు పిల్లలు కలరు.

ఆమె రాసిన పుస్తకాలు

[మార్చు]
  • శోభా ఎట్‌ సిక్టీ (2010)
  • సంధ్యాస్‌ సీక్రెట్‌ (2009)
  • సూపర్‌ స్టార్‌ ఇండియా-ఫ్రమ్‌ ఇంక్రెడిబుల్‌
  • టు అన్‌ స్టాపబల్‌
  • స్ట్రేంజ్‌ అబ్సెషన్‌
  • స్నాప్‌ షాట్స్‌
  • స్పౌస్‌-ది ట్రూత్‌ అబౌట్‌ మ్యారెజ్‌
  • స్పీడ్‌ పోస్ట్‌(1999)
  • సరె్వైవింగ్‌ మెన్‌(1998)
  • సెలెక్టివ్‌ మెమోరి (1998)
  • సెకండ్‌ థాట్‌(1996)
  • స్మాల్‌ బిట్రేయల్‌ (1995)
  • షూటింగ్‌ ప్రమ్‌ హిప్‌ (1994)
  • అన్‌ సర్టెన్‌ లైజన్స్‌ (1993)
  • స్టారీ సిస్టర్స్‌ (1989)
  • సోషలైట్‌ ఈవ్‌నింగ్‌ (1989)

మూలాలు

[మార్చు]
  1. "Shobhaa De, Penguin script new chapter". The Times of India. 9 April 2010. Retrieved 9 September 2012.
  2. "Bio-Bibliographical Information Biographical references". Archived from the original on 2009-10-27. Retrieved 2009-10-27.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=శోభా_డే&oldid=2988811" నుండి వెలికితీశారు