శోభితా రాణా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శోభితా రాణా
జననం (1992-06-16) 1992 జూన్ 16 (వయసు 31)
విద్యఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేట్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మోడల్, సినిమా నటి
జీవిత భాగస్వామితరుణ్ అగర్వాల్ (వి. 2018 మార్చి 8)
తల్లిదండ్రులు
  • గీతా రాణా (తల్లి)

శోభితా రాణా (జననం 1992 జూన్ 16) ఒక భారతీయ చలనచిత్ర మోడల్, నటి. ఆమె 2016లో పంజాబీ చిత్రం కెనడా డి ఫ్లైట్‌లో రూప్ పాత్రను పోషించినందుకు ప్రసిద్ధి చెందింది. ఆమె 2014లో కబీర్ సదానంద్ దర్శకత్వం వహించిన గోలు అండ్ పప్పు చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన రంగ రంగ వైభవంగా (2022) చిత్రంతో తెలుగు చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

బాల్యం, విద్య[మార్చు]

శోభితా రాణా 1992 జూన్ 16న భారతదేశంలోని చండీగఢ్‌లో మధ్యతరగతి హిందూ రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించింది. ఆమె పాఠశాల విద్య హర్యానాలోని పంచకులలో కొనసాగింది. చండీగఢ్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.

కెరీర్[మార్చు]

గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ఆమె ముంబై చేరుకుని మోడలింగ్‌లో కెరీర్ మొదలుపెట్టింది. కొన్ని టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో పనిచేసింది. ఆమె కోల్గేట్, రిలయన్స్ ట్రెండ్స్, గోద్రెజ్, మెన్మోడ మొదలైన వివిధ బ్రాండ్‌లకు మోడల్‌గా ఉంది.

ఆమె 2014లో ఇష్క్ బ్రాందీ చిత్రంతో పంజాబీ రంగప్రవేశం చేసింది.[1] తెలుగులో రాజా మీరు కేక (2017), హిందీలో రామరాజ్య (2022)[2], కన్నడంలో షాడో (2021)[3] సినిమాల్లో నటించింది. ఆమె వైల్డ్ కార్డ్ పెర్ఫార్మర్‌గా ఇండియాస్ బెస్ట్ సినీస్టార్స్ కి ఖోజ్ అనే రియాల్టీ షోలో కూడా కనిపించింది. 2013లో నా హీరేను సతా అనే మ్యూజిక్ వీడియోలో నటించింది.

అర్జున్ కృష్ణ, శోభితా రాణా ప్రధానపాత్రధారులుగా నిర్మాణంలో ఉన్న చిత్రం మిస్సమ్మ (2022)[4] లో ఆమె నటిస్తోంది.

మూలాలు[మార్చు]

  1. "Actress Shobhita Rana latest pics | News in Telugu". web.archive.org. 2022-12-12. Archived from the original on 2022-12-12. Retrieved 2022-12-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "శోభిత.. పరువాల శోభితం (ఫొటోలు) | Sizzling Photos of actress Shobhita Rana - Oneindia Telugu". web.archive.org. 2022-12-12. Archived from the original on 2022-12-12. Retrieved 2022-12-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "శోభిత.. అందాల విందు (ఫొటోలు) | Sizzling Photos of Shobhita Rana - Oneindia Telugu". web.archive.org. 2022-12-12. Archived from the original on 2022-12-12. Retrieved 2022-12-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Wayback Machine". web.archive.org. 2022-12-12. Archived from the original on 2022-12-12. Retrieved 2022-12-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)