శ్రీనివాస్ గద్దపాటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీనివాస్ గద్దపాటి
శ్రీనివాస్ గద్దపాటి
జననంశ్రీనివాస్
(1970-09-22) 1970 సెప్టెంబరు 22 (వయసు 53)
రామాపురం, ఖమ్మం జిల్లా, తెలంగాణ, భారతదేశం
నివాస ప్రాంతంఖమ్మం, తెలంగాణ
వృత్తిఅధ్యాపకుడు
రచయిత
మతంహిందూ
భార్య / భర్తప్రభారాణి
పిల్లలురాజశ్రీ, రచన
తండ్రిరాజయ్య
తల్లిరత్నమ్మ

శ్రీనివాస్ గద్దపాటి యువ కవి, ఉపాధ్యాయుడు. కవి సంగమం రచయిత.[1]

జననం[మార్చు]

శ్రీనివాస్ గద్దపాటి రత్నమ్మ, రాజయ్య దంపతులకు 1970 సెప్టెంబరు 22న ఖమ్మం జిల్లాలోని రామాపురం లో జన్మించాడు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం[మార్చు]

ప్రస్తుతం ఖమ్మంలో నివసిస్తున్నాడు. ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు.

వివాహం[మార్చు]

శ్రీనివాస్ ప్రభారాణితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు (రాజశ్రీ, రచన).

ప్రచురితమయిన మొదటి కవిత[మార్చు]

మొదటి కవిత.. వెంటాడే జ్ఞాపకం అనే కవిత గుమ్మం, ఖమ్మంజిల్లా కవుల సంకలనంలో ప్రచురితం అయింది.

కవితల జాబితా[మార్చు]

 • గుమ్మం
 • స్వేచ్ఛకోసం
 • మార్పుకోసం
 • జాగో జగావో
 • క్విట్ తెలంగాణ
 • నల్లస్వప్నం
 • మునుం
 • తొలిపొద్దు
 • సఫాయిలం
 • తొలివెలుగు
 • అస్థిత్వం
 • కొత్తతొవ్వ
 • పంచమస్వరం
 • చైతన్య కవనం
 • ఆసిఫాకోసం
 • అక్షరాలతోవ
 • సాహితీసౌరభాలు

మొదలయిన కవితా సంకలనాల్లో మూసీ, క్రిష్టియన్ అంబాసిడర్, ఆకాషిక్ ... వాకిలి, వన్ ఇండియా, సారంగ అంతర్జాల పత్రికల్లో కవితలు

== ప్రచురితమయిన పుస్తకాల జాబితా

"పంచమస్వరం" మాదిగ కవుల కవితాసంకలనం, యుద్ధం ముగిసిపోలేదు,2023 జూలై.

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు[మార్చు]

 • జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డ్ 2015;
 • డా.బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ ఫెలో షిప్ అవార్డ్ ( న్యూ డిల్లి) 2015;
 • డా.వై.ఆర్.కే.స్మారక సాహితీ అవార్డ్ 2015;
 • గురుబ్రహ్మ నేషనల్ అవార్డ్ 2015;
 • మదర్ స్వచంద సేవా సంస్థ విజయవాడ వారి అవార్డ్ 2015
 • భక్తరామదాసు సర్వీసెస్ సొసైటీ,నేలకొండపల్లి వారిచే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్ఢ్ 2016
 • అబ్దుల్ కలామ్ స్వచ్ఛంద సంస్థ విశాఖపట్నం వారిచే విద్యాభూషణ్ అవార్డు 2016
 • భారతీయ దళిత సాహిత్య అకాడమీ తెలంగాణ వారిచే "సాహిత్య రత్న" అవార్డు 2018
 • బి.యస్ రాములు జీవనసాఫల్య సాహిత్య పురస్కారం 2019

ఇతర వివరాలు[మార్చు]

2014, నవంబరు 23 హైదరాబాదులోని గోల్డెన్ త్రెషోల్డ్లో జరిగిన కవిసంగమం సిరీస్ 20లో పాల్గొన్నాడు.[2]

మూలాలు[మార్చు]

 1. నవతెలంగాణ, ఖమ్మం-స్టోరి (24 December 2018). "హృదయ స్పందనే కవిత్వం". NavaTelangana. Archived from the original on 22 సెప్టెంబరు 2019. Retrieved 22 September 2019.
 2. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (17 November 2014). "కవిసంగమం-20". www.andhrajyothy.com. Archived from the original on 22 సెప్టెంబరు 2019. Retrieved 22 September 2019.