శ్రీ లక్ష్మమ్మ కథ

వికీపీడియా నుండి
(శ్రీలక్ష్మమ్మ కథ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శ్రీ లక్ష్మమ్మ కథ
(1950 తెలుగు సినిమా)

చందమామ పత్రికలో శ్రీ లక్ష్మమ్మ కథ ప్రకటన
దర్శకత్వం ఘంటసాల బలరామయ్య
నిర్మాణం ఘంటసాల బలరామయ్య
తారాగణం అంజలీదేవి,
నాగేశ్వరరావు
సంగీతం సి.ఆర్.సుబ్బరామన్
నేపథ్య గానం సుసర్ల దక్షిణామూర్తి,
పి.లీల,
జిక్కి,
ఎ.పి.కోమల,
శివరావు
నృత్యాలు రాఘవయ్య
గీతరచన బలిజేపల్లి,
కే.జి.శర్మ
ఛాయాగ్రహణం శ్రీధర్
నిర్మాణ సంస్థ ప్రతిభా పిక్చర్స్
పంపిణీ పూర్ణా పిక్చర్స్
భాష తెలుగు

శ్రీ లక్ష్మమ్మ కథ చిత్రాన్ని ఘంటసాల బలరామయ్య నిర్మించి దర్శకత్వం వహించాడు. ప్రతిభా ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, కస్తూరి శివరావు, జి. వరలక్ష్మి మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం సి. ఆర్. సుబ్బరామన్ అందించారు .

నటీనటులు

[మార్చు]


సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు, నిర్మాత: ఘంటసాల బలరామయ్య

నిర్మాణ సంస్థ: ప్రతిభా ఫిలింస్

సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్

మాటలు: బలిజేపల్లి లక్ష్మీకాంతం

పాటలు:గోపాలరాయ శర్మ

నేపథ్య గానం: పి.సుశీల, సుసర్ల దక్షిణామూర్తి, పి.లీల, జిక్కి, కె.శివరావు, ఎ.పి.కోమల

ఫోటోగ్రఫి: శ్రీధర్

నృత్యం:రాఘవయ్య

కళ: ఎస్.వి.ఎస్

విడుదల:1950: ఫిబ్రవరి:26.

ఆసక్తికరమైన విషయం

[మార్చు]

ఒకే సంవత్సరంలో (1950 లో) ఒకే కథని ఇద్దరు నిర్మాతలు, వివిధ తారాగణాలతో - పోటాపోటీలతో - నిర్మించి ఒకేసారి విడుదల చేసేరు. లక్ష్మమ్మ సినిమాలో నారాయణరావు, కృష్ణవేణి నటించారు. ఘంటసాల సంగీత దర్శకత్వం.



పాటల జాబితా

[మార్చు]

1.జయమంగళ గౌరీ హిమశైలకుమారి జగదీశ్వరి

2.ఆడజన్మ అధోగతిగా అంతమొందుటకేనా, రచన: గోపాలారాయ శర్మ, గానం.సుసర్ల దక్షిణామూర్తి

3.ఇది నా విధికృతమా గతిమాలిన జన్మయిల బాధాలకేనా, రచన: గోపాలరాయ శర్మ, గానం.పి.లీల

4.గుమ్మడిపూల కమ్మనిగాలి ఊపే ఉయ్యాలోయీ., రచన: గోపాలరాయ శర్మ, గానం.ఎ.పి.కోమలి బృందం

5.చిన్నారి బంగారు చిలకవే నా తల్లి, రచన: గోపాలరాయ శర్మ, గానం.పి.లీల బృందం

6.చీటికి మాటికి చిట్టెమ్మంటావు పెదనాయుడుంటాడు, రచన: గోపాలరాయ శర్మ, గానం.కస్తూరి శివరావు, జిక్కి

7.జీవితమే వృథయవునో సుఖించే ఆశలు మాసేనో, రచన: గోపాలరాయ శర్మ, గానం.పి.లీల బృందం .

8.తాళగ జాలనురా నాసామి జాలము సేయకురా, రచన: గోపాలరాయ శర్మ, గానం.ఎ.పి.కోమలి

9.నట్టింట మాలక్ష్మి కాలుపెట్టింది తాపట్టిందంతా బంగారమాయెను, రచన: గోపాలరాయ శర్మ, గానం. బృందం

10. రాక రాక నీవొచ్చావోయ్ నాకేటి సరుకులు తెచ్చావోయ్ ,

11.వెలుపువై వెలిశావు లక్ష్మమ్మా నీవు శ్రీలక్ష్మివేవమ్మా, రచన: గోపాలరాయ శర్మ, గానం.బృందం

12.సరసుడ ఇంతటి జాలము తగునా మరచితివా నను

13.హాయిగా వీనులవిందుగా అనురాగము , రచన: గోపాలరాయ శర్మ, గానం.పులపాక సుశీల, సుసర్ల దక్షిణామూర్తి.


మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.