శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం, కొల్లేటికోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ పెద్దింట్లమ్మ తల్లి దేవాలయం
శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం, కొల్లేటికోట
శ్రీ పెద్దింట్లమ్మ తల్లి దేవాలయం is located in Andhra Pradesh
శ్రీ పెద్దింట్లమ్మ తల్లి దేవాలయం
శ్రీ పెద్దింట్లమ్మ తల్లి దేవాలయం
Location in Andhra Pradesh
భౌగోళికాంశాలు:16°37′39″N 81°17′21″E / 16.6276°N 81.2893°E / 16.6276; 81.2893అక్షాంశ రేఖాంశాలు: 16°37′39″N 81°17′21″E / 16.6276°N 81.2893°E / 16.6276; 81.2893
పేరు
స్థానిక పేరు:పెద్దింట్లమ్మ దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:కృష్ణా
ప్రదేశం:కొల్లేటికోట
ప్రదేశం:కొల్లేటికోట
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:పేరంటాలమ్మ (పెద్దింట్లమ్మ)
నిర్మాణ శైలి:కళింగ శిల్పకళ
ఆలయాల సంఖ్య:1 (+2 సూరిలో ఉన్న ఉప ఆలయాలు)
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
12th, 13th C.E.
నిర్మాత:చాలుక్యరాజులు

శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట అనే గ్రామంలో ఉంది. నీటి మధ్యలో ద్వీపకల్పం పద్మాసన భంగిమలో ఆశీనులైన పెద్దింట్లమ్మ తల్లి.. వేంగిరాజుల కాలంలో నిర్మించిన పురాతన దేవాలయం.. కొల్లేటి గ్రామాల ప్రజలకు ఆరాధ్యదైవం. దేవాలయంలో అనేక విశేషాలున్నాయి. అమ్మకు ఏటా జాతర (తీర్థం) నిర్వహిస్తారు. ఆ సమయంలో కొల్లేటికోట పెద్ద జనారణ్యంగా మారుతుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణం రోజున ప్రభల ఊరేగింపు, బోనాల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోట ప్రాంతమున ఉన్న ప్రసిద్ధ ఆలయం పెద్దింట్లమ్మ వారి ఆలయము. శతాబ్ధాల చరిత్ర కలగిన ఈ అమ్మవారి ఆలయంలో తొమ్మిది అడుగులపైబడి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో అత్యద్భుతంగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించేందుకు ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వస్తుంటారు. ఏటా పాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ జరిగే ఉత్సవాలలో పాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున పెద్దింట్లమ్మ సమేత జలదుర్గకు కొల్లేటి కోట సమీపాన కల గోకర్ణేశ్వరస్వామి వారికి కళ్యాణము జరిపిస్తారు.

చారిత్రక నేపధ్యం[మార్చు]

శాలంకాయనులు (పల్లవులు)[మార్చు]

కొన్ని సంవత్సరాల క్రితం Walter Elliot గారికి కొల్లేరు సరస్సు సమీపంలో 3 రాగి రేకులు లంభించాయని, అవి 7'8/10 పోడవు మరియు 1'1/2 అంగులాల వెడల్పుతో ఉన్నాయని, అవి శాలంకాయనులకు(Hala canarese) కు సంబంధించినయని, The Madras Journal of Literature and Science, volume 11 లో పేర్కొన్నారు. ఆ శాసనాలలో ఇలా వ్రాయబడిందని వివరించారు.

గొప్ప గుణవంతుడు, మహా రాజీవచ వర్మ పెద్ద కుమారుడు మరియు కులంక(నేటి కొల్లేటికోట) యొక్క వేంగిపుర(నేటి పెద్ద వేగి) మహారాజు శ్రీ విజయ 'నంది వర్మ' చిత్రరథ స్వామి (సూర్య భగవానుడు) పాదాల దగ్గర ధ్యాన నర్భందములో ఉండి భటురకుల(మునుల) పాదాలకు నమస్కరించి కుదుహర(నేటి గూడూరు) యొక్క విషయలో ఉన్న "విదనుర్ పల్లి" గ్రామ పెద్దలకు మరియు ప్రజలకు ఆదేశించినది ఏమనగా! రాజు ధర్మాన్ని అనుసరించి తన కులాన్ని మరియు గోత్రాన్ని నాశనం లేకుండా చేయుటకు మరియు తన కీర్తిని ప్రతిష్ఠలను పెంచుకోవడానికి "చిన్నపాకుర్వక"(నేటి కొండవీర్ జిల్లా లోని చిన్న పాకుర్) అనే గొప్ప అగ్రహారానికి చెందిన వివిధ గోత్రములకు చెందిన మరియు వేదాలను పఠించే 157 బ్రాహ్మణులకు ఈ ఊరిలో సభ్యతతో విరమించిన భూమికి దేశాదిపతియైన రాజు యొక్క ప్రజా అధికారులచే నిర్వహించబడుతు ధానం చేశారు.

వేంగి చాళుక్యులు[మార్చు]

జయసింహుని కాలంలో చైనా బౌద్ధ యాత్రికుడైన "హ్యూయాన్ త్సాంగ్" వేంగి, కొల్లేరు ప్రాంతంలో పర్యటించాడు.అప్పుడు కొల్లేరు ప్రాంతాన్ని సందర్శించి, జయసింహుడు సా.శ.633-663 అనగా 30 ఏండ్లు వేంగీ రాజధానిగా పరిపాలించాడని,ఆయన నౌకయుద్ధంలో ఆరితేరినవాడని చెప్పియున్నాడు.కొల్లేరు సరస్సులో జయసింహుని నౌకలు విహరిస్తున్నాయని,హిందూ సంస్కృతి విలసిల్లుచున్నదని ఎక్కడ చూసినా హిందూ దేవాలయాలే కనిపిస్తున్నాయని తాను రాసిన ఓ గ్రంథంలో పేర్కొన్నాడు.చరిత్రకి సంబదించిన అద్భుత సమాచారాన్ని స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి శ్రీ చింతలపాటి మూర్తి రాజు గారు కొన్నేళ్ళ క్రితమేకొల్లేరుఅనే పుస్తకాన్ని ఈ రకముగా రాసారు.

వేంగి చాళుక్యుల కాలంలో కొల్లేరుకు "కొలను విషయ, సాగర విషయ గా పేర్లు ఉన్నట్లు 1985లో వెలువడిన Rule of the Chalukya - Cholas in Andhradesa అనే పుస్తకంలో M.Krishna Kumari గారు తెలియజేసారు.వేంగి చాళుుక్యులకు, సరోనాధులకు పరిపాలనా భాందవ్యాలు ఉన్నాయి. అయితే సుమారు క్రీ" శ 1076 కాలంలో వీర విజయాదిత్యుని (6వ విజయాదిత్యుడు) మరణంతో వేంగిలో చాళుుుక్య రాజుల పాలన అంతరించింది.[1]

సరోనాథులు[మార్చు]

కొల్లేరు పెద్దింట్లమ్మవారి ఉత్సవం కొల్లేరు.

యశోదాదేవి (Yashoda devi) గారు తాను రచించిన (హిస్టరీ ఆఫ్ ఆంధ్రా కంట్రీ The History of Andhra country, 1000A.D - 1500A.D) అనే పుస్తకంలో ఈ సరోనాధులు గూర్చి ప్రస్తావించారు. సరోనాధులు లేక కొలనుమండలీకులు సరసిపుర (నేటి ఏలూరును) రాజధానిగా చేసుకొని కొలను విషయను పరిపాలించారు. సరోనాధులులలో ప్రముఖుడు తెలుగు భీముడు ఇతడి పేరు మీద వెలసిన గ్రామమే నేటి భుజబలపట్నం. దండి మహా కవి తన దశకుమార చరిత్రలో తెలుగు భీముడి గూరించి గొప్పగా వ్రాసాడు. తెలుగు భీముడు తూర్పు గాంగులు (గంగా సామ్రాజ్యం) రాజులైన కళింగ వజ్రహస్త, రాజరాజ, అనంతవర్మచోడ గంగా అనే రాజులకు విధేయుడుగా ఉండేవాడు.అంతే కాదు చాళుుక్య రాజైన 6వ విక్రమాదిత్యుడితో కూడా విధేయుడుగా వ్యవహరించాడు. సా.శ. 1076 లో 6వ విజయాదిత్యుని మరణం తరువాత వేంగి రాజుల పరిపాలన ముగిసింది. వేంగి రాజు కులోత్తుంగ చోళుడు (రాజరాజ నరేంద్రుడి కొడుకు) తన 4వ కొడుకైన విక్రమచోళుడిని వేంగిపురానికి మహారాజును చేశాడు. విక్రమ చోళుడు శాలివాహనశకం 1042 (సా.శ. 1120) లో పరిపాలనలో ఉన్నట్లు కర్ణాటక రాష్ట్రం లోని సిద్దగట్ట శిలాశాసనం భట్టి తెలుస్తుంది. (Epigraphia Carnatica, volume 10, part-1, ) వేంగిలో విక్రమచోళుడి విదేశిపాలన ప్రమాదంగా భావించి తెలుగు భీముడు తిరుగుబాటు చేసాడు. తరువాత విక్రమచోళుడు తెలుగు భీముడిని చంపినట్లు అనేక శిలాశాసనాలలో పోందుపరచడమైనది. తరువాత కొన్ని తమిళ శిలాశాసనాలు భట్టి విక్రమచోళుడు దక్షిణ ప్రాంతాన్ని ఏలడానికి ఉత్తర ప్రాంతమైన వేంగిని వదిలేసాడని తెలుస్తుంది. ఈ విషయము Epigraphy by Archaeological Survey of India. Southern circle, అనే పుస్తకంలో కూడా ఉంది.[2]

చాలుక్యరాజులు[మార్చు]

రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు వస్తుంటారు. 11వ శాతాబ్ధకాలం నుంచి వేంగి చాళుక్యురాజులు అమ్మవారిని కొలిసేవారని. కమలాకరపురం వల్లభుల శాసనాలు సామాన్యశకం 12, 13వ శతాబ్దం వల్ల తెలుస్తోంది. నేటి ఏలూరు (కమలా కరపురం), పద్మినిపురం (నేటి గణపవరం), కొలనువీడు (కొల్లేటికోట)గా చరిత్ర ఆధారాలు శాసనాల ద్వారా బయట పడ్డాయి. క్రీస్తుశకం 1076లో వీర విజయాధిత్యుని మరణంతో వేంగిచాళుక్యరాజుల పాలన అంతరించింది. మండలేశ్వరుల తిరుగుబాటుతో కొలను వీడు తెలుగు భీముడు, మిగిలిన తిరుగుబాటు దారులతో కలిసి చాళుక్యరాజు అయిన విజయాదిత్య చక్రవర్తిగా పేరుగాంచిన వేంగిశ్వరుడు పరిపాలన చేశాడు. ఈ వేంగీశ్వరుడే పార్వతీదేవిని పెద్దమ్మగా కొలి శాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. పిఠాపురం శాసనాన్ని బట్టి అగస్త్యుడు కొల్లేటికోట చుట్టూ అబేధ్యమైన దుర్గాన్ని నిర్మించాడు. ఈ కోట చుట్టూ 150 రాజహస్తాల వెడల్పు, 7 నిలువుల లోతు, 3 కోశాల చుట్టుకొలతగల అద్భుత అగడ్త ఉండేదని చరిత్ర కారులు రాశారు. ప్రాచీన కాలంలో ఇక్కడ ఉండే మేడలు, మిద్దెలు, దేవశాలు కాల గర్భంలో కలిసిపోయాయి. ఒక్క అమ్మవారి ఆలయమే నేటికి నిలిచి ఉంది. చైనా

బౌద్ధ యాత్రికుడు హూయాన్ త్సాంగ్ కొల్లేటి సరస్సును మహత్తర మంచినీటి సరస్సుగా వర్ణించాడు.

రవాణా సౌకర్యాలు[మార్చు]

సమీపాన కల ఆకివీడు నుండి లాంచీ ల ద్వారా, లేదా ఆలపాడు నుండి చిన్న రవాణా సాధనాలతో కర్రల వంతెన ద్వారా, ఏలూరు నుండి కైకలూరు మీదుగా బస్సు ద్వారా ఇక్కడికి చేరవచ్చు.

మూలాలు[మార్చు]