శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం, నెల్లూరు
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
నెల్లూరు నగరం మూలాపేటలో శివుని యొక్క ప్రఖ్యాతి గాంచిన పురాతన ఆలయం శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం.
ఈ ఆలయం 6 వ శతాబ్దానికి చెందిన ఆలయమని చెబుతుంటారు.
శివరాత్రి పర్వదినంనాడు ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
ఈ దేవాలయం మహిమాన్వితమైనదని ఇక్కడి శివలింగాన్ని పూజించి కోరికలను విన్నవిస్తే అవి కచ్చితంగా ఫలిస్తాయని ఇక్కడకు వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన మహాకవి తిక్కన సోమయాజి ఈ దేవాలయంలోని శివుని పూజించిన తరువాతనే తన రచనను ప్రారంభించాడని చెబుతుంటారు.
1400 సంవత్సరాల క్రితం నాటిదిగా భావించే ఈ ఆలయం నెల్లూరు నగరంలో పడమర వైపు ఉంది.
పరమశివుడు ఒక ఉసిరి చెట్టు కింద తన ప్రణాళికను సిద్ధం చేసుకొని తానే స్వయంగా ఆలయాన్ని నిర్మించుకొన్నట్లు పురాణ కథనం.
మనుమసిద్ధి మహారాజు ఈ ఆలయ రాజ గోపురాన్ని నిర్మించాడు.
ఈ ఆలయ పురాతన చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలు లేవు లేదా దాచిపెట్టుండవచ్చు.