ఉసిరి

వికీపీడియా నుండి
(ఉసిరి చెట్టు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

విజయనగరం జిల్లాలో ఉసిరి (గ్రామం) ఉంది.

ఉసిరి
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Tribe:
Subtribe:
Genus:
Species:
ఫి. ఎంబ్లికా
Binomial name
ఫిలాంథస్ ఎంబ్లికా
Synonyms

సిక్కా ఎంబ్లికా Kurz
ఎంబ్లికా అఫిసినాలిస్ Gaertn.
మిరాబలనస్ ఎంబ్లికా Burm.
ఫిలాంథస్ మైరీ Lév.

ఉసిరి ఒక చెట్టు. ఉసిరికాయల గురించి వీటిని పెంచుతారు. ఉసిరి కాయను ఆంగ్లంలో The Indian gooseberry (Phyllanthus emblica, syn. Emblica officinalis), అనీ, హిందీలో "ఆమ్ల' అనీ, సంస్కృతంలో "ఆమలక" అనీ అంటారు. దీనిలో విటమిన్ సి. పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు-ముఖ్యంగా చ్యవన ప్రాశ్‌లో. మలబద్ధకానికి ఉసిరి కాయ దివ్యౌషధం. షాంపూలో కూడా ఉసిరి కాయను వాడతారు. దీని శాస్త్రీయనామం ఫిలాంథస్‌ ఎంబ్లికా (Phyllanthus emblica). ఇది ఫిలాంథిసియా కుటుంబానికి చెందిన వృక్షం. ఇది మరీ పెద్దగా, మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఎదిగే చెట్టు. సుమా రుగా 8 నుంచి 18 అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది. ఈ చెట్టు ఆకులు చిన్నవిగా, ఆకుపచ్చ రంగులో ఉండి, కొమ్మలు విస్తరిం చి ఉంటాయి. దీని పువ్వులు పసుపు, ఆకు పచ్చ రంగుల సంమ్మేళనంతో కూడి ఉంటా యి. దీని కాయలు కూడా అదే రంగులో ఉండి, 6 నిలువుగీతలు కలిగివుంటాయి. ప్రతి కొమ్మకి అధికసంఖ్యలో ఉసిరి కాయలు కాస్తాయి. వైద్య పరంగా ఉసిరిక ఎన్నో ఔషధగుణా లున్న వృక్షం. ఆయుర్వేదంలోను, యునానీ ఔషధాల్లో విరివిగా వాడతారు. అలాగే ఈ చెట్టు కాయలు, పువ్వులు, బెరడు, వేరు అన్నీ సంపూర్ణ ఔషధగుణాలు కల భాగాలే. విట మిన్‌ సి, ఐ పుష్కలంగా ఉన్న ఉసిరి, జుట్టుకి మంచి ఔషధంగా ఉపయోగపడు తుంది. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు లాంటి వి రాకుండా కాపాడుతుంది. అందుకే తలనూనెల కంపెనీలు ఆమ్లా హేరాయిల్స్‌ తయారీలో నిమగ్నమై ప్రపంచ వ్యాప్తంగా సరఫరాచేస్తున్నారు. అంతేకాక హెమరైజ్‌కి, మెన్‌రేజియా, లుకోమియా వ్యాధులకి, గర్భసంచిలో రక్త స్రావాన్ని అరి కట్టడానికి ఔషధంగా వాడతారు. దీని నుండి తయారుచేయబడిన నూనెని చాలా మంది నిత్యంవాడుతూ వుంటారు. తల భారాన్ని, తలపోటుని నిరోధించి, మెదడుకి చల్ల దనాన్ని ఇస్తుంది. సౌందర్యసాధనాల తయారీ లో, వంటకాలలో, మందుల్లో, ఇతరత్రా ఎన్నో విధాలుగా వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఈ సంపద అధిక భాగం మన భారతదేశానిదే అని చెప్పవచ్చు. ఇతర దేశాల్లో అక్కడక్కడా కొద్దిపాటిగా ఈ వృక్ష సంతతి వృద్ది చెం దింది. భారతీయులు సాంప్రదాయరీతిలో దీనిని పూజిస్తారు. దీనితో ఊరగాయలు పెట్టి ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. ఇంకుల తయారీలో, షాంపూల తయారీల్లో సాస్‌లు, తలకి వేసుకునే రంగుల్లో కూడా దీనిని విరివిగా వాడు తున్నారు. దీనితో తయారుచేసిన ఆమ్లా మురబా తింటే వాంతులు, విరేచనాలు తగ్గి ఎంతో ఉపశమనం చేకూరుతుంది. ఉదర సంబంధవ్యాధులకి ఎక్కువగా వాడతారు. దీనితో తయారైన మాత్రలు వాడటం వలన వాత, పిత్త, కఫ రోగాలకి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. అత్యధిగంగా ఎగుమతి అవుతు న్న ఆమ్లా ఉత్పత్తులు ప్రపంచమార్కెట్లో అధిక లాభాల్ని అర్జింస్తున్నాయి. ఈ ఉసిరిని నిత్యం అన్ని రకాలుగా వినియోగించుకుంటే, మనిషికి సంపూర్ణ శక్తిని ప్రసాదిస్తుందన డంలో ఎంత మాత్రం అతిశయోక్తికాదు. ఉప్పులో ఎండ బెట్టిన ఉసిరిని నిల్వచేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్ప రిస్తూవుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది, ఎసిడిటీ, అల్సర్‌ వంటి వ్యాధులు సంక్రమించకుండా కాపాడు తుంది. అసలు ప్రతి ఇంటిలో ఒక ఉసిరిని పెంచమని శాస్త్రజ్ఞులు అంటున్నారు. భార తీయ వాస్తుశాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇంటి పెరటిలో గనుక ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటి వాస్తుదోషాలు ఏవి ఉన్నా హరిస్తుందని జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం వక్కాణిస్తున్నాయి. . ఉసిరి కాయను ఆంగ్లంలో The Indian gooseberry (Phyllanthus emblica, syn. Emblica officinalis), అనీ, హిందీలో "ఆమ్ల' అనీ, సంస్కృతంలో "ఆమలక" అనీ అంటారు. ఉప్పు రుచి తప్పించి మిగిలిన ఇదు రుచులను కలిగి ఉంది . అత్యధికంగా "సి " విటమిన్ ఉంటుంది . రోగనిరోధక శక్తి పెంచుతుంది . రాసాయనికముగా నారింజలో కన్నా ఉసిరిలో ౨౦ రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది . యాన్తి ఆక్షిదేంట్లు, ఫ్లవనాయిడ్లు, కెరోటినాయిడ్స్, టానిక్ ఆమ్లం, గ్లూకోజ్,కాల్సియం, ప్రోటీన్లు దీనిలో లభ్యమవుతాయి.

వర్ణన

[మార్చు]
  • ఉసిరిచెట్టు 8 నుండి 18 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
  • ఆకులు 7-10 సె.మీ. ఉంటాయి.
  • పువ్వులు ఆకుపచ్చ-పసుపు రంగులో ఉంటాయి.
  • ఉసిరికాయలు గుండ్రంగా లేత ఆకుపచ్చ-పసుపు రంగులో గట్టిగా ఉండి 6 నిలువుచారలు కలిగి ఉంటాయి. ఇవి
  • ఉసిరికాయలు పుల్లగా పీచుతో ఉంటాయి.
  • ఉసిరిలో అనేక పోషక విలువలతోబాటు ఔషధ గుణములున్నందున దీనిని అమృత ఫలమంటారు.
ఉసిరికాయ పచ్చడి

ఉపయోగాలు

[మార్చు]
  • ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి మంచిది. ఆయుర్వేదంలో చ్యవన్ ప్రాస్ దీని నుండి తయారుచేస్తారు.
  • దక్షిణ భారతదేశంలో ఉసిరికాయను ఊరగాయ క్రింద లేదా ఉప్పు, కారంలో ఊరబెట్టి తినడానికి చాలా ఇష్టపడతారు.
  • హిందువులు ఉసిరిచెట్టును పవిత్రంగా భావిస్తారు. కార్తీకమాసంలో వనమహోత్సవాలలో ఉసిరిచెట్టు క్రింద భోజనం చేయడం శ్రేష్ఠం అన్ని నమ్ముతారు.
  • ఉసిరి కాయలను పచ్చడికి, జాం, జెల్లీ, సాస్ తయారీల్లోకూడ వుపయోగిస్తారు.
  • ప్రతిరోజు ఉసిరికాయ తినడం వలన మలబద్ధకం తగ్గుతుంది.
  • ఉసిరికాయ కంటి చూపును పెంచడములో సహాయపడుతుంది.
  • 2 చెంచాల ఉసిరికాయ పొడిని 2 చెంచాల తేనెలో కలుపుకొని రోజుకి మూడు లేక నాలుగు సార్లు తాగుతూ ఉంటే జలుబు తగ్గుతుంది.
  • ఉసిరికాయ రోజు తినడము వలన రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.
  • బరువు నియంత్రణకు: ఉసిరి తీనటం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు, అలాగే నిధానంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు.

ఔషధగుణములు

[మార్చు]

ఉసిరి కాయలలో విటమిన్ 'సీ' అధికముగా ఉంది. దీన్ని తిన్నందు వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగును. శరీరానికి చల్లదనాన్నిచ్చి మల మూత్ర విసర్జన సక్రమముగా జరుగును. చక్కెర వ్వాది గ్రస్తులు దీనిని వాడినందున ఇంసులిన్ ఉత్పత్తికి అనుకూలించి రక్తంలోని చెక్కెరను తగ్గించును. జ్ఞాపక శక్తినిచ్చే మందులలో దీనిని ఎక్కువగా వాడుతారు. అదే విదంగా కురుల ఆరోగ్యానికి కూడు ఉసిరి కాయలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉపిరి తిత్తులు,కాలేయం, జీర్ణమండలం, గుండె -దీని పరిదిలోనికి వస్తాయి .

  • జీర్ణమండలం :

దస్త్రం:Usiri kaayallu 5.JPG దాహం,మంట,వాంతులు,ఆకలిలేకపోవుట,చిక్కిపోవుట,ఎనీమియా,హైపర్ -ఎసిడిటి, మున్నగు జీర్ణ మండల వ్యాదులను తగ్గిస్తుంది .

  • ఉపిరితిత్తులు :

ఆస్తమా,బ్రాంకైటిస్,క్షయ,శ్వాసనాలముల వాపు, ఉపిరితిత్తులనుండి రక్తము పడుట మున్నగు వ్యాదులను నయం చేస్తుంది .

  • గుండె :

ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది . ఉసిరి వల్ల ఆహారములోని ఇనుము ఎక్కువగా గ్రహించబడుటకు తోడ్పడుతుంది . శరీరములో ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది .

  • కాలేయము :

కామెర్లు ఉసిరి లోని 'లినోయిక్ ఆసిడ్ 'వల్ల తగ్గుతాయి . కాలేయంలో చేరిన మలినాలు, విషపదార్ధాలును తొలగిస్తుంది, 'యాంటి ఆక్షిడెంట్' గా పనిచేస్తుంది .

  • కామెర్లు :

ఉసిరి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితె వైటమిన్ లోపంవల్ల కలిగే వ్యాధి, కామెర్లు రాకుండ సహాయపదుతుంది.

  • మలబద్ధకం:

మలబద్ధకం సమస్య ఉన్నవారు ప్రతి రోజు ఉసిరి కాయ తినడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది

  • నోటి పూత:

నోటి పూతతో బాధపడేవారికి ఉసిరి కాయ రసంతో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అర కప్పు నీటిలో ఉసిరి కాయ రసాన్ని కలిపి పుక్కిలిస్తే మంచి ఫలితము ఉంటుంది.

  • కంటిచూపు:

ఉసిరి కంటిచూపు మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండ కళ్ళు ఎర్రబడటం, దురదని కూడా తగ్గిస్తుంది. సగం కప్పు నీటిలో రెండు చెంచాల ఉసిరి రసాన్ని కలుపుకొని ప్రతి రోజు ఉదయం తాగుతూ ఉంటే కళ్ళకు చాలా మంచిది.[1]

  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

ఆయుర్వేదం ప్రకారం, ఉసిరి మంచి యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, ఆస్ట్రింజెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. శరీరం యొక్క తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడానికి ఆమ్లా సహాయపడుతుంది. తద్వారా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

  • చర్మం, జుట్టు ఆరోగ్యంలో అవసరం:

ఉసిరికాయ ఉత్తమ యాంటీ-ఏజింగ్ పండ్లలో ఒకటి. ఎందుకంటే ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మచ్చలేనిదిగా ఉంచడానికి సహాయపడుతుంది. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఉసిరి ఆకులను పేస్ట్‌గా చేసి తలపైన పూసుకున్నట్లయితే చుండ్రు, జుట్టు రాలిపోవడం, బూడిద నివారణలో సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టుకు సహజమైన కండిషనింగ్‌ను అందిస్తుంది.

సాగు విధానము

[మార్చు]

ఉసిరిచెట్టు ఎండకి, వర్షాభావానికి తట్టుకొని పెరగగల చెట్టు. అన్ని నేలలోను ఇది పెరగ గలదు. ఇదివరకు ఉసిరి కాయలను అడవుల్లో నుండి సేకరించే వారు. ఇప్పుడు వాటి వాడకము పెరిగినందున తోటలుగా కూడా పెంచుతున్నారు. ఉసిరికాయలు పండవు. బాగా అభివృద్ధి చెందిన కాయలను సేకరించి ఎండలో బాగా ఎండబెట్టి వాటివిత్తనాలను వేరు చేయాలి. ఒక్కో విత్తనాన్ని పగలగొట్టితే లోపల చిన్నవి ఆరు విత్తనాలుంటాయి. వాటిని 12 గంటలపాటు నీటిలో నానబెట్టి నీటిలో మునిగిన విత్తనాలను మాత్రమే తీసుకోవాలి. వాటిని నారుమళ్ళలో విత్తుకోకావాలి.

ఉసిరి తో చేయు వంటకములు

[మార్చు]
  1. ఉసిరి సాంబార్

ఉసిరికాయ పచ్చడి

[మార్చు]

ఉసిరికాయలు శుభ్రంగా కడిగి గుడ్డతో మంచి పొడిబట్టతో తుడుచుకోవాలి. వాటిని ముక్కలుగా చేసి గింజలు తీసివేయాలి. ఆ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. దానిని ఒక సీసాలోకి తీసుకొని ఆ ముక్కల మధ్యలో కొద్దిగా ఇంగువ పెట్టి మూత పెట్టాలి. మూడవరోజు, ఆ ఉసిరి ముద్దని తీసి దానికి సరిపడ ఉప్పు, కారం (ఎర్రది), పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో; మెంతులు, ఆవాలు, ఇంగువ తిరిగమూత వేసి దానిలోనే తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి చల్లారాక కలుపుకోవాలి. అలా కలిపిన పచ్చడిని గట్టిగా మూత ఉన్న గాజుసీసాలో జాగ్రత్త చేసుకోవాలి. పచ్చడి తినడానికి రెడీ.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-10. Retrieved 2020-06-10.


బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఉసిరి&oldid=4222431" నుండి వెలికితీశారు