శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం (నెల్లూరు)

నెల్లూరు నగరం మూలాపేటలో శివుని ప్రఖ్యాతి గాంచిన పురాతన ఆలయం శ్రీ భువనేశ్వరీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం.[1] [2] ఈ ఆలయం 6 వ శతాబ్దానికి చెందిన ఆలయమని చెబుతుంటారు. శివరాత్రి పర్వదినంనాడు ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ దేవాలయం మహిమాన్వితమైనదని ఇక్కడి శివలింగాన్ని పూజించి కోరికలు ఫలిస్తాయని ఇక్కడకు వచ్చే భక్తుల విశ్వాసం. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన మహాకవి తిక్కన సోమయాజి ఈ దేవాలయంలో శివుని పూజించిన తరువాతనే తన రచనను ప్రారంభించాడని చెబుతుంటారు. 2024 నాటికి 1400 సంవత్సరాల క్రితం నాటిదిగా భావించే ఈ ఆలయం నెల్లూరు నగరంలో పడమర వైపు ఉంది.[3]
పరమశివుడు ఒక ఉసిరి చెట్టు కింద తన ప్రణాళికను సిద్ధం చేసుకొని తానే స్వయంగా ఆలయాన్ని నిర్మించుకొన్నట్లు పురాణ కథనం. మనుమసిద్ధి మహారాజు ఈ ఆలయ రాజ గోపురాన్ని నిర్మించాడు. ఈ ఆలయ పురాతన చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలు లేవు లేదా దాచిపెట్టుండవచ్చు.
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ https://spsnellore.ap.gov.in/sri-moolastaneswara-swamy-temple-nellore/
- ↑ ABN (2022-03-01). "నెల్లూరు జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు". Andhrajyothy Telugu News. Retrieved 2025-03-04.
- ↑ "Mulasthaneswara Swami Temple nellore Religious Places". web.archive.org. 2012-11-30. Archived from the original on 2012-11-30. Retrieved 2025-03-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)