Coordinates: బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం 25°15′58″N 82°59′16″E / 25.266034°N 82.987847°E / 25.266034; 82.987847

శ్రీ విశ్వనాథ దేవాలయం (బెనారస్ విశ్వవిద్యాలయం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


శ్రీ విశ్వనాథ మందిరం
శ్రీ విశ్వనాథ దేవాలయం (బెనారస్ విశ్వవిద్యాలయం) is located in Varanasi district
శ్రీ విశ్వనాథ దేవాలయం (బెనారస్ విశ్వవిద్యాలయం)
వారణాసిలో ఆలయ స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలుబెనారస్ హిందూ విశ్వవిద్యాలయం 25°15′58″N 82°59′16″E / 25.266034°N 82.987847°E / 25.266034; 82.987847
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లావారణాసి
ప్రదేశంబెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి
ఎత్తు77 m (253 ft)
సంస్కృతి
దైవంశివుడు
ముఖ్యమైన పర్వాలుమహాశివరాత్రి
నాగ పంచమి
శ్రవణ్
నవరాత్రి
మకర సంక్రాంతి
వాస్తుశైలి
దేవాలయాల సంఖ్యఏడు
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ1966
సృష్టికర్తబిర్లా కుటుంబం
వెబ్‌సైట్https://www.bhu.ac.in/VT/

హిందువుల పవిత్ర నగరమైన వారణాసిలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలు, ప్రముఖ పర్యాటక ఆకర్షణలలో ఒకటి శ్రీ విశ్వనాథ మందిరం. దీనిని బిర్లా మందిరం అని కూడా పిలుస్తారు. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం, బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. శ్రీ విశ్వనాథ మందిర శిఖరం ఎత్తు 250 అడుగులతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆలయ గోపురం కలిగి ఉంది. ఈ ఆలయాన్ని వ్యావహారికంలో VT అని పిలుస్తారు, ఇది విశ్వనాథ్ ఆలయం సంక్షిప్త రూపం.[1][2][3][4][5][6][7]

చరిత్ర[మార్చు]

ఈ దేవాలయం కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణ శైలి ఆధారంగా నిర్మించబడింది. శ్రీ కాశీ విశ్వనాథ్ మందిరం, అనేక సార్లు ధ్వంసం చేయబడింది (మళ్ళీ పునర్నిర్మించబడింది); 1194లో కుతుబ్-ఉద్-దిన్ ఐబక్, 1447-1458 మధ్య కాలంలో, తర్వాత హుస్సేన్ షా షర్కీ, తర్వాత 1669 CEలో ఔరంగజేబు ఇలా చాలామంది హిందూ వ్యతిరేక రాజులు ధ్వంసం చేశారు. 1930లలో, పండిట్ మదన్ మోహన్ మాలవ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో శ్రీ కాశీ విశ్వనాథ్ మందిర ప్రతిరూపం నిర్మించాలని అనుకున్నాడు. బిర్లా కుటుంబం నిర్మాణాన్ని చేపట్టి, 1931 మార్చిలో పునాది వేశారు. ఆలయం (శ్రీ విశ్వనాథ్ మందిరం) చివరకు 1966లో పూర్తయింది.[1][2][3][4][5][6][8]

నిర్మాణం[మార్చు]

శ్రీ విశ్వనాథ్ మందిరం నిర్మాణం పూర్తి కావడానికి ముప్పై ఐదు సంవత్సరాలు పట్టింది (1931-1966). భారతదేశంలోనే ఎత్తైన దేవాలయాలలో ఒకటి. ఆలయం మొత్తం ఎత్తు సుమారు 77 మీటర్లు. ఆలయ రూపకల్పన శ్రీ కాశీ విశ్వనాథ్ మందిరం నుండి ప్రేరణ పొందింది, ఇది చాలా వరకు పాలరాతితో తయారు చేయబడింది.

శ్రీ విశ్వనాథ్ మందిరం ప్రాథమికంగా శివునికి అంకితం చేయబడినప్పటికీ, ఈ ఆలయంలో తొమ్మిది మందిరాలు ఉన్నాయి అన్ని కులాలు, మతాలు, మత విశ్వాసాల ప్రజలకు తెరిచి ఉంటుంది. క్రింది అంతస్తులో శివాలయం, మొదటి అంతస్తులో లక్ష్మీ నారాయణుడు, దుర్గా మందిరాలు గుడి ఉన్నాయి. నటరాజ, పార్వతి, గణేశ, పంచముఖి మహాదేవ్, హనుమాన్, సరస్వతి, నంది అనేవి శ్రీ విశ్వనాథ్ మందిరంలోని ఇతర పుణ్యక్షేత్రాలు. భగవద్గీత పూర్తి పాఠం, పవిత్ర హిందూ గ్రంథాల నుండి సంగ్రహాలు ఆలయ లోపలి పాలరాతి గోడలపై దృష్టాంతాలతో చెక్కబడి ఉన్నాయి.

స్థానం[మార్చు]

శ్రీ విశ్వనాథ్ మందిర్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (ప్రధాన ద్వారం నుండి నైరుతి) క్యాంపస్ లోపల 1.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దుర్గా మందిరానికి నైరుతి దిశలో 3.3 కిలోమీటర్లు, శ్రీ కాశీ విశ్వనాథ ఆలయానికి నైరుతి దిశలో 7 కిలోమీటర్లు, వారణాసి రైల్వే స్టేషన్‌కు దక్షిణంగా 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Brief description". en:Benaras Hindu University website. Archived from the original on 17 May 2018. Retrieved 7 March 2015.
  2. 2.0 2.1 "The temples". en:Benaras Hindu University website. Archived from the original on 23 September 2015. Retrieved 7 March 2015.
  3. 3.0 3.1 "Vishwanath Temple". Wikinapia. Archived from the original on 2 April 2015. Retrieved 7 March 2015.
  4. 4.0 4.1 "New Vishwanath Temple". en:Varanasi city website. Archived from the original on 14 March 2015. Retrieved 7 March 2015.
  5. 5.0 5.1 "Birla Temple". varanasi.org.in. Archived from the original on 15 March 2015. Retrieved 7 March 2015.
  6. 6.0 6.1 "History". Eastern U.P. Tourism website. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 7 మార్చి 2015.
  7. "Vishwanath Temple (VT) opened in "New Normal"". BHU Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-09-23. Archived from the original on 24 January 2022. Retrieved 2022-01-24.
  8. Karkar, S.C. (2009). The Top Ten Temple Towns of India. Kolkota: Mark Age Publication. p. 12. ISBN 978-81-87952-12-1.