శ్రీ వీరభద్రస్వామి దేవాలయము (మాచెర్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ వీరభద్రస్వామి దేవాలయము
SRI VIRABHADRA SWAMY TEMPLE
14వ శాతాబ్ధంలో నిర్మించబడిన ఆలయం
14వ శాతాబ్ధంలో నిర్మించబడిన ఆలయం
శ్రీ వీరభద్రస్వామి దేవాలయము SRI VIRABHADRA SWAMY TEMPLE is located in Andhra Pradesh
శ్రీ వీరభద్రస్వామి దేవాలయము SRI VIRABHADRA SWAMY TEMPLE
శ్రీ వీరభద్రస్వామి దేవాలయము
SRI VIRABHADRA SWAMY TEMPLE
ఆంధ్రప్రదేశ్ లో స్థానం
భౌగోళికాంశాలు :16°28′46″N 79°25′56″E / 16.479506°N 79.432349°E / 16.479506; 79.432349Coordinates: 16°28′46″N 79°25′56″E / 16.479506°N 79.432349°E / 16.479506; 79.432349
పేరు
ప్రధాన పేరు :శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయము
ప్రదేశము
దేశము:భారత దేశము
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:గుంటూరు జిల్లా
ప్రదేశము:మాచెర్ల
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి

శ్రీ వీరభద్రస్వామి ఆలయ ఆవరణలోని ప్రధాన దేవతలు

శ్రీ వీరభద్రస్వామి
శ్రీ వీరభద్రస్వామి మూలవిరాట్
శ్రీ ఇష్ఠకామేశ్వరస్వామి
శ్రీ ఇష్ఠకామేశ్వరస్వామి మూలవిరాట్

శ్రీ వీరభద్రస్వామి దేవాలయం (శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయం,శ్రీ కామేశ్వరి సమేత ఇష్ఠకామేశ్వరస్వామి దేవాలయం) రాష్ట్రంలో గొప్ప విశిష్టత గల దేవాలయంగా పేరెన్నెకగలది. ఇది 8-14 శతాబ్ధాల నడుమ నిర్మించబడినది[1]. ఈ దేవాలయం గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం ప్రక్కన దక్షణం వైపున కలదు[2].

చరిత్ర[మార్చు]

శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయమును మాచర్ల కరణం (దేశ్ పాండ్యా)రామరాజు కట్టీంచారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం నిర్మించిన నాలుగు వందల సంవత్సరాలకు క్రీ.శ. 1450లో ఈ గుడి నిర్మాణం జరిగింది. ఈ దేవాలయ ఆవరణలో శ్రీ ఇష్ఠకామేశ్వర, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, మహాక్ష్మీ అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి.

ఆలయ విశేషాలు[మార్చు]

రాష్ట్రంలోని వీరభద్రస్వామి దేవాలయాలలో మాచర్ల వీరభద్రస్వామి దేవాలయం ఎంతో విశిష్టత కలది. ఈ పురాతన దేవాలయాన్ని సందర్శించేందకు రాష్ట్రం నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి సంధర్శకులు వస్తుంటారు. ఈ దేవాలలంలో వీరభద్రస్వామి మూలవిరాట్ నిలువెత్తు ఉంటుంది. గర్భగుడి ముందుగల రంగమండపం నాలుగు స్తంభాలుతో ఉంటుంది. ఈ మండలం పై కప్పు పై గొప్ప శిల్పకళ, చిత్రకళ ఉన్నాయి. ఆలయము పై కప్పు భాగం మొత్తం గొప్ప చత్రకళ దర్శనమిస్తుంది. వీరభద్రుదడి చరిత్ర, భాగవత, రామాయణం, భారతం, గణనాధుని చరిత్రలకు చిత్రలేఖనం ద్వారా అందంగా ఆలయ పై కప్పు భాగాన్ని తీర్చీదిద్దారు. ఈ రంగు రంగుల చిత్రములను ఆనాడు వివిధ రకాల ఆకుల పసరులతో వేశారని ప్రతీతి. రంగమండపం మధ్యలో కింద భాగాన ధర్మఫీఠం ఉంది. ఆలయ ప్రహరిగోడలకు అద్బతమైన శిల్పకళ చెక్కబడి ఉంది. అయితే ఆలయంలోని చిత్రకళ, గోడల పై శిల్పకళ చాలా వరకు శిథిలమైవుంది. ఈ ఆలయ ఆవరణలో శ్రీ కామేశ్వరీ సమేత ఇష్ఠకామేశ్వరస్వామి దేవాలయం, మహాలక్ష్మీ, శనేశ్వర, సుభ్రమన్నేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.

ధర్మపీఠము[మార్చు]

ఆలయ గర్భగుడి ముందు ఉన్న రంగమండపం మధ్యలో కింద భాగాన గుండ్రని ఆకారంలో ఎర్రరాయి పరచబడి ఉంటుంది. దీనినే ధర్మపీఠము అంటారు. పూర్వంలో నేరం చేసిన వారు ఎంత శిక్షించినా నిజం చెప్పకపోతే ఈ ధర్మపీఠం రాయి పై వీరభద్రునికి ఎదురుగా నిలబెడితే వారంతట వారే నిజం చెప్పేవారని ప్రతీతి.

శ్రీ కామేశ్వరీ సమేత ఇష్ఠకామేశ్వరుని ఆలయం[మార్చు]

ఈ దేవాలయమును చోళరాజుల కాలంలో చౌడప్ప అనే స్థానిక రాజు కట్టించారని, ఈ దేవాలయం ఈ ప్రాంగణంలోని అన్ని దేవాలయాల కంటే ముందుగా నిర్మించారని, దీనికి సంభదించిన ఆధారాలు లభించలేదని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం, మాచర్ల పుస్తకంలో రచయిత చిరతనగుండ్ల సోమేశ్వరరావు పేర్కొన్నారు.

ఎర్రరాతి శాసనం[మార్చు]

వీరభద్రస్వామి దేవాలయం ముందు ఉన్న ఈ ఎర్రరాతి శాసనం పెచ్చలు ఊడిపోటంతో కొంత అస్పష్ట సమాచారం ఉంది. అది ఏమనగా... స్వస్తశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకం.....సంవత్సరం మాచర్ల యిష్టకామేశ్వరిని, వీరభద్రేశ్వరునికి రేచర్ల గోత్రజుడు గాయిగోహన ఖడ్గ నారాయణ బిరుదాంకిత శ్వేతచ్చత్రాధీశ్వర వెలుగోటి తిమ్మనాయనింగారి పుత్రులు కొమారి తిమ్మాయాయనింగారి అర్ధాంగి లింగాంబ గారు దండం పెట్టి యిచ్చిన శాసనంము. శ్రీ మార్తాండ రాజపరమేశ్వర వీరప్రతాప సదాశిరాయదేవ మహారాజుంగారు ప`థ్వీరాజ్యం చేయుచుండగా కుమార తిమ్మానాయనిం గారి నాయంకరానకు పాలించి యిచ్చిన నాగార్జున కొండ సీమలోని మాచర్లకు ఉత్తరభాగానా లింగాపురము అనడి అగ్రహారము కట్టించి ఈ చంద్రగ్రహణ సమయాన ధారాపూర్వవముగా సమర్పిస్తిమి. ఈ లింగాపుర నలుదరి పొలాలు 900 ఎకరాలు హేమకూపతటాక, నిధి నిక్షేప జలపాషాణ ాగామి సిద్ధసాధ్యాలు అనెడి అష్టభోగాలు సమర్పిస్తిమి. ఆ చంద్ర తారార్కము ఆగ్రామం దేవరకు ఎవ్వరు ఇవ్వకపోయినా బ్రాహ్మణహత్మ, వారణాసిలో తల్లిదండ్రును చంపిన పాపం కలుగుతుంది. ఈ శాసనం వెనుక భాగంలో వీరభద్రస్వామి కట్టించిన కాంట్రాక్టరు కర్ణాటకు చెందిన కాన్వాజుపోతినేని మూరకొలత కినిపిస్తుంది. ఈ మూర కొలత 25న్నర అంగుళాలు లేక 65 సె.మీలు ఉంది.

చిత్రమాళిక[మార్చు]

మూలాలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  • శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం, మాచర్ల పుస్తకం.రచయిత చిరతనగుండ్ల సోమేశ్వరరావు
  • http://dsal.uchicago.edu/images/aiis/aiis_search.html?location=&iden=&affiliation=&subject=&date=&skipMissing=1&limit=20&quick=Macherla&showQuery=&22454=1&22452=1&22455=1&22456=1&22457=1&22453=1&22459=1&22422=1&22458=1&22447=1&22448=1&22449=1&22450=1&22451=1&depth=Get+Details
  • https://tools.wmflabs.org/geohack/geohack.php?pagename=%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80_%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF_%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81_%28%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9A%E0%B1%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%29&params=16.479506_N_79.432349_E_type:landmark_region:IN