శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్డ్స్ రీసెర్చ్
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్డ్స్ రీసెర్చ్ (ఆంగ్లం: Sri Venkateswara Institute of Cancer Care & Advanced Research) తిరుపతిలో టీటీడీ సహకారంతో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న టాటా క్యాన్సర్ ఆస్పత్రి. దీని నిర్మాణానికి 2018 ఆగస్టు 31న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది.[1] టీటీడీ అవసరమైన 25 ఎకరాల విస్తీర్ణంలో స్థలాన్ని కేటాయించగా రూ.600 కోట్ల వ్యయంతో క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించడానికి టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా శ్రీకారం చుట్టారు. కాగా 2022 మే మాసం మొదటివారంలో బాధితులకు అందుబాటులోకి రానుంది.[2]
క్యాన్సర్ వ్యాధి నివారణ దిశగా శ్రీ వెంకటేశ్వర క్యాన్సర్ వైద్య, విజ్ఞాన సంస్థ (ఎస్వీఐసీఏఆర్)ను రెండు దశల్లో పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించారు. తొలి దశలో ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేశారు.
ప్రారంభం
[మార్చు]తిరుపతిలో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రిసెర్చ్ (SVICCAR) ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2022 మే 5న ప్రారంభించారు.[3] ఒక లక్షా 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 180 కోట్ల రూపాయల వ్యయంతో విశాలమైన భవనాలు, అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంపూర్ణ సహకారం అందించాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రిలో మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజీ లాంటి సేవలు క్యాన్సర్ రోగులకు అందుబాటులోకి వచ్చాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Tata Trusts, Tirumala Tirupati Devasthanams (TTD) hold groundbreaking ceremony for Sri Venkateswara Institute of Cancer Care & Advanced Research in Tirupati - Press releases - Tata Trusts". web.archive.org. 2022-04-26. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "క్యాన్సర్ బాధితులకు Good News - Andhrajyothy". web.archive.org. 2022-04-26. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Jagan inaugurates ₹180 cr. cancer hospital in Tirupati - The Hindu". web.archive.org. 2022-05-16. Archived from the original on 2022-05-16. Retrieved 2022-05-16.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)