వెంకటేశ్వర వైభవం
'శ్రీవేంకటేశ్వర వైభవం' తిరుమల తిరుపతి దేవస్థానం సమర్పించు డాక్యుమెంటరీ తెలుగు భక్తి చిత్రం,1971 ఆగస్టు 1.న విడుదల.అన్నపూర్ణ ఆర్ట్ పతాకంపై దర్శకుడు పాలడుగు దుర్గా ప్రసాద్ పర్యవేక్షణలో తెరకెక్కినది ఈ చిత్రం.సంగీతం సాలూరు రాజేశ్వరరావు అందించగా, వ్యాఖ్యాత గా కొంగర జగ్గయ్య తన కంచు కంఠముతోస్వామి వారి వైభవాన్ని కళ్లకు కట్టినట్లు వినిపించినారు
వెంకటేశ్వర వైభవం (1971 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పాలడుగు దుర్గా ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణా ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు:పాలడుగు దుర్గాప్రసాద్
సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
సమర్పణ: తిరుమల తిరుపతి దేవస్థానం
నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, సింగిరెడ్డి నారాయణరెడ్డి, ఇ.కామేశ్వరరావు , శ్రీ దత్తాత్రేయ శర్మ
నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు,శ్రీరంగం గోపాలరత్నం,మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పి.లీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, బొడ్డుపల్లి బాల వసంత, ప్రతివాది భయంకర శ్రీనివాస్,
వ్యాఖ్యాత: కొంగర జగ్గయ్య
విడుదల:1971: ఆగస్టు:01.
పాటలు
[మార్చు]- ఏడుకొండల శ్రీనివాసా మూడుమూర్తుల తిరుమలేశా - ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ
- ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట - శ్రీరంగం గోపాలరత్నం - రచన: ఇ. కామేశ్వరరావు
- కస్తురీకాతిలక శోభిలలాటవేశ రాకేందుబింబ వదన (స్తుతి) - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- కోటి దీప ప్రభలలో స్వామి కోనేటి నీటి అలలో - ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ
- కృతయుగంబున రమాహృదయాంతరంగుడవు - పి.బి. శ్రీనివాస్
- తెరతీయరా తిరుపతి దేవరా తెర తీయరా - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- లక్ష్మీపతే నిగమ లక్ష్య నిజస్వరూప కామాదిదోషపరిహారిత (శ్లోకం) - ఘంటసాల
- వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశపుణ్యరాశులే ఏరులైనది కొండ - ఘంటసాల_రచన: శ్రీపతి దత్తాత్రేయ శర్మ
- వేద పఠనం - వేద పండితులు
- వినుడీ కలియుగ దైవం వెంకటరమణుని వైభవము - పి.లీల, బి.వసంత
- శ్రీ శేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయాణాచ్యుత హరేనళినాయతాక్ష - ఘంటసాల
- శ్రీ వేంకటాచలవాసా నినుసేవింతుమో శ్రీనివాసా - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- సప్తశైలవాసా కరుణాసాగరా శ్రీ శ్రీనివాసా - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- తిరుపతి వేంకటేశ్వరుని దివ్య చరితము విన్న_ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం