షకీలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అదే పేరు కలిగి ఉన్న ఇతర వ్యాసాల కొరకు, షకీలా (అయోమయ నివృత్తి) చూడండి.

షకీలా
(shakeela)
జననం
సి.షకీలా బేగమ్[1]

(1973-05-19) 1973 మే 19 (వయసు 50)
వృత్తినటి.
క్రియాశీల సంవత్సరాలు1990-ఇప్పటివరకు
తల్లిదండ్రులుచాంద్ భాష, చాంద్ బేగం

షకీలా ప్రముఖ దక్షిణ భారత చలన చిత్ర నటి. ఎక్కువగా మళయాళ శృంగార చిత్రాలలో నటించింది.

షకీలా సూళ్లూరుపేట దగ్గర కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)లో పెరిగింది. తమిళంలో "ప్లేగర్ల్స్" అనే 'సాఫ్ట్‌కోర్' చిత్రంతో ఈమె సినీ ప్రస్థానం మొదలెట్టింది ఈ సినిమాలో సిల్క్ స్మిత ప్రధాన కథానాయిక కావడం విశేషం. తర్వాత "కిన్నెర తుంబికళ్" అనే మళయాళం చిత్రంతో మొదటిసారిగా పాప్యులర్ అయింది. సుమారు 110 సినిమాల్లో నటించిన షకీలా, ఎక్కువగా తమిళం, మళయాళం, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది. షకీలా నటించిన ఈ సినిమాలన్నీ దాదాపు "బి" గ్రేడ్ 'సాఫ్ట్‌కోర్' సినిమాలుగానే చెప్పుకోవచ్చు. ఈమె తారస్థాయిలో సినిమాలు తీసిన కాలంలో "షకీలా సినిమా" అన్న పదాన్ని "సాఫ్ట్ పోర్న్" సినిమాకు పర్యాయపదంగా వాడేవారు. ఇలాంటి షకీలా సినిమాల పాప్యులారిటీ విదేశీ భాషల్లోకి కూడా విస్తరించి, ఈ అర్ధనగ్న చిత్రాలు నేపాలీ, చైనీస్, సింహళ భాషల్లోకి కూడా డబ్బింగు చేయబడ్డాయి. తొలిరోజుల్లో సంచలనాత్మకంగా పైభాగంలో ఆఛ్ఛాదన లేకుండా కొన్ని కొన్ని సినిమాలలో నటించిది. కానీ ఆ తరువాత వచ్చిన సినిమాలలో అశ్లీల దృశ్యాల చిత్రీకరణకు మారు వేషధారిని (బాడీ డబుల్) ఉపయోగించింది. 2003 నుండి శృంగార పాత్రలు మానేసి సినిమాలలో క్యారక్టెరు ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ వచ్చింది.

తన పేరు శృంగార రసానికి ప్రతీకగా ఎందుకు మారిందో తెలియజెప్పటానికి, షకీలాలు ఎలా పుడతారో, ఎలా రూపుదిద్దుకుంటారో అందరికీ తెలియాలని ఆత్మకథ వ్రాసినట్టు చెప్పుకున్నది. ఈమె చాల దుర్భమైన బాల్యాన్ని గడిపింది. పదహారేళ్ళ వయసులో ఈమె తల్లే స్వయంగా వ్యభిచరించడానికి పంపింది. తన నటించిన సినిమాలు కేవలం తన శరీరాన్ని శృంగారభరితంగా చూపటానికి మాత్రమే పరిమితమయ్యాయని, తనలోని నటిని వెలికితీయటానికి ఎవ్వరూ ప్రయత్నించలేదని షకీలా ఆత్మకథలో చెప్పుకున్నది.

ఒకప్పుడు దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటీమణి అయిన షకీలా, అమె డబ్బు వ్యవహారాలంతా చూసుకొంటున్నపెద్దక్క నూర్జహాన్ ఖాజేసి దివాళా తీసే స్థితికి తెచ్చింది. సినిమాలతో విసిగిపోయానని. పెళ్ళి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకుంటున్నానని వెలిబుచ్చినా కుటుంబ సభ్యులు అందుకు సముఖం చూపకపోవడంతో కేవలం వాళ్ళు డబ్బు కోసమే ఉంటున్నారని ఆమెకు అర్ధమైంది.

నటించిన చిత్రాలు[మార్చు]

తెలుగు[మార్చు]

కన్నడ[మార్చు]

మలయాళం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-29. Retrieved 2014-02-13.
  2. http://www.indulekha.com/shakeela-athmakatha-autobiography-shakeela
  3. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి - సినిమా కబుర్లు (9 August 2019). "మోహన్‌బాబుగారి ప్రశంస మర్చిపోలేను". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2019. Retrieved 9 August 2019.

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=షకీలా&oldid=3901294" నుండి వెలికితీశారు