Jump to content

షకీలా (హిందీ నటి)

వికీపీడియా నుండి

అదే పేరు కలిగి ఉన్న ఇతర వ్యాసాల కొరకు, షకీలా (అయోమయ నివృత్తి) చూడండి.

షకీలా
ఆర్ పార్ (1954) చిత్రంలో జానీవాకర్ తో షకీలా
జననం(1935-01-01)1935 జనవరి 1
మరణం2017 సెప్టెంబరు 20(2017-09-20) (వయసు 82)
జాతీయతఇండియన్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1949–1963
గుర్తించదగిన సేవలు
ఆర్ పార్ (1954)
C.I.D. (1956)
చైనా టౌన్ (1962)
జీవిత భాగస్వామివై. ఎం. ఇలియాస్
(m. 1963)
బంధువులుజానీవాకర్ (బావమరిది)

షకీలా (1935 జనవరి 1 - 2017 సెప్టెంబరు 20) ప్రముఖ భారతీయ హిందీ నటి. గురుదత్ దర్శకత్వం, నిర్మాణ సారధ్యంలో వచ్చిన ఆర్ పార్ (1954), C.I.D. (1956) చిత్రాలలో తన పాత్రలకు ఆమె బాగా పేరుపొందింది.

కెరీర్

[మార్చు]

ఆమె అత్తకు సినిమాలంటే ఇష్టం కారణంగా తరచూ సినిమాలకు తీసుకెళ్లేది. అంతేకాకుండా వారి కుటుంబం ఎ.ఆర్ కర్దార్, మెహబూబ్ ఖాన్‌లతో స్నేహపూర్వకంగా ఉండేది.

కర్దార్ ఆమెకు దస్తాన్ (1949)లో నటించే అవకాశం కల్పించాడు. సురయ్య నటించిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆమె అరంగేట్రం చేసింది. అదే సంవత్సరం మళ్ళీ సురయ్యతో కలిసి ఆమె దునియా (1949) అనే మరో చిత్రంలో నటించింది. గుమాస్తా (1951), సింద్‌బాద్ ది సెయిలర్ (1952), రాజ్‌రాణి దమయంతి (1952), ఆగోష్ (1953), షాహెన్‌షా (1953), రాజ్ మహల్ (1953), అర్మాన్ (1953) వంటి పలు చిత్రాలలో నటించిన ఆమెకు గురుదత్ ఆర్ పార్ (1954)తో ఆమె ప్రసిద్ధిచెందింది. ఆమె సోదరి నూర్ కూడా ఇందులో నటించింది.

ఆమె పద్నాలుగు సంవత్సరాల కెరీర్‌లో అగ్ర నటులు, ప్రముఖ దర్శకులతో 50కి పైగా చిత్రాలలో నటించింది. వైఎం ఇలియాస్‌ను వివాహంచేసుకుని తన భర్తతో కలిసి లండన్‌కు వెళ్లిపోయింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

షకీలా 1935 జనవరి 1న మధ్యప్రాచ్యంలో బాద్షా బేగంగా జన్మించింది. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు నూర్ జెహాన్ (నూర్ గా సుపరిచితురాలు), నస్రీన్. వారి పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ రాజ కుటుంబాలకు చెందినవారు. సింహాసనంపై కుటుంబ కలహాల సమయంలో వారి తాతలు, తల్లి చంపబడ్డారు. దీంతో వారి తండ్రి, అతని సోదరి ఫిరోజా బేగం పిల్లలను భారతదేశంలోని ముంబైకి తీసుకువచ్చారు.

కానీ వారి తండ్రి వెంటనే మరణించాడు. వారి మేనత్తకు యువరాజుతో వివాహం నిశ్చయమైయ్యాక, ఒక ప్రమాదంలో అతన్ని కోల్పోయింది. ఇక ఆమె అవివాహితగానే తన ముగ్గురు మేనకోడళ్లను పెంచాలని నిర్ణయించుకుంది. అయినా షకీలా, ఆమె సోదరీమణులు కఠినమైన సమయాలను ఎదుర్కొవాల్సివచ్చింది.

షకీలా సోదరి నూర్ (నూర్ జెహాన్) జానీవాకర్‌ను వివాహం చేసుకుంది.[1]

వైఎం ఇలియాస్‌తో ఆమె విడిపోయి తిరిగి ముంబైకి వచ్చి భారతదేశంలో కాన్సులేట్ జనరల్‌గా ఉన్న ఆఫ్ఘన్ వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి మీనాజ్ అనే కుమార్తె ఉంది. అయితే 1991లో తన కూతురు ఆత్మహత్యచేసుకుంది.

మరణం

[మార్చు]

ఆమె 82 సంవత్సరాల వయస్సులో 2017 సెప్టెంబరు 20న ముంబైలో గుండెపోటుతో మరణించింది. ముంబైలోని మహిమ్ శ్మశానవాటికలో షకీలా అంత్యక్రియలు జరిగాయి.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
1949 దునియా 1956 ఝాన్సీ కి రాణి - కాశీ 1961 రేష్మీ రుమాల్ - రేఖా రాయ్
1950 దస్తాన్ 1956 మాలిక 1962 బాగ్దాద్ కి రాతేన్
1953 అర్మాన్ 1956 పైసా హాయ్ పైసా 1962 చైనా టౌన్ - రీటా డి. రాయ్
1953 మడ్మస్ట్ 1956 రూప్ కుమారి 1962 నక్లి నవాబ్ - షబ్నం
1953 షాహెన్‌షా 1957 బెగునా 1962 టవర్ హౌస్ - సబిత
1953 ఆఘోష్ 1957 నాగ్ పద్మిని 1962 నీలి ఆంఖేన్
1954 ఆర్ పార్ - డాన్సర్ 1957 పారిస్తాన్ 1963 కహిన్ ప్యార్ న హో జాయే - బిమ్లా
1954 డాన్ 1957 ఆగ్రా రోడ్ 1963 ముల్జిమ్ - ఆశా
1954 గుల్ బహార్ 1958 అల్ హిలాల్ 1963 ఉస్తాదోన్ కే ఉస్తాద్ - నీతా
1954 హల్లా గుల్లా 1958 చౌబీస్ ఘంటే
1954 ఖుష్బూ 1958 పోస్ట్ బాక్స్ 999 - నీలిమ
1954 లైలా 1959 నలభై రోజులు
1954 లాల్ పరి 1959 గెస్ట్ హౌస్ - నీలా
1954 అలీ బాబా 40 చోర్ - మార్జినా 1959 కలి తోపి లాల్ రుమాల్ - చంపా
1954 నూర్ మహల్ 1959 స్కూల్ మాస్టర్
1955 మస్త్ ఖలందర్ 1960 అబ్దుల్లా
1955 రత్న మంజరి 1960 బారాత్
1956 సి.ఐ.డి. - రేఖ 1960 డా. షైతాన్
1956 కారవాన్ 1960 గ్యాంబ్లర్
1956 హతీమ్ తాయ్ 1960 శ్రీమాన్ సత్యవాది - గీత

మూలాలు

[మార్చు]
  1. "Johnny Walker... signing off on a high". The Hindu. 1 August 2003. Archived from the original on 31 December 2013. Retrieved 14 July 2012.