Jump to content

జానీవాకర్ (హిందీ నటుడు)

వికీపీడియా నుండి
జానీవాకర్
జననం
బద్రుద్దీన్ జమాలుద్దీన్ ఖాజీ

(1920-11-11)1920 నవంబరు 11
ఇండోర్, సెంట్రల్ ప్రావిన్సెస్, బ్రిటీష్ ఇండియా
మరణం2003 జూలై 29(2003-07-29) (వయసు 82)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1951–1997
జీవిత భాగస్వామినూర్జహాన్
పిల్లలు6 (నాసిర్ ఖాన్‌తో సహా)
బంధువులుటోనీ వాకర్ (కమాలుద్దీన్ కాజీ) (సోదరుడు)

విజయ్ కుమార్ (సోదరుడు)

షకీలా (వదిన)

జానీవాకర్ (11 నవంబరు 1920 – 2003 జూలై 29)గా ప్రసిద్ధుడైన బద్రుద్దీన్ జమాలుద్దీన్ ఖాజీ 300కు పైగా చలనచిత్రాలలో నటించిన భారతీయ హాస్యనటుడు. ఇతడు ఇండోర్‌లో జన్మించాడు.

ఆరంభ జీవితం

[మార్చు]

ఇతడూ 1920, నవంబర్ 11వ తేదీన ఇండోర్ నగరంలో ఒక మిల్లు కార్మికునికి జన్మించాడు. ముస్లిం కుటుంబంలో జన్మించిన ఇతనికి అతని తల్లి దండ్రులు బద్రుద్దీన్ జమాలుద్దీన్ ఖాజీ అని పేరు పెట్టారు. ఇతని తండ్రి పనిచేస్తున్న మిల్లు మూతపడటంతో ఇతని కుటుంబం మహారాష్ట్రకు వలస వెళ్లింది. ఇతని తల్లిదండ్రుల 10 మంది సంతానంలో ఇతడు రెండవవాడు. ఇతడు తన కుటుంబ పోషణ కోసం అనేక పనులు చేశాడు. మొదటిలో ఇతడు పూనా నుండి కూరగాయలు, పళ్లు తెచ్చి అమ్మేవాడు. కొంత కాలం బస్ కండక్టర్‌గా పనిచేశాడు.[1] ఇతడు తన కుటుంబాన్ని పోషించడానికి ఐస్ క్యాండీ, పళ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్మేవాడు. ఇతడు బాల్యం అంతా సినిమాల గురించి కలలు కనేవాడు. తన అభిమాన నటుడైన నూర్ మొహమ్మద్ ఛార్లీని అనుకరించేవాడు.[2]

వృత్తి

[మార్చు]

ఇతడు కొంతకాలం బస్ కండక్టర్‌గా పనిచేశాక ఒకతను ఒక రోజు ఒక స్టూడియోకు తీసుకువెళ్లి స్పాట్ బాయ్‌గా ఉద్యోగం ఇప్పించాడు. అక్కడ అతన్ని చూసి జాలిపడి బలరాజ్ సాహ్ని ఇతడిని చేతన్ ఆనంద్ (దేవానంద్ అన్న)కు పరిచయం చేశాడు. చేతన్ ఆనంద్ తను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న "ఆఖరీ పైగామ్" (1949) అనే చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్‌గా వేషం ఇప్పించాడు. జానీవాకర్ తొలిరోజులలో బలరాజ్ సాహ్నితో ఒక సినిమాలో నటించాడు. అందులో జానీవాకర్ ఖైదీపాత్ర వేశాడు. జైలర్ పాత్ర బలరాజ్ సాహ్నిది. తమాషా ఏమిటంటే ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ కార్యకర్త అయిన బలరాజ్ సాహ్నీ ఓ జైలులో ఖైదీగా ఉండేవాడు. షూటింగ్ ఉన్నప్పుడు ఇద్దరు పోలీసులు అతడిని వెంటబెట్టుకుని షూటింగుకు వచ్చి షూటింగ్ కాగానే తీసుకుపోయేవారు. బలరాజ్ జైలులో ఉన్న జైలరుకు ఆయనకు స్నేహం కుదిరిందో లేదో కాని తెరమీద జైలర్ (బలరాజ్)కూ, ఖైదీ (జానీవాకర్)కూ స్నేహం కుదిరింది[1]. గురుదత్ బాజీ (1951) అనే సినిమా తీస్తున్న రోజులు అవి. ఆ సినిమాకు కథను సమకూర్చిన బలరాజ్ సాహ్ని ఒక పాత్రకు జానీవాకర్‌ను గురుదత్‌కు సూచించాడు. తనను కలిసిన జానీవాకర్‌ను నటించి చూపమన్నాడు గురుదత్. తాగుబోతుగా నటించి అతణ్ణి మంత్రముగ్ధున్ని గావించాడు. అంతా బాగుంది కానీ నీ పేరు మారుద్దాం అని అన్నాడు గురుదత్. అప్పటి వరకు బద్రుద్దీన్ ఖాజీ అనే పేరుతోనే చెలామణీ అయ్యాడు. ఏమి పేరు పెడదామని ఆలోచించి అప్పుడు తను తాగుతున్న స్కాచ్ విస్కీ బ్రాండ్ పేరు జానీవాకర్ ను ఖాయం చేశాడు గురుదత్.[1][2][3][4]

బాజీలో చిన్న పాత్రతో ప్రారంభమైన గురుదత్- జానీవాకర్‌ల స్నేహం గురుదత్ మరణించేవరకూ కొనసాగింది. గురుదత్ సినిమాల్లో జానీవాకర్‌కు ముఖ్యపాత్ర తప్పనిసరిగా ఉండేది. కాగజ్ కే ఫూల్, ప్యాసా, ఛౌద్‌వీకా చాంద్ వంటి సినిమాలలో మంచి పాత్రలను ఇచ్చాడు గురుదత్. గురుదత్ తరువాత జానీవాకర్‌కు మరువలేని పాత్ర ఇచ్చింది హృషికేష్ ముఖర్జీ తన ఆనంద్ సినిమాలో[1].ఇతడు ముఖ్యంగా హాస్యపాత్రలను నటించాడు. కానీ అతనికి హాస్యపాత్రల పట్ల చివరిదశలో భ్రమలు తొలగి ముఖ్యపాత్రలను వేయడానికి ప్రయత్నించాడు. తన పేరుమీద వచ్చిన జానీవాకర్, మిస్టర్ కార్టూన్ సినిమాలు ఫెయిల్ అయినా మేరే మెహబూబ్, సి.ఐ.డి., ప్యాసా, చోరీచోరీ వంటి సినిమాలు ఇతడిని స్టార్‌ను చేశాయి. ఇతడు 1950-60 దశకాలలో ఒక వెలుగు వెలిగాడు. 1964లో గురుదత్ మరణం ఇతని వృత్తిపై ప్రభావాన్ని చూపింది. ఇతడు బిమల్ రాయ్, విజయ్ ఆనంద్ వంటి దర్శకుల సినిమాలలో పనిచేశాడు. కానీ ఇతని అవకాశాలు 1980 నుండి తగ్గు ముఖం పట్టాయి.[3][4]

నయాదౌర్ (1957), టాక్సీ డ్రైవర్ (1954), మధుమతి (1958) సినిమాలు ఇతనికి ఎక్కువ తృప్తిని ఇచ్చాయి.[2] ఇతడు 14 యేళ్ల విరామం తర్వాత 1997లో చాచీ 420 (భామనే సత్యభామనే సినిమా హిందీ రీమేక్)లో నటించాడు[1][3][4]. ఆ విరామంలో ఇతడు రత్నాల వ్యాపారంలో విజయం సాధించాడు[2]

సినిమాలలో ఇతనిమీద కనీసం ఒక పాట అయినా చిత్రీకరించేవారు. ఠోకర్ (1953) అనే సినిమా తీసే రోజులలో సంగీత దర్శకుడు సర్దార్ మాలిక్ జానీవాకర్ మీద ఒక పాట పెడితే బాగుంటుందని తీర్మానించి మహమ్మద్ రఫీ చేత "మైతో నహీ పీతా" అనే పాటను పాడించాడు. అదే జానీవాకర్ మీద చిత్రీకరించిన మొదటి పాట. ఆ తర్వాత ఇతడు ఎన్నో పాటలకు జీవం పోశాడు. "జంగల్‌మే మోర్ నాచా కిసీనె న దేఖా", "మై బొంబాయికా బాబూ", "మాలిష్ తేల్ మాలిష్" వంటివి మచ్చుకు కొన్ని[1]. ఇతడు "పహుఁచే హువే లోగ్" అనే సినిమాను నిర్మించి దర్శకత్వం వహించాడు[2][3].

కుటుంబ జీవితం

[మార్చు]

ఇతడు నూర్‌జహాన్‌ను ఆమె కుటుంబం నుండి వ్యతిరేకత ఉన్నా వివాహం చేసుకున్నాడు.[4] వారికి ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు కలిగారు.[4] ఇతడు 6వ తరగతి వరకే చదువు కున్నా ఇతని కుమారులను అమెరికా పంపి చదివించాడు[2].

ఇతడు సినిమాలలో తాగుబోతు పాత్రలను ధరించినా నిజజీవితంలో మటుకు మద్యం ముట్టలేదు[2].

పురస్కారాలు

[మార్చు]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

జానీవాకర్ 300లకు పైగా సినిమాలలో నటించాడు.[3] వాటిలో కొన్ని:

  • 1951 బాజీ
  • 1952 జాల్
  • 1953 ఆంధియన్
  • 1953 ఆగ్ కా దరియా
  • 1953 ఠోకర్
  • 1953 బాజ్
  • 1954 ఆర్ పార్
  • 1954 మున్నా
  • 1954 టాక్సీ డ్రైవర్
  • 1954 లాల్ పరి
  • 1954 భారతి
  • 1955 దేవదాస్
  • 1955 షహజాదా
  • 1955 మెరైన్ డ్రైవ్
  • 1955 జవాబ్
  • 1955 సొసైటీ
  • 1955 సహీ మెహమాన్
  • 1955 రైల్వే ప్లాట్‌ఫాం
  • 1955 ముసాఫిర్‌ఖానా
  • 1955 మిస్ కోకాకోలా
  • 1955 మిలాప్
  • 1955 మస్త్ ఖలందర్
  • 1955 జోరు కా భాయి
  • 1955 జషన్
  • 1955 చార్ పైసే
  • 1955 బహూ
  • 1955 అల్బెలీ
  • 1955 మిస్టర్ & మిసెస్ 55
  • 1956 చోరీ చోరీ
  • 1956 సి.ఐ.డి.
  • 1956 శ్రీమతి 420
  • 1956 గులాం బేగం బాద్‌షా
  • 1956 జస్టీస్
  • 1956 నయా అందాజ్
  • 1956 రాజధాని
  • 1956 అంజాన్
  • 1956 సమ్‌వేర్ ఇన్ ఢిల్లీ
  • 1956 26 జనవరి
  • 1956 ఆవారా షెహజాదిi
  • 1956 భారతి
  • 1956 చంద్రకాంత
  • 1956 సముందరీ ఢాకూ
  • 1956 ఛూ మంతర్
  • 1957 జానీవాకర్
  • 1957 మిస్టర్ ఎక్స్
  • 1957 దో రోటి
  • 1957 దునియా రంగ్ రంగీలి
  • 1957 ఏక్ సాల్
  • 1957 గేట్‌వే ఆఫ్ ఇండియా
  • 1957 మాయి బాప్
  • 1957 ఖైదీ
  • 1957 ఛంఘీజ్ ఖాన్
  • 1957 నయా దౌర్
  • 1957 ప్యాసా
  • 1958 మధుమతి
  • 1958 అమర్ దీప్
  • 1958 కాలాపానీ
  • 1958 మిస్టర్ కార్టూన్ ఎం.ఎ.
  • 1958 లైట్ హౌస్
  • 1958 దో మస్తానె
  • 1958 జిందగీ యా తూఫాన్
  • 1958 సితారోఁ సె ఆగే
  • 1958 నయా పైసా
  • 1958 ముజ్రిమ్‌
  • 1958 ఖోతా పైసా
  • 1958 ఘర్ సంసార్
  • 1958 డిటెక్టివ్
  • 1958 చందన్
  • 1958 ఆజీ బస్ షుక్రియా
  • 1958 ఆఖరీ దావ్
  • 1958 12 ఓ'క్లాక్
  • 1959 పైగమ్‌
  • 1959 కాగజ్ కె ఫూల్
  • 1959 జర బచ్‌కే
  • 1959 సట్టా బజార్
  • 1959 పెహలీ రాత్
  • 1959 జవానీకి హవా
  • 1959 బ్లాక్ క్యాట్
  • 1959 భాయి - బహన్
  • 1960 ఛౌద్‌వీ కా చాంద్
  • 1960 రిక్షావాలా
  • 1960 మొఘల్ ఎ ఆజం
  • 1960 కాలా ఆద్మీ
  • 1960 ఏక్ ఫూల్ చార్ కాంటే
  • 1960 బసంత్
  • 1961 విలాయత్ పాస్
  • 1961 మాడ్రన్ గర్ల్
  • 1961 ఫుల్ మూన్
  • 1961 వాంటెడ్
  • 1961 సుహాగ్ సిందూర్
  • 1961 ఛోటే నవాజ్
  • 1962 ఆషిక్
  • 1962 సచ్చే మోతి
  • 1962 నీలీ ఆంఖే
  • 1962 గర్ల్స్ హాస్టల్
  • 1962 బాత్ ఏక్ రాత్ కి
  • 1963 ఘర్ బసాకే దేఖో
  • 1963 ఉస్తాదో కే ఉస్తాద్
  • 1963 ప్యార్ కా బంధన్
  • 1963 ఫూల్ బనే అంగారె
  • 1963 ముల్జిమ్
  • 1963 మేరే మెహబూబ్
  • 1963 కౌన్ అప్నా కౌన్ పరాయా
  • 1963 కహీ ప్యార్ న హో జాయె
  • 1964 షెహనాయి
  • 1964 దూర్ కీ ఆవాజ్
  • 1965 జిందగీ ఔర్ మౌత్
  • 1965 బాంబే రేస్ కోర్స్
  • 1966 సూరజ్
  • 1966 సగాయ్
  • 1966 ప్రీత్ న జానె రీత్
  • 1966 పతి పత్ని
  • 1966 దిల్లగి
  • 1966 దిల్ దియా డర్ లియా
  • 1966 బహారె ఫిర్ భి ఆయేంగి
  • 1967 జాల్
  • 1967 బహూ బేగమ్‌
  • 1967 దుల్హన్ ఏక్ రాత్ కీ
  • 1967 నైట్ ఇన్ లండన్
  • 1967 నూర్జహాన్
  • 1967 పాల్కి
  • 1967 తఖ్‌దీర్
  • 1967 నవాబ్ సిరాజుద్దౌలా
  • 1967 రాజు
  • 1967 వహా కే లోగ్
  • 1968 దునియా
  • 1968 బాజీ
  • 1968 మేరే హుజూర్
  • 1968 షికార్
  • 1968 దిల్ ఔర్ మొహబ్బత్
  • 1968 హసీనా మాన్‌ జాయేగీ
  • 1968 కహీ దిన్ కహీ రాత్
  • 1969 ఆద్మీ ఔర్ ఇన్సాన్
  • 1969 నన్హా ఫరిస్తా
  • 1969 ప్యార్ కా సప్నా
  • 1969 సచ్చాయి
  • 1969 దో రాస్తే
  • 1970 ఆనంద్
  • 1970 గోపి
  • 1971 హంగామా
  • 1972 దుష్మన్
  • 1972 రాజా రాణీ
  • 1973 ప్యార్ కా రిస్తా
  • 1974 మధోష్
  • 1975 ప్రతిజ్ఞ
  • 1975 జఖ్మీ
  • 1976 బుందల్ బాజ్
  • 1977 ఖేల్ ఖిలాడీ కా
  • 1978 నవాబ్ సాహిబ్
  • 1980 షాన్
  • 1981 మదినేకీ గలియా
  • 1983 మజ్దూర్
  • 1984 బిందియా చమ్కేగి
  • 1985 హమ్‌ దోనో
  • 1987 మేరా కరమ్‌ మేరా ధరమ్‌
  • 1988 ది పర్ఫెక్ట్ మర్డర్
  • 1991 సప్నో కా మందిర్
  • 1997 చాచీ 420

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 కమ్యూనికేటర్, ఫీచర్స్ (15 October 2001). "జానీవాకర్ జీవితంలో మైలు రాళ్లు". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (2): 44–45. Retrieved 20 March 2018.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 ఘోష్, సాగరిక (11 June 1997). "రిటర్న్ ఆఫ్ ద విట్". ఔట్‌లుక్. Retrieved 1 December 2010.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "జెంటిల్‌మాన్ కమెడియన్ పాసన్ అవే". ది ట్రిబ్యూన్. 29 July 2003. Retrieved 1 December 2010.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 "జానీవాకర్ సైనింగ్ ఆఫ్ ఆన్ ఎ హై". The Hindu. 1 ఆగస్టు 2003. Archived from the original on 31 డిసెంబరు 2013. Retrieved 18 నవంబరు 2013.

బయటి లింకులు

[మార్చు]