షాన్ మసూద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షాన్ మసూద్
షాన్ మసూద్ (2023)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షాన్ మసూద్ ఖాన్
పుట్టిన తేదీ (1989-10-14) 1989 అక్టోబరు 14 (వయసు 34)
కువైట్ సిటీ, కువైట్
మారుపేరుషానీ
ఎత్తు6 అ. 3 అం. (191 cమీ.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రఓపెనింగ్ బ్యాటర్
బంధువులువకార్ మసూద్ ఖాన్ (మామ)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 213)2013 అక్టోబరు 14 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2023 జూలై 24 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 221)2019 మార్చి 22 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2023 మే 7 - న్యూజీలాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.94
తొలి T20I (క్యాప్ 97)2022 సెప్టెంబరు 20 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2022 నవంబరు 13 - ఇంగ్లాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.94
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007/08కరాచీ వైట్స్
2019–presentMultan Sultans (స్క్వాడ్ నం. 94)
2019–2021సదరన్ పంజాబ్ (స్క్వాడ్ నం. 94)
2021Bagh Stallions (స్క్వాడ్ నం. 94)
2022డెర్బీషైర్ (స్క్వాడ్ నం. 94)
2022–2023బలూచిస్తాన్ (స్క్వాడ్ నం. 94)
2023యార్క్‌షైర్ (స్క్వాడ్ నం. 94)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ట్వంటీ20 ఫక్లా
మ్యాచ్‌లు 30 9 19 156
చేసిన పరుగులు 1,597 163 395 9,955
బ్యాటింగు సగటు 28.51 18.11 30.38 38.88
100లు/50లు 4/7 0/1 0/3 23/45
అత్యుత్తమ స్కోరు 156 50 65* 239
వేసిన బంతులు 144 875
వికెట్లు 2 8
బౌలింగు సగటు 46.00 75.87
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/6 2/52
క్యాచ్‌లు/స్టంపింగులు 21/– 2/– 5/– 94/–
మూలం: CricInfo, 2023 అక్టోబరు 1

షాన్ మసూద్ (జననం 1989, అక్టోబరు 14) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు, దేశీయ క్రికెట్‌లో ముల్తాన్ సుల్తాన్‌లకు ఆడుతున్నాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ గా, అప్పుడప్పుడు కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు.

2018 ఆగస్టులో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ద్వారా 2018–19 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ముప్పై-మూడు మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[1][2] ముల్తాన్ సుల్తాన్స్, సదరన్ పంజాబ్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కూడా పనిచేశాడు. ప్రస్తుతం, 2023 కౌంటీ సీజన్ కోసం యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు నియమిత కెప్టెన్ గా ఉన్నాడు.[1] ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ లో 2వ స్థానంలో నిలిచిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

జననం

[మార్చు]

ఇతడు 1989, అక్టోబరు 14న కువైట్‌లో జన్మించాడు. ఇతని తండ్రి అక్కడి బ్యాంకులో పనిచేశాడు. కువైట్‌పై ఇరాకీ దండయాత్ర, గల్ఫ్ యుద్ధం ప్రారంభమైన తరువాత, కుటుంబం వారి స్వస్థలమైన పాకిస్తాన్‌కు వెళ్ళి, మళ్ళి కరాచీలో స్థిరపడింది.[3]

దేశీయ క్రికెట్

[మార్చు]

2007 సీజన్‌లో అతని ఫస్ట్-క్లాస్ అరంగేట్రంలో, అసద్ షఫీక్‌తో 154 పరుగుల ఓపెనింగ్ స్టాండ్‌లో భాగంగా మసూద్ కరాచీ తరపున 54 పరుగులు చేశాడు. అతను డర్హామ్ విశ్వవిద్యాలయం కోసం మూడు ఫస్ట్-క్లాస్ గేమ్‌లు కూడా ఆడాడు. ఘనీ గ్లాస్ క్రికెట్ టీమ్ తరపున కూడా ఆడాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2013 అక్టోబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు అరంగేట్రంలో మసూద్ 75 పరుగులు చేశాడు. 2015 జూలైలో పల్లెకెలెలో శ్రీలంకపై తన తొలి సెంచరీని సాధించాడు. పార్ట్ టైమ్ మీడియం పేసర్ అయిన మసూద్ 2016 జూలై 23న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ క్రికెట్‌లో మొదటిసారి బౌలింగ్ చేశాడు. ఇతని మొదటి డెలివరీ నో బాల్ గా వేశాడు.[4]

2018 సెప్టెంబరులో, 2018 ఆసియా కప్ కోసం పాకిస్తాన్ వన్ డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు, కానీ ఆడలేదు.[5] 2019 జనవరిలో, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే జట్టులో ఎంపికయ్యాడు, కానీ మళ్ళీ ఆడలేదు.[6] 2019 మార్చిలో, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే జట్టులో ఎంపికయ్యాడు.[7][8] 2019 మార్చి 22న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన వన్డే అరంగేట్రం చేసాడు.[9]

2022 సెప్టెంబరులో, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ కోసం పాకిస్థాన్‌ టీ20 జట్టులో ఎంపికయ్యాడు.[10] 2022 సెప్టెంబరు 20న ఇంగ్లాండ్‌పై తన టీ20 అరంగేట్రం చేసాడు.[11]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "PCB Central Contracts 2018–19". Pakistan Cricket Board. Retrieved 6 August 2018.
  2. "New central contracts guarantee earnings boost for Pakistan players". ESPN Cricinfo. Retrieved 6 August 2018.
  3. Alderson, Andrew (21 November 2014). "Cricket: Masood credits dad for career". The New Zealand Herald.
  4. NDTVSports.com. "Live Cricket Score England vs Pakistan Day 2, Second Test: Joe Root Double Ton Puts England On Top". ndtv.com. Retrieved 23 July 2016.
  5. "Shaheen Afridi included in Pakistan squad for Asia Cup 2018". International Cricket Council. Retrieved 4 September 2018.
  6. "Mohammad Amir, Mohammad Rizwan back in Pakistan ODI squad". ESPN Cricinfo. Retrieved 9 January 2019.
  7. "Shoaib Mailk to lead ODI squad in UAE, Sarfaraz Ahmed among six players rested". ESPN Cricinfo. Retrieved 8 March 2019.
  8. "Pakistan squad for Australia ODIs announced". Pakistan Cricket Board. Retrieved 8 March 2019.
  9. "1st ODI (D/N), Australia tour of United Arab Emirates at Sharjah, Mar 22 2019". ESPN Cricinfo. Retrieved 22 March 2019.
  10. "Pakistan name squad for ICC Men's T20 World Cup 2022". Pakistan Cricket Board. Retrieved 15 September 2022.
  11. "1st T20I (N), Karachi, September 20, 2022, England tour of Pakistan". ESPN Cricinfo. Retrieved 20 September 2022.

బాహ్య లింకులు

[మార్చు]