షాన్ యంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షాన్ యంగ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1970-06-13) 1970 జూన్ 13 (వయసు 54)
బర్నీ, టాస్మానియా, ఆస్ట్రేలియా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 372)1997 21 ఆగస్టు - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1991/92–2001/02Tasmania
1997Gloucestershire
2001–2003Bedfordshire
కెరీర్ గణాంకాలు
పోటీ Test FC LA
మ్యాచ్‌లు 1 138 102
చేసిన పరుగులు 4 7,212 2,486
బ్యాటింగు సగటు 4.00 37.95 32.28
100s/50s 0/0 14/44 1/18
అత్యధిక స్కోరు 4* 237 146*
వేసిన బంతులు 48 20,630 4,313
వికెట్లు 0 274 88
బౌలింగు సగటు 35.82 34.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 8 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0
అత్యుత్తమ బౌలింగు 7/64 5/39
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 82/– 34/–
మూలం: Cricinfo, 2019 6 August

షాన్ యంగ్ (జననం 1970, జూన్ 13) ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్, ఫుట్‌బాల్ ఆటగాడు, నిర్వాహకుడు. కాన్‌బెర్రాలోని ఈస్ట్‌లేక్ ఫుట్‌బాల్ క్లబ్‌ తరపున ఆడాడు. 1997లో ఆస్ట్రేలియా తరపున ఒకేఒక టెస్ట్ మ్యాచ్‌ ఆడాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో టాస్మానియా తరపున ఆడాడు.

తొలి జీవితం

[మార్చు]

యంగ్ 1970, జూన్ 13న టాస్మానియాలోని బర్నీలో జన్మించాడు.[1] 1990, అక్టోబరులో టాస్మానియా తరపున సీనియర్ అరంగేట్రం చేసాడు. రాష్ట్రం తరపున ఏజ్ గ్రూప్ క్రికెట్ ఆడాడు. టాస్మానియన్ జట్టులో ఆల్-రౌండర్‌గా స్థిరపడ్డాడు. తరువాతి సీజన్‌లో షెఫీల్డ్ షీల్డ్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసాడు. రాష్ట్ర జట్టు తరపున 100కి పైగా షీల్డ్ మ్యాచ్‌లలో ఆడాడు.[2]

టెస్ట్ క్రికెటర్

[మార్చు]

ఒక సీజన్‌లో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడాడు. 1997లో గ్లౌసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు ఆడాడు. జులైలో డెర్బీషైర్‌పై అత్యధిక స్కోరు 237 పరుగులు చేశాడు.[1][3] యంగ్ 1995లో ఇంగ్లాండ్ పర్యటనలో యంగ్ ఆస్ట్రేలియా తరపున ఆడాడు. ప్రత్యామ్నాయం అవసరమైనప్పుడు ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. కెంట్‌తో జరిగిన టూర్ మ్యాచ్‌లో షేన్ లీతో కలిసి ఆడాడు. లంకాషైర్ లీగ్ నుండి పిలవబడిన మరొక స్థానంలో ఉన్నాడు. ఓవల్‌లో 1997 యాషెస్ సిరీస్‌లో ఆఖరి టెస్ట్ కోసం జట్టులో ఎంపికయ్యాడు.[3]

యంగ్ ఆ మ్యాచ్‌లో వికెట్లేమి తీయలేదు. ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు.[1] 1996లో పర్యాటక పాకిస్థానీలతో ఆస్ట్రేలియా ఎ జట్టు తరపున ఒకసారి ఆడాడు, అయితే పూర్తి ఆస్ట్రేలియా జట్టుకు ఓవల్ టెస్ట్ మాత్రమే ఆడాడు.[2]

తర్వాతి జీవితం

[మార్చు]

2001/02 ఆస్ట్రేలియన్ సీజన్ తర్వాత యంగ్ టాస్మానియా నుండి బయటికి వచ్చి, ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ అడ్మినిస్ట్రేషన్‌లోకి మారాడు. ఏఎఫ్ఎల్ తాస్మానియాలో ఇతర హోదాలలో పనిచేసి, తర్వాత 2010లో టాస్మానియన్ ఫుట్‌బాల్ లీగ్ జనరల్ మేనేజర్ అయ్యాడు. 2016లో కాన్‌బెర్రాలోని ఈస్ట్‌లేక్ ఫుట్‌బాల్ క్లబ్‌లో జనరల్ మేనేజర్‌గా మారాడు.[3][4][5] 2001 మరియు 2003 మధ్య బాకప్ క్రికెట్ క్లబ్ కోసం లాంక్షైర్ లీగ్ క్రికెట్ ఆడాడు, అలాగే అదే సమయంలో చెల్టెన్‌హామ్ & గ్లౌసెస్టర్ ట్రోఫీలో బెడ్‌ఫోర్డ్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఏడు మ్యాచ్‌లు ఆడాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Shaun Young, ESPNcricinfo. Retrieved 7 August 2019.
  2. 2.0 2.1 2.2 Shaun Young, CricketArchive. Retrieved 7 August 2019.
  3. 3.0 3.1 3.2 Coverdale B (2016) Shaun Young's Ashes outing, The Cricket Monthly, ESPNcricinfo, 28 April 2016. Retrieved 2019-08-07.
  4. Tasmanian State League competition chief Shaun Young resigns, The Mercury, 16 January 2016. Retrieved 2019-08-07.
  5. Polack J (2002) Experienced trio dropped as Tigers' selectors wield axe, ESPNcricinfo, 14 January 2002.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=షాన్_యంగ్&oldid=4101424" నుండి వెలికితీశారు