షాపూర్జీ పల్లోంజీ గ్రూప్
షాపూర్జీ పల్లోంజీ & కంపెనీ ప్రయివేట్ లిమిటెడ్ (Shapoorji Pallonji & Company Private Limited) షాపూర్జీ పల్లోంజీ గ్రూప్(Shapoorji Pallonji Group) గా వ్యాపారం నిర్వహిస్తున్న ఒక భారతీయ సమ్మేళన సంస్థ, ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉన్నది.[1] ఈ సంస్థ చేపట్టే వ్యాపారంలో నిర్మాణం, రియల్ ఎస్టేట్, టెక్స్ టైల్స్, ఇంజనీర్డ్ గూడ్స్, గృహోపకరణాలు, షిప్పింగ్, పబ్లికేషన్స్, పవర్ , బయోటెక్నాలజీ రంగాల వంటివి ఉన్నాయి. షాపూర్జీ పల్లోంజీ "భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి వహించిన ప్రైవేట్ సంస్థలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
దస్త్రం:Shapoorji Pallonji Group logo.svg | |
రకం | ప్రైవేట్ |
---|---|
పరిశ్రమ | Conglomerate |
స్థాపన | 1865 |
స్థాపకుడు | పల్లోంజీ మిస్త్రీ |
ప్రధాన కార్యాలయం | , |
కీలక వ్యక్తులు |
|
సేవలు | |
యజమాని | పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ (100%) |
అనుబంధ సంస్థలు |
|
వెబ్‌సైట్ | www |
చరిత్ర
[మార్చు]1865లో లిటిల్ వుడ్ పల్లోంజీ అనే చిన్న భాగస్వామ్య సంస్థ పునాదితో ప్రారంభమైంది. ఈ సంస్థ చేపట్టిన మొట్ట మొదటి ప్రాజెక్టు గిర్గాం చౌపట్టిపై పేవ్ మెంట్ నిర్మాణం. ఈ చిన్న(మైనర్) కాంట్రాక్ట్ ఆరు నెలల పాటు తో ఉండి, చేపట్టిన పనిలో కంపెనీ లాభాలను పొందింది. తరువాత 1881 సంవత్సరంలో మలబార్ కొండపై ఒక జలాశయాన్ని నిర్మించే ప్రాజెక్టు జరిగింది. మలబార్ హిల్ రిజర్వాయర్ 100 సంవత్సరాలకు పై బడి ముంబై నగరానికి నీటిని సరఫరా చేయడానికి బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం ఉన్న బొంబాయి సెంట్రల్ రైల్వే స్టేషను(ముంబై సెంట్రల్ రైల్వే స్టేషను) కూడా 1930లో సుమారు 1.5 కోట్ల రూపాయల వ్యయంతో వీరు నిర్మించారు. ఈ పనిని రికార్డు స్థాయిలో 21 నెలల వ్యవధిలోనే పూర్తి చేసినందుకు అప్పటి బొంబాయి గవర్నరు సంస్థను అభినందించాడు.
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ స్థాపకుడు షాపూర్జీ మిస్త్రీ, 1929 సంవత్సరంలో జన్మించిన ఆయన కుమారుడు పల్లోంజీ మిస్త్రీ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ అయ్యాడు. ప్రస్తుతం పల్లోంజీ మిస్త్రీ కుమారుడు షాపూర్ షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్పీసీపీఎల్)కు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
షాపూర్ పల్లోంజీ మిస్త్రీ కుమారుడు పల్లోన్ మిస్త్రీని కూడా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ బోర్డులో చేర్చుకోగా, అతని సోదరి తాన్యా గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ గ్రూపుకు 13 కంపెనీలు,3 డివిజన్లు ఉన్నాయి, 60 దేశాలకు పైగా క్లయింట్లకు సేవలందిస్తున్న 60,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.[2]
నిర్మాణాలు
[మార్చు]షాపూర్జీ పల్లోంజి గ్రూప్ భారత దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరంలో నిర్మించిన భారతదేశంలోని అత్యంత ఎత్తైన భవనం ముంబైలోని ఇంపీరియల్ రెసిడెన్షియల్ టవర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తాజ్ ఇంటర్కాంటినెంటల్ హోటల్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్[2],హెచ్ఎస్బిసి, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయ భవనాలు వంటి అనేక ఐకానిక్ నిర్మాణాలను నిర్మించారు. ఈ సంస్థకు అఫ్కాన్స్, యురేకా ఫోర్బ్స్, ఎస్పీసీఎల్, ఎస్పీ ఇంటర్నేషనల్, స్టెర్లింగ్ అండ్ విల్సన్, ఎస్పీ రియల్ ఎస్టేట్ ప్రధాన కంపెనీలు. ఈ బృందం బ్రాబోర్న్ స్టేడియం, తాజ్ మహల్ టవర్, ట్రైడెంట్ మొదలైన వాటిని కూడా నిర్మించింది. ఢిల్లీలోని బరాఖంబా అండర్ గ్రౌండ్ స్టేషన్మ, గయానాలో ప్రావిడెన్స్ స్టేడియాన్ని కూడా నిర్మించారు. 2010 సంవత్సరంలో దేశంలోనే ఎత్తైన భవనం, ది ఇంపీరియల్, ముంబైలో ఒక నివాస సముదాయం నిర్మించారు . ఈ సంస్థ భారత దేశం లోనే గాక ఒమన్ సుల్తాన్ కోసం రాయల్ ప్యాలెస్ ను కూడా నిర్మించింది. ఆఫీసు ఆస్తులను కొనుగోలు చేయడానికి కెనడాకు చెందిన సిపిపిఐబితో, సరసమైన గృహాల కోసం స్టాండర్డ్ చార్టర్డ్, ఐఎఫ్సితో ఎస్పీ గ్రూపుకు వెంచర్ ఉంది.[3]
ఇతర రంగాలు
[మార్చు]1982 సంవత్సరంలో షాపూర్జీ పల్లోంజి గ్రూప్() నీటి వ్యర్థాల నిర్వహణ దిశగా తన వ్యాపారాన్ని విస్తరించడానికి యురేకా ఫోర్బ్స్ ను తన అనుబంధ సంస్థగా అయినది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ దాదాపు 2 గిగావాట్ల సోలార్ ప్లాంట్లతో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సోలార్ ఎనర్జీ పవర్ కాంట్రాక్టర్ (EPC) కాంట్రాక్టర్ తద్వారా భారతదేశంలో వారు 1,800 మెగావాట్లకు పైగా గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ సమూహం జలవిద్యుత్ కేంద్రాలు, ఓడరేవులు, టెర్మినల్స్ లో కూడా పనిచేస్తుంది.[4] గుజరాత్ తీర ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ డీప్వాటర్ పోర్టు, ఎల్ఎన్జీ ఇంపోర్ట్ టెర్మినల్, పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని షాపూర్జీ పల్లోంజీ కంపెనీ లిమిటెడ్ ప్రణాళిక యోచిస్తోందని ఇది డీప్ వాటర్ పోర్టు, ప్రధాన ద్రవీకృత సహజవాయువు దిగుమతి టెర్మినల్, 2,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కర్మాగారంగా ఉంటుందని కంపెనీ ఫైనాన్స్ హెడ్ జిమ్మీ పరాఖ్ తెలిపాడు[5].
మూలాలు
[మార్చు]- ↑ "About Us - Shapoorji Pallonji Group and Subsidiaries". www.shapoorjipallonji.com. Retrieved 2022-07-01.
- ↑ 2.0 2.1 "What is the History of the Shapoorji Pallonji Group?". Real Estate & EPC Construction News (in ఇంగ్లీష్). 2020-06-19. Archived from the original on 2021-03-15. Retrieved 2022-07-01.
- ↑ Kamath, Raghavendra (2016-10-25). "Shapoorji Pallonji group: The construction giant run by Cyrus Mistry's father". Business Standard India. Retrieved 2022-07-01.
- ↑ Chadda, Shivam (2020-12-21). "Shapoorji Pallonji Group: From construction to conglomerate". Brandzwatch (in ఇంగ్లీష్). Retrieved 2022-07-01.
- ↑ "Shapoorji Pallonji plans deepwater port in Gujarat". 1 July 2022. Retrieved 1 July 2022.[permanent dead link]