Jump to content

షా ఫరూక్ అన్వర్

వికీపీడియా నుండి
షా ఫరూక్ అన్వర్

పదవీ కాలం
24 అక్టోబర్ 2019 – 23 నవంబర్ 2024
ముందు అనిల్ గోటే
తరువాత అనూప్ అగర్వాల్
నియోజకవర్గం ధులే సిటీ

ధులే మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్
పదవీ కాలం
2013 – 2016

మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ వక్ఫ్ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ వక్ఫ్ సభ్యుడు

వ్యక్తిగత వివరాలు

జననం 1973 జూన్ 3
ధులే
రాజకీయ పార్టీ ఏఐఎంఐఎం
ఇతర రాజకీయ పార్టీలు ఏఐఎంఐఎం (2013–2017) బీజేపీ (2017-2019)
నివాసం ప్లాట్ నెం.6, గజానన్ కాలనీ, గఫూర్ నగర్, తాల్.డిస్ట్., ధూలే
వెబ్‌సైటు [1]

షా ఫరూక్ అన్వర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ధులే సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

షా ఫరూక్ అన్వర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013లో ధులే మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ఎన్నికై 2013 నుండి 2016 వరకు డిప్యూటీ మేయర్‌గా పని చేసి ఆ తరువాత 2017లో భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ టికెట్ ఆశించగా దక్కకపోవడంతో ఎంఐఎం పార్టీలో చేరి ధులే సిటీ నుండి ఏఐఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి రాజ్‌వర్ధన్ రఘుజీరావు కదంబండేపై 3,307 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

షా ఫరూక్ అన్వర్ 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ధులే సిటీ నుండి ఏఐఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అనూప్ అగర్వాల్ చేతిలో 45,750 ఓట్ల ఓడిపోయాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  2. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. The Times of India (23 November 2024). "Dhule city election results: BJP's Agrawal Anupbhaiyya Omprakash defeats AIMIM'S Shah Faruk Anwar by 45,750 votes". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Dhule City". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.