షెహజార్ మహమ్మద్
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | కరాచీ, సింధ్, పాకిస్థాన్ | 1991 నవంబరు 12
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడి చేయి ఆఫ్‌బ్రేక్ |
పాత్ర | అప్పుడప్పుడు వికెట్ కీపర్ |
బంధువులు | హనీఫ్ మొహమ్మద్ (తాత) షోయబ్ మహ్మద్ (తండ్రి) సోహై అలీ అబ్రో (భార్య) |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2009/10–2018/19 | పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ |
2019/20–present | సింధ్ |
మూలం: Cricinfo, 2 October 2016 |
షెహజార్ మొహమ్మద్ (జననం 1991, నవంబరు 12) పాకిస్తానీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్, ఫిట్‌నెస్ ట్రైనర్. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్, కరాచీ వైట్స్ తరపున క్రికెట్ ఆడాడు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]షెహజార్ మొహమ్మద్ 1991, నవంబరు 12న పాకిస్తాన్ లో జన్మించాడు. ఇతను క్రికెటర్ హనీఫ్ మహ్మద్ మనవడు, క్రికెటర్ షోయబ్ మహ్మద్ కుమారుడు.[2] ఐదుగురు మొహమ్మద్ సోదరులలో హనీఫ్ ఒకడు, వీరిలో నలుగురు (వజీర్, ముస్తాక్, సాదిక్, హనీఫ్) షెహజార్ తండ్రి షోయబ్ మాదిరిగానే పాకిస్తాన్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడారు. 2021లో, షెహజార్ నటి సోహై అలీ అబ్రోను వివాహం చేసుకున్నాడు.[3]
దేశీయ వృత్తి
[మార్చు]2018 అక్టోబరులో, 2018–19 క్వాయిడ్-ఎ-ఆజం ట్రోఫీ మ్యాచ్‌లో ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో ముల్తాన్‌పై కరాచీ వైట్స్ తరఫున 265 పరుగులు చేశాడు.[4] అతను ఫస్ట్-క్లాస్ డబుల్ టన్ను కొట్టిన అతని కుటుంబంలో ఆరవ సభ్యుడు అయ్యాడు.[5]
2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-అజామ్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సింధు జట్టులో ఎంపికయ్యాడు.[6][7]
ఫిట్నెస్ శిక్షణ
[మార్చు]యునైటెడ్ స్టేట్స్ నుండి స్పోర్ట్స్ బయోమెకానిక్స్, క్రాస్ ఫిట్‌లో సర్టిఫికేట్ కోర్సులు చేసిన అతను కరాచీలో జిమ్‌ను ప్రారంభించాడు. షాన్ మసూద్, అజర్ అలీతో సహా పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్‌లకు శిక్షణ ఇచ్చాడు. ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, నటులు బిలాల్ అష్రాఫ్, మోహిబ్, మీర్జా వంటివారు ఉన్నారు.[8]
మూలాలు
[మార్చు]- ↑ "Shehzar Mohammad". ESPN Cricinfo. Retrieved 2 October 2016.
- ↑ "Third-generation double-centurion for Pakistan cricket's first family". International Cricket Council. Retrieved 13 October 2018.
- ↑ "Sohai Ali Abro just got married to cricketer Shehzar Mohammad". Dawn. Retrieved 23 March 2021.
- ↑ "Shehzar Mohammad emulates grandfather and father to set unique first-class record". Hindustan Times. 15 October 2018.
- ↑ Ahmed, Waseem (13 October 2018). "Shehzar Mohammad sixth member of illustrious family to hit first-class double ton". Sport360.
- ↑ "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. Retrieved 4 September 2019.
- ↑ "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPN Cricinfo. Retrieved 4 September 2019.
- ↑ Hussain, S.M. (27 December 2020). "CRICKET: A CHIP OFF THE OLD BLOCK". Dawn News.