షేర్ మార్కెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లండన్ స్టాక్ ఎక్సేంజీ

స్టాక్ మార్కెట్ అనునది కంపెనీ వాటా (స్టాక్) లు కొనుగోలు, అమ్మకము జరుపుటకై ఏర్పరచిన ఒక సముదాయము. ప్రపంచములో జరుగు వాటా లావాదేవీలు ప్రతియేటా దాదాపుగా 85 ట్రిలియన్ డాలర్లు వుంటాయి. అతిపెద్ద స్టాక్ మార్కెట్ అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని న్యూయార్క్ నగరం అందలి ఎన్.వై.ఎస్.ఈ (NYSE). ప్రపంచములో ముఖ్యమైన స్టాక్ మార్కెట్లు, లండన్, ఆమ్^స్టర్^డామ్, పారిస్, ఫ్రాంక్^ఫర్ట్, హాంగ్ కాంగ్, సింగపూర్, టోక్యో లయందు ఉన్నాయి. దాదాపు అన్ని స్టాక్ ఎక్ఛేంజీలు ముఖ్యంగా స్వామ్య, వికల్ప అనెడి విభాగాలలో లావాదేవీలు జరుపును.

భారత దేశంలో ముఖ్యమైన స్టాక్ ఎక్ఛేంజీలు రెండు ఉన్నాయి. అవి బాంబే స్టాక్ ఎక్ఛేంజీ (BSE), నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ (NSE). వీటినే సెన్సెక్స్ అని, నిఫ్టీ అనికూడా అంటారు. వ్యాపార వేళలు ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3.30 వరకు, శని, ఆదివారాలు శలవు దినాలు.

లావాదేవీలు[మార్చు]

స్టాక్ మార్కెట్లో చిన్న మదుపుదార్ల దగ్గరనుండి, సంస్థాగత మదుపుదార్ల, పెన్షన్ ఫండ్, భీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్, హెడ్జ్ ఫండ్ ట్రేడర్లు వంటి అనేక స్థాయి వ్యక్తులు, సంస్థలు లావాదేవీలు జరుపుతూంటారు. కొంతకాలం క్రిందటి వరకు ఈ స్టాక్ మార్కెట్లు పెద్ద పెద్ద భవనాలలో ట్రేడింగ్ జరుపుతూ వుంటిరి. ప్రస్తుతము అంతర్జాల మహిమ వలనూ, సాంకేతిక పరిజ్ఞానము వలననూ సాంకల్పిక పద్ధతి ప్రాచుర్యం పొందుతున్నది.

ప్రాముఖ్యత[మార్చు]

వ్యాపార సంస్థలు ద్రవ్యము అప్పు తీసుకొనుటకు, వాటి వ్యాపార విలువ పెంచుకొనుటకు స్టాక్ మార్కెట్ ఒక ప్రధానమైన వనరు. వ్యాపారములు పబ్లిక్ ట్రేడింగ్ జరుపుటకు, మూలధన రుణమునకు సామాన్యముగా స్టాక్ మార్కెట్ లో వాటి వాటా (share) లు అమ్మెదరు.

ప్రస్తుత పెట్టుబడిదారీ ప్రపంచవ్యాప్త వ్యవస్థల్లో, ఆర్థిక లావాదేవీలు, దేశ సంపద స్టాక్ మార్కెట్ లపై ఆధారపడివున్నాయంటే అతిశయోక్తి కాదు.

{విస్తరణ చేయవలెను. కొంచెము సమయము కావాలి. మిత్రులు ఎవరైనా సహాయం చేయవలెనన్న దయచేసి చేయండి.}

ఇవి కూడా చూడండి[మార్చు]