Jump to content

సంజయ్ గుప్తా

వికీపీడియా నుండి
సంజయ్ గుప్తా
సంజయ్ గుప్తా
జననం (1967-04-14) 1967 ఏప్రిల్ 14 (వయసు 57)
బాంద్రా, మహారాష్ట్ర
వృత్తిదర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1994–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅను లేఖి[1]

సంజయ్ గుప్తా మహారాష్ట్రకు చెందిన హిందీ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత. గుప్తా ఎక్కువగా అమెరికన్ యాక్షన్-థ్రిల్లర్, క్రైమ్ సినిమాల రీమేక్‌లకు ప్రసిద్ధి చెందాడు. ఆతిష్, కాంటే,[2] కాబిల్, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా, షూటౌట్ ఎట్ వడాలా, జజ్బా, జిందా, కరమ్, ముంబై సాగా వంటి సినిమాలు తీశాడు. ఇతని సినిమాలలో ఎక్కువగా సంజయ్ దత్, జాన్ అబ్రహంలు నటించారు.

జననం

[మార్చు]

సంజయ్ గుప్తా 1967 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని బాంద్రాలో జన్మించాడు.

సినిమారంగం

[మార్చు]

ఆదిత్య పంచోలి, సంజయ్ దత్ నటించిన ఆతిష్: ఫీల్ ది ఫైర్ (1994) సినిమాతో గుప్తా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. తరువాత రామ్ శాస్త్ర, ఖౌఫ్, జంగ్ వంటి సినిమాలకు రచన, దర్శకత్వం వహించాడు. జంగ్ (2000) సినిమా షూటింగ్ రెండు సంవత్సరాలపాటు కొనసాగింది.[3] 2001లో లాస్ ఏంజిల్స్‌లో కాంటే చిత్రీకరణ జరుగుతున్నప్పుడు, 9/11 దాడి సంఘటనల కారణంగా చలనచిత్రం సున్నితంగా పరిగణించబడే అనేక ప్రాంతాల నుండి ప్రణాళికాబద్ధమైన సన్నివేశాలను మార్చవలసి వచ్చింది.[4]

గుప్తా తీసిన జిందా (2006) సినిమా కొరియన్ చిత్రం ఓల్డ్‌బాయ్‌కి అనధికారిక రీమేక్‌గా వర్ణించబడింది.[5][6]

షూట్‌అవుట్ ఎట్ లోఖండ్‌వాలా (2007), దస్ కహానియన్ సినిమాలను నిర్మించాడు. షూట్‌అవుట్ ఎట్ వడలా, షూట్‌అవుట్ ఎట్ లోఖండ్‌వాలాకు ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించి సహనిర్మాతగా వ్యవహరించాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకుడు నిర్మాత రచయిత ఇతర వివరాలు
1994 ఆతీష్: ఫీల్ ద ఫైర్ Yes Yes దీవార్,[7] ఎ బెటర్ టుమారో,[8] స్టేట్ ఆఫ్ గ్రేస్[9] ప్రేరణతో
1995 రామ శాస్త్ర Yes Yes హార్డ్ టు కిల్ ఆధారంగా
1997 హమేషా Yes Yes
2000 జంగ్ Yes Yes డెస్పరేట్ మెజర్స్ ఆధారంగా
ఖౌఫ్ Yes Yes ది జ్యూరర్ ఆధారంగా
2002 కాంటే Yes[10] Yes సిటీ ఆన్ ఫైర్, రిజర్వాయర్ డాగ్స్ నుండి ప్రేరణ పొందింది[2][9]
2004 ప్లాన్ Yes Yes సూసైడ్ కింగ్స్ ఆధారంగా
ముసాఫిర్ Yes[11] Yes యు టర్న్ ఆధారంగా
2005 కరమ్ Yes Yes
2006 జిందా Yes[12] Yes ఓల్డ్‌బాయ్ ఆధారంగా
2007 షూటౌట్ ఎట్లోఖండ్‌వాలా Yes
దస్ కహానియన్ Yes Yes ది టెన్, టేల్స్ ఫ్రమ్ ది క్రిప్ట్ నుండి ప్రేరణ
2008 వుడ్‌స్టాక్ విల్లా Yes జపనీస్ సినిమా ఖోస్ ఆధారంగా
2009 యాసిడ్ ఫ్యాక్టరీ Yes
2010 పంఖ్ Yes
2013 షూటౌట్ ఎట్ వాడాలా Yes[13] Yes Yes డోంగ్రీ టు దుబాయ్ పుస్తకం ఆధారంగా
2015 జజ్బా Yes[14] Yes Yes సెవెన్ డేస్ ఆధారంగా
2017 కాబిల్ Yes[15] బ్లైండ్ ఫ్యూరీ, బ్రోకెన్[16][17] ప్రేరణతో
2021 ముంబై సాగా Yes Yes [18]

మూలాలు

[మార్చు]
  1. Meena, Iyer (5 June 2009). "Sanjay Gupta remarries... his ex-wife!". The Times of India. Retrieved 2023-07-19.
  2. 2.0 2.1 "Movies: An interview with Sanjay Gupta". Rediff. July 27, 2002. Retrieved 2023-07-19.
  3. Kanchana Suggu. "I will not dub for Jung". Rediff. Retrieved 2023-07-19.
  4. "Movies: An interview with Sanjay Gupta". Rediff. July 27, 2002. Retrieved 2023-07-19.
  5. Rajinder, Dudrah; Jigna, Desai (2008-10-01). The Bollywood Reader. McGraw-Hill International. ISBN 9780335222124. Retrieved 2023-07-19.
  6. Dudrah, Rajinder and Desai, Jigna. 2008.
  7. Chaudhuri, Diptakirti (2015). Written by Salim-Javed: The Story of Hindi Cinema's Greatest Screenwriters. Penguin Books. p. 245. ISBN 9789352140084.
  8. Peirse, Alison (2013). Korean Horror Cinema. Edinburgh University Press. p. 190. ISBN 9780748677658.
  9. 9.0 9.1 "Whose movie is it anyway?". Rediff. Retrieved 2023-07-19.
  10. "Who is the surprise package of Kaante?". Rediff. 27 July 2002. Retrieved 2023-07-19.
  11. Kanika, Gahlaut. "Reddy to show". India Today. Archived from the original on 21 December 2015. Retrieved 2023-07-19.
  12. "Zinda review". Time Out (magazine). 2006. Archived from the original on 2015-12-22. Retrieved 2023-07-19.
  13. "'Shootout at Wadala' my most challenging film: Sanjay Gupta". Mid-Day. 5 May 2012. Retrieved 2023-07-19.
  14. "Aishwarya Rai Bachchan's 'Jazbaa' a remake of South Korean film Seven Days". The Indian Express. 17 December 2014.
  15. "Hrithik Roshan pairs with Yami Gautam in 'Kaabil'". The Times Of India. 8 February 2016. Retrieved 2023-07-19.
  16. "Kaabil Review {4/5}: Hrithik has what it takes to be Kaabil". The Times of India. Retrieved 2023-07-19.
  17. Iyer, Meena. "Kaabil movie review: Hrithik Roshan's best performance ever". The Economic Times. Retrieved 2023-07-19.
  18. "Sanjay Gupta nervous to shoot for 'Mumbai Saga'". The Times of India. 27 August 2019. Retrieved 2023-07-19.

బయటి లింకులు

[మార్చు]