Jump to content

సంజయ రాజారాం

వికీపీడియా నుండి
సంజయ రాజారాం

సంజయ రాజారాం భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త.

జీవిత విశేషాలు

[మార్చు]

రాజారాం ఉత్తర ప్రదేశ్ లోని ఓ చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.

శాస్త్ర రంగంలో కృషి

[మార్చు]

వందలాది వంగడాలు ఆవిష్కరించి ప్రపంచవ్యాప్తంగా గోధుమ దిగుబడులు పెరిగేలా విశేష కృషి చేసినందుకు ఈయనకు ప్రతిష్ఠాత్మక "ప్రపంచ ఆహార బహుమతి" అవార్డు లభించింది. ప్రస్తుతం "అంతర్జాతీయ పొడినేలల వ్యవసాయ పరిశోధన కేంద్రం(ఐసీఏఆర్‌డిఏ)" సీనియర్ శాస్త్రీయ సలహాదారుగా సంజయ్ రాజారాం వ్యవహరిస్తున్నారు. రాజారాం రూపొందించిన 480 గోధుమ వంగడాలు ఆరు ఖండాల్లోని 51 దేశాల్లో విడుదలయ్యి, 5.8 కోట్ల హెక్టార్లలో సాగవుతున్నాయని అవార్డు కమిటీ పేర్కొంది. ఈయన కృషి వల్ల ప్రపంచ గోధుమ దిగుబడులు గత నాలుగు దశాబ్దాల్లో ఏటా 1.3 శాతం పెరిగేందుకు సాధ్యం అయిందని అవార్డు కమిటీ ప్రశంసించింది.

ఇతను తన జీవితంలో ఎక్కువ కాలం "అంతర్జాతీయ మొక్కజొన్న, గోధుమ అభివృద్ధి కేంద్రం (సీఐఎంఎంవైటీ)" లోనే గోధుమ ఉత్పత్తి కార్యక్రమానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు. హరిత విప్లవ పితామహుడయిన నార్మన్ ఇ. బోర్లాగ్‌తో కలిసి కూడా అనేక సంవత్సరాలు ఈయన పనిచేశారు. 16-10-2014న అమెరికాలోని డెస్ మోయిన్స్‌లో జరిగిన "2014 బోర్లాగ్ డైలాగ్" సదస్సులో "ప్రపంచ ఆహార బహుమతి" అవార్డును స్వీకరించారు. ఆహార ధాన్యాల దిగుబడి, నాణ్యత, అందుబాటును పెంచేందుకు విశేష కృషిచేసే ప్రముఖ వ్యక్తులకు ప్రతి సంవత్సరం "ప్రపంచ ఆహార బహుమతి" అవార్డును బహుకరిస్తారు.

మూలాలు

[మార్చు]
  • సాక్షి దినపత్రిక - 17-10-2014 - (భారత శాస్త్రవేత్తకు ప్రపంచ ఆహార బహుమతి)

ఇతర లింకులు

[మార్చు]