Jump to content

సంజీవ్ ఖన్నా

వికీపీడియా నుండి
సంజీవ్ ఖన్నా
సంజీవ్ ఖన్నా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
11 నవంబర్ 2024
నియమించిన వారు ద్రౌపది ముర్ము
ముందు డి.వై. చంద్రచూడ్

భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
18 జనవరి 2019 – 10 నవంబర్ 2024
సూచించిన వారు రంజన్ గొగోయ్
నియమించిన వారు రామ్‌నాథ్ కోవింద్

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
24 జూన్ 2005 – 17 జనవరి 2019
సూచించిన వారు రమేష్ చంద్ర లహోటి
నియమించిన వారు ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

వ్యక్తిగత వివరాలు

జననం (1960-05-14) 1960 మే 14 (వయసు 64)
న్యూఢిల్లీ , భారతదేశం
సంతానం 2
పూర్వ విద్యార్థి ఢిల్లీ విశ్వవిద్యాలయం

సంజీవ్ ఖన్నా (జననం 1960 మే 14) భారతదేశానికి చెందిన భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు.

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా 2024 నవంబర్ 11న సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి భవన్‌లో  ప్రమాణ స్వీకారం చేశాడు.[1][2]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

సంజీవ్ ఖన్నా న్యూఢిల్లీలో 1960 మే 14న జన్మించాడు. ఆయన లా డిగ్రీ తర్వాత 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సంజీవ్ ఖన్నా 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని హజరీ కాంప్లెక్స్‌లో జిల్లా కోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు, ట్రైబ్యునళ్లకు మారి 2004లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటొరీ స్టాండింగ్ కౌన్సిల్, ఇన్‌కమ్ ట్యాక్స్ స్టాండింగ్ సీనియర్ కౌన్సిల్‌గా, ఢిల్లీ హైకోర్టు అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా, క్రిమినల్ కేసుల్లో అమికస్ క్యూరీగా వ్యవహరించి 2005లో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా, 2006లో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందాడు. ఆయన ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్టిబర్ సెంటర్, డిస్ట్రిక్ట్ కోర్టు మధ్యవర్తిత్వ కేంద్రాలకు ఛైర్మన్‌గా పని చేసి 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం 2024 నవంబర్ 11తో ముగియనుంది. దీంతో ఆయన తన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాడు. ఈ సిఫార్సును కేంద్రం ఆమోదిస్తే భారత సర్వోన్నత న్యాయస్థానం 51వ సీజేగా జస్టిస్‌ ఖన్నా నియమితులు కానున్నాడు.[3][4][5][6][7][8][9]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (11 November 2024). "సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  2. Eenadu (11 November 2024). "సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణం". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  3. Eenadu (17 October 2024). "సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. సిఫార్సు చేసిన సీజేఐ". Retrieved 17 October 2024.
  4. Andhrajyothy (17 October 2024). "తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా." Retrieved 17 October 2024.
  5. Zee News Telugu (17 October 2024). "సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎవరీ సంజీవ్ ఖన్నా". Retrieved 17 October 2024.
  6. The Hindu (17 October 2024). "CJI Chandrachud proposes Justice Sanjiv Khanna as successor" (in Indian English). Retrieved 17 October 2024.
  7. The Indian Express (17 October 2024). "CJI Chandrachud writes to Centre, names Justice Sanjiv Khanna as his successor" (in ఇంగ్లీష్). Retrieved 17 October 2024.
  8. 10TV Telugu (17 October 2024). "ఎవరీ జస్టిస్ సంజీవ్ ఖన్నా..? ఆయన్నే తదుపరి సీజేగా చంద్రచూడ్ ఎందుకు ప్రతిపాదించారు ..!" (in Telugu). Retrieved 17 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  9. Andhrajyothy (18 October 2024). "సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా!". Retrieved 18 October 2024.