సంతోష్ యాదవ్ (పర్వతాహకురాలు)
స్వరూపం
సంతోష్ యాదవ్ | |
---|---|
జననం | 1967 అక్టోబర్ 10 , హర్యానా, భారతదేశం |
వృత్తి | పర్వత హొకురాలు |
భార్య / భర్త | ఉత్తంకుమార్ |
సంతోష్ యాదవ్ (జననం 10 అక్టోబర్ 1967) ఒక భారతీయ పర్వతారోహకురాలు. ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన ప్రపంచంలో మొట్టమొదటి మహిళ [1] కాంగ్‌షంగ్ ఫేస్ నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన మొదటి భారతీయ మహిళ. సంతోష్ యాదవ్ మొదట మే 1992లో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించింది.
1992లో ఆమె ఎవరెస్టు శిఖరం ఎక్కే సమయంలో, సంతోష్ యాదవ్ ళ మోహన్ సింగ్ అనే పర్వతారోహకుడితో ఆక్సిజన్ సిలిండర్ ను పంచుకుంది
బాల్యం
[మార్చు]సంతోష్ యాదవ్ భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని రేవారీ జిల్లాలోని జోనియావాస్ గ్రామంలో జన్మించారు. సంతోష్ యాదవ్ కు ఐదుగురు అన్నలు ఉన్నారు. సంతోష్ యాదవ్ స్థానిక గ్రామ పాఠశాలలో చదివి, ఆపై ఢిల్లీకి వెళ్లి అక్కడ పాఠశాలలో చేరింది. కొంచెం ఎక్కువ చదువుకోవాలనే ఆలోచనతో సంతోష్ యాదవ్ జైపూర్‌లోని మహారాణి కాలేజీలో చేరింది,
- ↑ "Santosh Yadav feels motivated to climb Everest again". News.webindia123.com. 2007-05-11. Retrieved 2010-06-20.