సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
Santragachi Chennai Central AC Express
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్
తొలి సేవ21 జనవరి, 2014 [2] [3]
ప్రస్తుతం నడిపేవారుఆగ్నేయ రైల్వే జోన్
మార్గం
మొదలుసంత్రాగచ్చి జంక్షన్
ఆగే స్టేషనులు16
గమ్యంచెన్నై సెంట్రల్
ప్రయాణ దూరం1,655 km (1,028 mi)
రైలు నడిచే విధంవారానికి 2 రోజులు. 22807 సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ - మంగళవారం మరియు శుక్రవారం. 22808 చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ - గురువారం మరియు ఆదివారం.
సదుపాయాలు
శ్రేణులుఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్, ఎసి 3 టైర్
కూర్చునేందుకు సదుపాయాలులేదు
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుఉంది
సాంకేతికత
రోలింగ్ స్టాక్ప్రామాణిక భారతీయ రైల్వే ఎల్‌హెచ్‌బి భోగీలు
పట్టాల గేజ్1,676 మిమీ (5 అడుగులు 6 అం) Indian gauge
వేగం140 km/h (87 mph) గరిష్టం
61.01 km/h (38 mph), విరామములు కలుపుకొని

సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక [1][2] ఇది సంత్రాగచ్చి రైల్వే స్టేషను మరియు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది,

ఇది రైలు నెంబరు: 22807 సంత్రాగచ్చి జంక్షన్ నుండి చెన్నై సెంట్రల్ వరకు గాను మరియు తిరోగమన దిశలో రైలు నెంబరు: 22808 గాను భారత దేశము లోని పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు 4 రాష్ట్రాల్లో సేవలు పనిచేస్తూ భారతీయ రైల్వేలు ద్వారా నిర్వహించబడుతున్నది.

జోను మరియు డివిజను[మార్చు]

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని ఆగ్నేయ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ రైలు నంబరు: 22807 మరియు ఇది వారానికి రెండు రోజులు (మంగళవారం మరియు శుక్రవారం) నడుస్తుంది.

కోచ్లు (భోగీలు)[మార్చు]

రైలు నంబరు: 22807/08 సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో 1 ఏసి ఫస్ట్ క్లాస్, 4 ఎసి 2 టైర్, 10 ఎసి 3 టైర్ మరియు చివరన జనరేటర్ మరియు లగేజి రాక్ ర్యాకులు 2 కలిగి ఉంది. అదనంగా, దీనికి ఒక పాంట్రీ కారు కోచ్ కూడా జత చేయబడింది.[3][4][5]

నేటికి, భారతదేశంలో రైలు సేవలు అత్యంత ఆవశ్యకం కనుక, కోచ్ కంపోజిషన్ భారతీయ రైల్వేలు యొక్క అభీష్టానుసారం ప్రయాణీకుల డిమాండ్ బట్టి సవరించిన బోగీలు ఉండవచ్చును.

సేవలు (సర్వీస్)[మార్చు]

రైలు నంబరు: 22807 సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 27 గంటల 45 నిమిషాలు (59.64 కి.మీ. / గం.) మరియు రైలు నంబరు: 22808 చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 26 గంటల 30 నిమిషాలు (62.45 కి.మీ. / గం.) సమయములో 1655 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు (ట్రెయిను) సగటు వేగం 55 కి.మీ. / గం. (34 మైళ్ళు/గంటకు) కన్నా ఎక్కువ. భారత రైల్వే నిబంధనల ప్రకారం, దీని ఛార్జీల యందు ఒక సూపర్‌ఫాస్ట్ సర్‌చార్జి కూడా కలిపి ఉంటుంది.

రైలు ప్రయాణించు మార్గము[మార్చు]

రైలు నంబరు: 22807 సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సంత్రాగచ్చి జంక్షన్ నుండి ఖరగ్పూర్ జంక్షన్ ద్వారా, కటక్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ జంక్షన్, గూడూరు జంక్షన్ నుండి చెన్నై సెంట్రల్ వరకు నడుస్తుంది.[6][7] ఇది విశాఖపట్నం వద్ద తన ప్రయాణం వ్యతిరేక దిశలో నడుస్తుంది.

విద్యుద్దీకరణ (ట్రాక్షన్)[మార్చు]

ఈ రైలుమార్గం పూర్తిగా విద్యుద్దీకరణ చేయబడింది కనుక, సంత్రాగచ్చికు చెందిన ఒక డబ్ల్యుఎపి4 [8] ఇంజనుతో రైలు సంత్రాగచ్చి నుండి విశాఖపట్నం వరకు నడుస్తుంది. తదుపరి, విజయవాడకు చెందిన ఒక డబ్ల్యుఎం4 [4] ఇంజనుతో రైలు విశాఖపట్నం నుండి గమ్యస్థానం వరకు తన మిగతా ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

సేవలు (ఆపరేషన్)[మార్చు]

  • రైలు నంబరు : 22807 సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సంత్రాగచ్చి జంక్షన్ నుండి ప్రతి మంగళవారం మరియు శుక్రవారం బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది.[7]
  • రైలు నంబరు : 22808 చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ నుండి ప్రతి గురువారం మరియు ఆదివారం బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు సంత్రాగచ్చి చేరుకుంటుంది.[7]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]